తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ 2019 త్వరలో విడుదల చేయనున్నారు

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌: తెలంగాణలో ఇంటర్‌‌ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో  విడుదల చేయనున్నారు. తెలంగాణలోనూ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు తెలంగాణలోనూ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌బోర్డు ఇంటర్‌ పరీక్షల కాలపట్టికను వెల్లడించింది. ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనుండటంతో.. అదే కాలపట్టికను తెలంగాణ ఇంటర్‌బోర్డు కూడా అనుసరించే అవకాశం ఉంది. గత ఏడాది ఏపీ కాలపట్టిక ప్రకారమే ఇక్కడా పరీక్షలు జరిపారు. ఇంటర్‌ పాఠ్య ప్రణాళిక రెండు రాష్ట్రాల్లో ఒకటే అయినందున ఒకే తరహా ప్రశ్నలు వచ్చినా.. లీకేజీ వదంతుల వంటి సమస్యలు ఎదురు కాకుండా తెలంగాణ ఇంటర్‌బోర్డు ఏపీ కాలపట్టికనే అనుసరించింది. ఈ ఏడాదీ ఏపీ కాలపట్టిక ప్రకారమే తెలంగాణలోనూ పరీక్షలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆ ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి ప్రథమ సంవత్సరం, 28 నుంచి రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమవుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.60 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారు. తెలంగాణలో కాలపట్టిక త్వరలో వెల్లడిస్తారు.

ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16వరకు , ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోపు ఫలితాలను వెల్లడించేందుకు ప్రయత్నాలు మొదలవుతాయి

➜ ఇంటర్మీడియట్‌ పరీక్షలు 2019 ఫిబ్రవరి 27 నుంచి మొదలుకానున్నాయి.
➜ మొదటి సంవత్సర పరీక్షలు 27 నుంచి ఆరంభమై మార్చి 16తో ముగుస్తాయి.
➜ రెండో సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి.
➜ ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
➜ ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్షను 2019 జనవరి 28న,
➜ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను జనవరి 30న ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.
➜ వీటిని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌:
ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు 2019 ఫిబ్రవరి ఒకటి నుంచి 20 వరకు జరుగుతాయి..

మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ 
తేదీ - పరీక్ష పేపర్‌
27.02.2019 - సెకండ్‌ లాంగ్వేజ్‌
01.03.2019 - ఇంగ్లిష్‌
05.03.2019 - మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, బోటనీ పేపర్‌ , సివిక్స్‌ పేపర్‌
07.03.2019 - మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బి , జువాలజీ , హిస్టరీ
09.03.2019 - ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌
12.03.2019 - కెమిస్ట్రీ , కామర్స్‌ , సోషియాలజీ , ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్‌
14.03.2019 - జియాలజీ , పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ , లాజిక్‌ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌
16.03.2019 - మోడరన్‌ లాంగ్వేజ్‌

రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ 
తేది - పరీక్ష పేపర్‌
28.02.2019 - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌
02.03.2019 - ఇంగ్లిష్‌
06.03.2019 - మ్యాథమెటిక్స్‌- 2ఏ , బోటనీ , సివిక్స్‌
08.03.2019 - మ్యాథమెటిక్స్‌ - 2బి , జువాలజీ , హిస్టరీ
11.03.2019 - ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌
13.03.2019 - కెమిస్ట్రీ , కామర్స్‌ , సోషియాలజీ , ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్‌
15.03.2019 - జియాలజీ , పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ , లాజిక్‌ , బ్రిడ్జి కోర్సు మేథ్స్‌
18.03.2019 - మోడరన్‌ లాంగ్వేజ్‌

Post a Comment

0 Comments

f