చెకుముకి టాలెంట్ టెస్టు - 2018

చెకుముకి టాలెంట్ టెస్టు - 2018 పరీక్ష పాఠశాల స్థాయి లో 8, 9, 10 విద్యార్థులకు నవంబర్ 16 వ తేదిన జరుగును. ఇందులో మొదటి స్థానం వచ్చిన వారికి మండల స్థాయి లో నవంబర్ - 27 వ తేదీన జరుగును. ఇందులో మొదటి స్థానంలో వచ్చిన వారికి జిల్లా స్థాయి లో డిసెంబర్ - 16వ తేదీన జరుగును.
..........  ........జిల్లా నందు నిర్వహించడం జరుగుతుంది.

మీ పాఠశాలలోని 8,9,10 వ తరగతి విద్యార్థులు రాయడానికి సంసిద్ధంగా ఉండండి.
ప్రతి విద్యార్థికి 5/- పరీక్ష ఫీజు గా ఉంటుంది..


16న చెకుముకి సైన్స్‌ పరీక్షలు: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్‌ సంబరాల్లో భాగంగా ఏటా నిర్వహించే సైన్స్‌ పరీక్షలను ఈ న‌వంబ‌రు 16న నిర్వహిస్తున్నట్లు వేదిక బాధ్యులు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సైన్స్‌ పరీక్షలకు సంబంధించిన గోడపత్రికను డీఈవో తో కలిసి జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు  న‌వంబ‌రు 12న‌ ఆవిష్కరించారు.

డీఈవో మాట్లాడుతూ చిన్నారుల్లో విజ్ఞానశాస్త్రంపై అవగాహనను పెంచడంలో చేస్తున్న కృషిని అభినందించారు. వేదిక జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సైన్స్‌ పరీక్షలో భాగంగా న‌వంబ‌రు 16న పాఠశాల స్థాయి, న‌వంబ‌రు 27న మండల స్థాయి, డిసెంబరు 16న జిల్లాస్థాయి పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఆయా దశల్లో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు(తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు) పాల్గొనవచ్చన్నారు. పాఠశాల స్థాయిలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలుంటాయన్నారు. ప్రత్యేక పరీక్షల్లో ప్రతి తరగతి నుంచి ఒక విద్యార్థిని ఎంపికచేసి బృందంగా ఏర్పాటు చేస్తామన్నారు.

Post a Comment

0 Comments

f