జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ఫలితాలు ఆగేది 76 మందికే, అక్టోబర్ 10న రాతపరీక్ష

గ్రామ పంచాయతీ జూనియర్‌ కార్యదర్శి రాత పరీక్ష ఫలితాలు ఆగేది 76 మందికే. జూనియర్‌ కార్యదర్శి పోస్టులపై హైకోర్టు తీర్పు వారికే వర్తింపు. స్పష్టం చేసిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు. జూనియర్‌ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు 5.62 లక్షల మంది. అక్టోబర్ 10న రాతపరీక్షకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు పూర్తి చేసినది.

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు పోస్టులు : 9,355 
విద్యార్హత : డిగ్రీ 
దరఖాస్తులు : 5.62 లక్షలు 
ఒక్కోపోస్టుకు పోటీ : 59 మంది 
పరీక్ష తేదీ : అక్టోబరు 10 
పేపర్‌-1 : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలు 
పేపర్‌-2 : మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు 

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ఫలితాలు,జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష హాల్ టికెట్స్ ,జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష ఆన్సర్ కీ,జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష తేదీ

1. గ్రామ పంచాయతీ జూనియర్‌ కార్యదర్శి రాతపరీక్షకు హాజరుకానున్న వారిలో 76 మంది ఫలితాలు మాత్రమే ఆగనున్నాయి.
2. మిగతా అభ్యర్థుల ఫలితాలు జేఎన్‌టీయూ మూల్యాంకనం పూర్తికాగానే వెలువడతాయి.
3. రాతప‌రీక్షను అక్టోబ‌రు 10న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
4. మొత్తం 5,62,424 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
5. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు ఉండాలంటూ కొందరు అభ్యర్థులు వాదించటంతో.. హైకోర్టు గత నెలలో మధ్యంతర ఉత్తర్వులను ఇస్తూ.. వారినీ రాత పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది.
6. పరీక్ష ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని పేర్కొనటంతో.. మొత్తం అభ్యర్థుల ఫలితాలన్నీ తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నిలిచిపోతాయనే సందేహాలు తలెత్తాయి.
7. ఎవరైతే హైకోర్టుకు వెళ్లారో వారికి మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.
8. ప్రభుత్వ నిబంధనల ప్రకారమైతే.. జూనియర్‌ కార్యదర్శి పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 39 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయసుండి.. హైకోర్టుకు వెళ్లినవారంతా తమ దరఖాస్తులను వైబ్‌సైట్‌ ద్వారా కాకుండా, పంచాయతీరాజ్‌ అధికారులకు నేరుగా అందించారు. ఇలాంటి దరఖాస్తులు 76 ఉన్నాయి.
9. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫలితాలు ఆగేది ఈ 76 మందికేనని అధికారులు వెల్లడించారు.

Post a Comment

0 Comments

f