విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) 2018 / జాతీయ వైజ్ఞానిక ప్రతిభా పరీక్ష

దేశంలోనే కంప్యూటర్, అంతర్జాల ఆధారిత అతి పెద్ద వైజ్ఞానిక ప్రతిభా పరీక్షగా భావించే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం)లో పాల్గొనేవారు. పేరు నమోదు చేసుకునేందుకు గడువు సమీపిస్తోంది. ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 10 వరకు గడువు ఉంది. ఈ పరీక్షను విజ్ఞానభారతి (విభా), విజ్ఞాన్ ప్రసాద్, ఎన్షీఈఆర్టీలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షల విజేతలకు ప్రశంసాపత్రాలతోపాటు నగదు బహుమతులు కూడా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు మేధకు పదును పెట్టేందుకు సిద్ధంకండి!అర్హత:
ఈ ప్రతిభ పరీక్షకు 6 నుంచి 11వ తరగతి చదివే విద్యార్థులు హాజరుకావచ్చు.

రూ. 100 రుసుం చెల్లించాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ తమ పేరును నమోదు చేసుకోవచ్చు. పాఠశాలలు, విద్యాసంస్థలు తమ పాఠశాలల నుంచి పాల్గొనే విద్యార్థుల పేర్లను నమోదు చేయించవచ్చు. పరీక్షను ఆంగ్లం, హిందీ భాషలతో పాటు తెలుగు లోనూ రాయవచ్చు.

పరీక్ష విధానం.. సిలబస్:
ఆయా తరగతుల వారీగా సైన్స్, గణితం పాఠ్యపుస్తకాల్లోని అంశాలు 50 శాతం, విజ్ఞానశాస్త్ర
రంగంలో భారతదేశ కృషిపై 20 శాతం, డాక్టర్ మేఘనాథ్ సాహా, శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రలకు సంబంధించి 20 శాతం, లాజిక్, రీజనింగ్ నుంచి 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. ఈ అంశాలకు సంబంధించిన అధ్యయన సామగ్రిని వీవీఎం వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు.

ప్రధానంగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఇతర పద్దతులతో పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారానే పరీక్ష నిర్వహిస్తారు. లాప్ట్యాప్, సెల్ఫోన్, అంతర్జాల సదుపాయం ఉన్న వారు, అలాగే పాఠశాల కంప్యూటర్ లాబ్ నుంచి పరీక్షలో పాల్గొనవచ్చు. ఈ పరీక్ష రెండు గంటల పాటు నిర్వహిస్తారు. నవంబర్ 25 లేదా 28 తేదీల్లో విద్యార్థులు తమకు అనుకూలమైన రోజును ఎంపిక చేసుకుని పరీక్షలో పాల్గొనవచ్చు. పేర్లు నమోదు చేసుకున్న వారు వీవీఎం ఆపను పొందాల్సి ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వీవీఎం.ఓఆర్జీ. ఇన్ వెబ్ సైటను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్ర సమన్వయకర్త పి. ఆనందంను చరవాణి నెంబర్ 99480 99462లో, అకడమిక్ సమన్వయకర్త వి. గురునాథరావు చరవాణి నెంబర్ 9866549297లో సంప్రదించవచ్చు.

లక్ష్యాలు:
1. విద్యార్థులకు విజ్ఞానశాస్త్రం పై ఆసక్తి కల్పించడం.
2. సంప్రదాయ వైజ్ఞానిక శాస్త్రం నుంచి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం వరకు ప్రపంచానికి మనదేశం చేసిన కృషి పై పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించడం.
కార్యశాల. ఇతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడం.
3. విజ్ఞానశాస్త్రంలో విద్యార్థులు ఉన్నత స్థాయులకు చేరేందుకు మార్గదర్శకుల ద్వారా నిర్దేశనం ఇవ్వడం..పోటీ పరీక్షల ద్వారా శాస్త్రీయ వైఖరి కలిగిన విద్యార్థులను గుర్తించడం.
4. రాష్ట్ర, జాతీయస్థాయిలో విజేతలైన విద్యార్థులను గుర్తించి వారిని బహుమతులు, సర్టిఫికెట్ల ద్వారా సన్మానించడం
5. విజేతలకు దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించేలా అవకాశం కల్పించడం.
6. వైజ్ఞానిక రంగంలో భారతదేశ శాస్త్రవేత్తల కృషిపై అవగాహన కల్పించడం.

ఈ పరీక్షను ఉపయోగించుకోవాలి: 
విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించడానికి దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కాలంలో ఇలాంటి విజ్ఞానశాస్త్ర అంశాలపై నిర్వహించే పోటీల్లో విద్యార్థులు మరింత ఉత్సాహంగా పాల్గొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది

Post a Comment

0 Comments

f