2019 సంవత్సరానికి సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులు (AP)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - సెలవులు – 2019 సంవత్సరానికి సాధారణ సెలవులు మరియు ఐచ్చిక సెలవులు -  ప్రకటన -  నోటిఫికేషన్ - జారీ
సాధారణ పరిపాలన  (పొలిటికల్..బి) శాఖ
జి.ఒ. ఆర్.టి. సంఖ్య.2413, తేదీ:14 -11-2018.
                                                                               
ఉత్తర్వు:-
ఈ క్రింది నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్ తదుపరి సంచికలో ప్రచురించబడుతుంది.

నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుభందం-I (ఎ) పేర్కొన్న వారాoతపు సెలవులలో వచ్చిన పండుగలు మినహాయించి, అనుభందం-I లో నిర్దేశించిన మిగతా అన్ని పండుగల సందర్బముగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2019 సంవత్సరానికి గాను సాధారణ సెలవు దినాలుగా ప్రకటించిబడినది . అదే విధముగా అనుభందం-II లో  2019 లో సాధారణ రోజులలో వచ్చిన ఐచ్చిక సెలవులను  మరియు అనుభందం-II (ఎ)  లో  వారాoతపు సెలవులలో నిర్దేశించిన ఐచ్చిక సెలవులను పేర్కొనబడినది.

2.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనములో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 2019 సంవత్సరంలో అన్ని నెలలలో వచ్చిన  ఆదివారములు  మరియు రెండవ శనివారములలో మూసివేయబడతాయి.

3. రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులు అనుభందం-I లో పేర్కొన్న సాధారణ సెలవులతో  పాటు, అనుబంధం-II లోగల 2019 సంవత్సరపు పండుగలకు  తమ తమ మతానికి సంబందం లేకుoడా ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవు  పొందవచ్చు.  ఐచ్ఛిక సెలవులు ఏదైనా పొందటానికి ముoదస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.  సాధారణంగా ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వ ఉద్యోగికి అత్యవసర విధి నిర్వహణ అవసరాలు లేదని పరిగణిoచినప్పుడే ఉన్నత అధికారులచే మంజూరు చేయబడుతుంది.  సాధారణ సెలవును మంజూరు చేసే అధికారము కల ఉన్నత అధికారులు సాధారణంగా ఐచ్ఛిక సెలవులను మంజూరు చేయగలరు.

4.  ఈ సాధారణ సెలవులు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు మరియు పబ్లిక్ వర్క్స్ విభాగాలు మరియు విద్యాసంస్థలలో పనిచేసే పనివారికి  వర్తించదు.  ఈ సంస్థలకు సెలవులను ప్రకటన సందర్భాల్లో దానికి  సంబంధిoచిన సచివాలయ శాఖల ద్వారా వేర్వేరు ఆదేశాలు జారీ చేయబడును.

5. రంజాన్, బక్రీద్, మొహ్హర్రం మరియు మిలదున్-ఉన్-నబి పండుగల సంభందించి చంద్రుడు కనపడేదాని మీద  ఏదైనా తేదీ మార్పు ఉంటే లేదా ఏ ఇతర హిందూ సెలవు దినం వంటి వాటికి సంబంధించి పండుగ తేదీ మార్పు ఉంటే అది ఎలక్ట్రానిక్ / ప్రింట్ మీడియా ద్వారా ప్రకటించబడుతుoది. అటువంటి క్రమంలో సచివాలయoలో అన్ని శాఖలు మరియు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఉతర్వు కోసం వేచిచూడకుండా మీడియాలో ప్రకటన ప్రకారం చర్య తీసుకోవాలి.

అనుబందం-I
2019  సంవత్సరంలో సాధారణ సెలవలు  
క్రమ. సంఖ్య. సందర్భం/పండుగ తేదీల రోజు శక-ఎరా
1 2 3 4 5
1. భోగి 14.01.2019 సోమవారం పౌష 24– 1940
2. సంక్రాతి 15.01.2019 మంగళవారం   పౌష 25-1940
3. కనుమ 16.01.2019 బుధవారం   పౌష 26-1940
4. రిపబ్లిక్ డే 26.01.2019 శనివారం మాఘ 06 – 1940
5. మహాశివరాత్రి 04.03.2019 సోమవారము ఫాల్గుణ 13- 1940
6. బాబు జగ్జీవన్ రాం జన్మదినము 05.04.2019 శుక్రవారము చైత్ర 15-1941
7. ఉగాది 06.04.2019 శనివారం చైత్ర 16- 1941
8. గుడ్ ఫ్రైడే 19.04.2019 శుక్రవారము చైత్ర 29-1941
9. రంజాన్ 05.06.2019 బుధవారం జ్యేష్ఠ 15-1941
10. బక్రీద్ 12.08.2019 సోమవారము శ్రావణ 21 – 1941
11. స్వాతంత్ర్య దినము 15.08.2019 గురువారము శ్రావణ 24-1941
12. శ్రీ కృష్ణాష్టమి 23.08.2019 శుక్రవారము భాద్రపద 1– 1941
13. వినాయక చతుర్థి 02.09.2019 సోమవారము భాద్రపద 11-1941
14. మొహ్హర్రం 10.09.2019 మంగళవారం   భాద్రపద 19-1941
15. మహాత్మా గాoధీ జయంతి 02.10.2019 బుధవారం ఆశ్వీయుజ 10 – 1941
16. విజయ దశమి 08.10.2019 మంగళవారం   ఆశ్వీయుజ 16 – 1941
17. క్రిస్మస్ 25.12.2019 బుధవారం పౌష 04-1941


