ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు (టీచర్స్, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్)

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కొరకు సూచనలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కొరకు సూచనలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్,గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్.

*ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు సూచనలు (టీచర్స్, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఇన్'స్ట్రక్షన్స్)
* ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కార్యక్రమం 01.10.2018 నుండి ప్రారంభమైంది.
* ఓటరు నమోదుకు దరఖాస్తు  చేయటానికి చివరితేది : 06.11.2018.

A. ఉపాధ్యాయ ఓటరు నమోదు కొరకు సూచనలు :
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్‌ 27(5)(బి)ననుసరించి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకొనేందుకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.
1. ఉపాధ్యాయులు/ అధ్యాపకులు నియోజకవర్గ నివాసి అయి ఉండాలి.
(ఓటరు నియోజకవర్గ పరిధిలోనే పనిచెయ్యాలన్న నియమం లేదు). పనిచేస్తున్న జిల్లా వేరుగా ఉన్నా నివాసం నియోజకవర్గంలో ఉంటే ఆ ఉపాధ్యాయులు/ అధ్యాపకులు కూడ ఓటర్లుగా నమోదుకు అర్హులు.

 2. 2018 నవంబర్‌ 1వ తేదీ నాటికి ముందున్న 6 సం|| కాలంలో ( 01.11.2012 నుండి 31.10.2018 వరకు ) 3 సం|| కాలానికి తగ్గకుండా ఉన్నత పాఠశాల ఆపైస్థాయి విద్యాసంస్థలలో ఉపాధ్యాయులు/ అధ్యాపకులుగా పనిచేసి ఉండాలి.(3 సం||కాలం కంటిన్యూగా ఉండనక్కర్లేదు. విడతలవారీగా కూడ ఉండవచ్చు.)

3.  ఉపాధ్యాయుడు రెగ్యులర్‌/ అడ్‌హక్‌గా నియమించబడి (పుల్‌టైం ఉపాధ్యాయునిగా) ఉండాలి. పార్ట్‌టైం టీచర్లు ఓటర్లుగా అర్హులుకారు.

4. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు/కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు/ అధ్యాపకులు కూడా ఓటర్లుగా నమోదు అగుటకు (ఎ) వారి సర్వీసు సర్టిఫికెటును జిల్లా స్థాయి పర్యవేక్షణాధికారి (DEO/RIO) ధృవీకరించాలి. (Attest చేయాలి.) (బి) గత 6 సం||ల కాలంలో చెల్లించిన GPF/EPF వివరాలను PF నెంబర్‌తో సహా EROసమర్పించాలి. (Memo No.3056/Elcs.E/A3/2016-- of the Chief Electoral Officer, Telangana,  dt 29.09.2016) పేరా 4లోని (xvii,xviii) ప్రకారం.

5. పాత ఓటర్ల జాబితా ఉండదు. అర్హులైన ఉపాధ్యాయులు/అధ్యాపకులు అందరూ ఓటరుగా నమోదుకోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలి.

6. ఓటరుగా నమోదుకోసం ఫారం -19లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంలో ఫోటో అంటించాలి.

7.  ఉపాధ్యాయుడు పనిచేసిన కాలానికి సంబంధించి అనెగ్జరు-2 నందలి ప్రొఫార్మాలో ప్రధానోపాధ్యాయుడు/ప్రిన్సిపాల్‌ జారీచేసిన ధృవపత్రం సమర్పించాలి. ( ఫారం 19లోనే సర్వీస్‌ సర్టిఫికెట్‌ ముద్రించబడింది )

8. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను నివాస ప్రాంతంలోని సహాయనమోదు అధికారి (మండలంలో తహసిల్‌దారు) కి సమర్పించాలి.

9. ప్రధానోపాధ్యాయుడు/ ప్రిన్సిపల్‌ కవరింగ్‌లెటర్‌తో విద్యాసంస్థకు సంబంధించిన మొత్తం దరఖాస్తులు (బల్క్‌గా) సమర్పించవచ్చు

10. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయదలచినవారు www.ceotelangana.gov.in లో దరఖాస్తు చేయవచ్చు. వెరిఫికేషన్‌ కొరకు నివాసానికి వచ్చినప్పుడు సర్వీసు సర్టిఫికెట్‌ ఒరిజనల్‌ అందజేయాలి.

B. గ్రాడ్యుయేట్‌ ఓటరు నమోదు కొరకు సూచనలు:
1. గ్రాడ్యుయేటు ఓటరు నమోదుకొరకు ఫారం-18లో ధరఖాస్తు చేసుకోవాలి. తేదీ : 31.10.2015 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు గ్రాడ్యుయేటు ఓటరు నమోదుకు అర్హులు. అనగా తేదీ :01.11.2018 నాటికి డిగ్రీ పాసై మూడు సం||రాలు పూర్తి కావాలి.

2. పాత ఓటర్ల జాబితా ఉండదు. అర్హులైన ఉపాధ్యాయులు/అధ్యాపకులు అందరూ ఓటరుగా నమోదుకోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలి.

3. డిగ్రీ సర్టిఫికేట్‌ కాపీని దరఖాస్తుతో జత చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు/ ఉపాధ్యాయులు కార్యాలయాధిపతి చేత డిగ్రీని ధృవీకరిస్తే సరిపోతుంది. ( వారు డిగ్రీ సర్టిఫికేట్‌ కాపీ జత చేయనవసరం లేదు.)

4. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయదలచినవారు www.ceotelangana.gov.in  లో దరఖాస్తు చేయవచ్చు. వెరిఫికేషన్‌ కొరకు నివాసానికి వచ్చినప్పుడు డిగ్రీ సర్టిఫికెట్‌/ధృవపత్రం ఒరిజనల్‌ చూపించాలి.

5. నివాస ధృవీకరణ (అడ్రస్‌ ప్రూఫ్‌) ఏదైనా జత చేయాలి.


గ్రాడ్యుయేట్ MLC ఓటు నమోదుకు కావల్సినవి:
(ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నియోజకవర్గ పట్ట భద్రుల ఎన్నికల కోసం)
1) .Form 18
2) .Degree మెమో మరియు డిగ్రీ ప్రొవిసనల్ xerox ఇవ్వాలి.
సూచన:- 31/10/2015 లోపు గ్రాడ్యుయేషన్ (ఏదైనా డిగ్రీ) పూర్తయిన వారు అర్హులు.
అనగా డిగ్రీ పూర్తి చేసి  1/11/2018 నాటికి  కనీసం మూడు సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
3) ఒక Passport size PHOTO
4) ఆధార్ కార్డ్ మరియు ఓటర్ id కార్డ్ xerox ఇవ్వాలి.
5) డిగ్రీ మెమో మరియు డిగ్రీ ప్రొవిసనల్ xerox లపై గెజిటెడ్ HM సంతకం చేయించుకొని, MRO కు లేదా RDO కు సమర్పించాలి.
Form 18 లోని Receipt from application (దరఖాస్తు రశీదు) తీసుకొనవలయును*
లేదా
"మీ సేవా" నందు online submission చేయవచ్చు. ఇక్కడ submit చేసేముందు ఓటు నమోదుకు మనం పెట్టిన PROOFS scan చేసి submit చేయాల్సి ఉంటుంది Vote inquiry కి వచ్చినపుడు మీరు submit చేసిన PROOFS చూపించవలసి ఉంటుంది
ఓటు నమోదుకు చివరి తేదీ : 6/11/2018


ఉపాధ్యాయుల నియోజకవర్గం కు సంబందించిన వివరాలు:
MLC అభ్యర్థిత్వం 29.03.2019 తో ముగుస్తున్నందున కొత్త ఓటర్ల జాబితా రూపొందించడానికి 01.10.2018 న నోటీస్ జారీ చేయనైనది.

01.11.2012 నుండి 01.11.2018 వరకు గల ఆరు సంవత్సరాల సర్వీసు లో,  కనీసం 03 సంవత్సరములు ఉన్నత పాఠశాల పైబడి యూనివర్సిటీ వరకు ఏ విద్యసంస్థలో ఆయినా బోధనా అనుభవం కలిగి ఉండాలి, గతంలో  ఉపాధ్యాయ ఓటరు జాబితాలో ఉన్నవారు సైతం తిరిగి తప్పకుండా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.

ప్రస్తుతం దరఖాస్తు చేసినవారిని మాత్రమే ఓటరు జాబితాలో పొందుపరచడం జరుగుతుంది.

అర్హతలు:
1. భారతీయ పౌరుడై ఉండాలి.
2. నియోజకవర్గంలో సాధారణ  నివాసియై ఉండాలి.
3. 01.11.2012 నుండి 01.11.2018 వరకు గల ఆరు సంవత్సరాల సర్వీసు లో, కనీసం 03 సంవత్సరములు ఉన్నత పాఠశాల పైబడి యూనివర్సిటీ వరకు ఏ విద్య సంస్థలో ఆయినా బోధనా అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:
1. ఫారం నెం. 19 పూర్తిగా నింపి ( పాస్పోర్ట్ సైజ్ ఫొటో తో సహా) సంబందిత తహసీల్దార్ / రెవెన్యూ డివిజన్ అధికారి గారికి అందజేయాలి.
2. విద్యాసంస్థలో పనిచేసిన అనుభవ సర్టిఫికెట్ ను సంభందిత అధికారి సంతకం చేయించి అట్టి పత్రాన్ని ఫారంతో జతపరచాలి.

3. అభ్యర్థి స్వయంగా లేదా పోస్టు ద్వారా కానీ దరఖాస్తు సమర్పించవచ్చు.

4. విద్యాసంస్థలో అర్హత కలిగిన ఉపాధ్యాయ సంస్థల ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ ఓటరు నమోదు అధికారిగారికి దరఖాస్తు సమర్పించవచ్చు.

5.  తప్పుడు ధృవీకరణ/ తప్పుడు సమాచారంతో చేసిన దరఖాస్తుదారులు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హులు.

6. ఫారం 19 సంబంధిత తహసీల్దార్ / రెవెన్యూ డివిజన్ అధికారి గారి కార్యాలయాలలో పొందవచ్చు. ప్రైవేటుగా ముద్రించిన దరఖాస్తులు, ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి తీసుకున్న దరఖాస్తులు కూడా చెల్లుబాటవుతాయి.

7. దరఖాస్తులకు చివరితేది : 06.11.2018
ముసాయిదా జాబితా ప్రచురణ : 01.01.2019
అభ్యంతరాల స్వీకరణ : 31.01.2019

ఓటర్ల జాబితా ప్రచురణ : 20.02.2019...

Post a Comment

0 Comments

f