అనుబందం-I(A) సంవత్సరం  వారాంతoలో వచ్చిన పండుగలు  2019
1. శ్రీ రామ నవమి/ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి 14.04.2019 ఆదివారం చైత్ర 24-1941
2. దుర్గాష్టమి 06.10.2019 ఆదివారం ఆశ్వీయుజ 14-1941
3. దీపావళి 27.10.2019 ఆదివారం కార్తీక 05-1941
4.   మిలాదున్ నబి   10.11.2019 ఆదివారం కార్తీక 19-1941

నోట్: శ్రీ రామ నవమి/ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి/తమిళ సంవత్సారాది (14.04.2019) పండుగలు అన్ని  సాధారణ సెలవుదినం నాడు వచ్చినవి.

అనుబందం – II
ఐచ్ఛిక సెలవులు
క్రమ. సంఖ్య. సందర్భం/పండుగ తేదీల రోజు శక-ఎరా
1 2 3 4 5
1. నూతన సంవత్సర  దినోత్సవం 01.01.2019 మంగళవారం   పౌష 11-1940
2. హజారత్ సయ్యద్ మహ్మద్ జువానిపురి మెహ్ది జయంతి 21.01.2019 సోమవారము మాఘ 01-1940
3. హజారత్ అలి జన్మదినము 21.03.2019 గురువారము ఫాల్గుణ 30-1940
4. షబ్-ఏ-మిరాజ్ 04.04.2019 గురువారము చైత్ర 14-1941
  5.   మహావీర జయంతి 17.04.2019 బుధవారం చైత్ర 27-1941
6. బసవ జయంతి 07.05.2019 మంగళవారం   వైశాఖ 17-1941
7. బుద్ధ పూర్ణిమ 18.05.2019 శనివారము వైశాఖ 28-1941
8.   జుమాతుల్ విదా   31.05.2019 శుక్రవారము జ్యేష్ఠ 10-1941
9. రథ యాత్ర 04.07.2019 గురువారము ఆషాడం 13-1941
10. వరలక్ష్మి వ్రతం 09.08.2019 శుక్రవారము శ్రావణ 18-1941
11. పార్శి సంవత్సరాది 17.08.2019 శనివారము శ్రావణ 26-1941
12. ఈద్-ఏ-గదీర్ 20.08.2019 మంగళవారం శ్రావణ 29-1941
13. 9వ మొహర్రం 09-09-2019 సోమవారము భాద్రపద 18-1941
14. మహాలయ అమావాస్య 28.09.2019 శనివారము అశ్విన 06-1941
15. మహర్నవమి 07.10.2019 సోమవారము అశ్విన 15-1941
16. నరక చతుర్దీ 26.10.2019 శనివారము కార్తిక 4-1941
17. కార్తిక పూర్ణిమ/గురునానక్ జయంతి 12.11.2019 మంగళవారం   కార్తిక 21-1941
18. యాజ్-దాహుం-షరీఫ్ 09.12.2019 సోమవారము అగ్రహాన్య 18-1941
19. క్రిస్టమస్ ఈవ్ 24.12.2019 మంగళవారం   పౌష 03-1941
20. బాక్సింగ్ డే 26.12.2019 గురువారము పౌష 05-1941


అనుబందం – II(A)
2019 సంవత్సరం  వారాంతoలో వచ్చిన ఇచ్చిక సెలవులు
క్రమ. సంఖ్య. సందర్భం/పండుగ తేదీల రోజు శక-ఎరా
1. శ్రీపంచమి 10.02.2019 ఆదివారం మాఘ 21-1940
2. షబ్-ఏ-బరాత్ 21.04.2019 ఆదివారం వైశాఖ 1-1941
3. షహాదత్ హజరత్ అలి 26.05.2019 ఆదివారం జ్యేష్ఠ 05-1941
4. షబ్-ఏ-ఖదర్ 02-06-2019 ఆదివారం జ్యేష్ఠ 12-1941
5. అర్బయీన్ 20.10.2019 ఆదివారం అశ్విన 28-1941

Post a Comment

0 Comments

f