కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష 2019

సైనిక్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష జనవరి ఆరున: విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కిలికిరి లోని సైనిక్ స్కూల్‌లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిలిటరీ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రమాణాలకు సరిపోయే రీతిలో సంసిద్ధులను చేస్తారు.

కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూల్‌ ప్రవేశ పరీక్ష 2019,సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2019,కోరుకొండ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,కలికిరి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019

ప్రవేశాలు కల్పించే తరగతులు: ఆరు, తొమ్మిది
నోట్: కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆరోతరగతి: 
సీట్ల సంఖ్య - 70
విద్యార్థులు 2007, ఏప్రిల్ 31 నుంచి 2009, మార్చి 1 మధ్య (ఆ రెండు రోజులు కలుపుకొని) జన్మించి ఉండాలి.

తొమ్మిదో తరగతి:
సీట్ల సంఖ్య - 20
8 విద్యార్థులు 2004, ఏప్రిల్ 31  నుంచి 2006, మార్చి 1 మధ్య జన్మించి ఉండాలి.

కరికులమ్: సీబీఎస్‌ఈ 10+2 విద్యావిధానంలో విద్యను అందిస్తారు.

ఎంపిక: 
ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం రాతపరీక్ష(6 జనవరి 2019) ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: 
హైదరాబాద్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ.

స్కాలర్‌షిప్స్: 
ప్రతిభ/ తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా డిఫెన్స్ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.

రిజర్వేషన్లు:  
మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో 67 శాతం సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ర్టాల, యూటీ అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. రక్షణశాఖలో పనిచేసిన వారి పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయిస్తారు.

నోట్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగినంతగా లేనిపక్షంలో ఆ సీట్లను జనరల్ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (అక్టోబర్ 08 నుంచి ప్రారంభం, డిసెంబర్ 1 చివరితేదీ)

దరఖాస్తు ఫీజు: 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే జనరల్/డిఫెన్స్ విద్యార్థులు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలు రూ. 250/- చెల్లించాలి.

చివరితేదీ:  ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 8 నుండి నవంబర్ 26 వరకు.
ఆన్లైన్ లో దరఖాస్తులకు 2018, డిసెంబర్ 1

పూర్తి వివరాల కోసం
 08922-246119 & 246168 మరియు www.sainikschoolkorukonda.org లో సంప్రదించవచ్చు.
లేదా 0877-2500270 మరియు www.kalikirisainikschool.com

#కోరుకొండ:
దేశం నలుమూలలా 25 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. వీటిలో విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ పాఠశాల ఒకటి. 1961లో సైనిక్‌ పాఠశాల విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టింది. 1962 జనవరి నుంచి విద్యా సంవత్సరం మొదలైంది. విజయనగర గజపతి రాజులు కోరుకొండలో నిర్మించిన చారిత్రిక కోట భవన సముదాయం లో 1911 నుంచి సైనిక్‌ పాఠశాల పనిచేస్తోంది. ఇంతరకు 60 బ్యాచ్‌లు పాఠశాల నుంచి వెళ్లాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రక్షణ శాఖలో కీలకమైన ఆఫీసర్స్‌ కేడర్‌లో వివిధ స్థాయుల్లో ఉన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఈ పాఠశాల విద్యార్థే

పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశమే లక్ష్యంగా కోరుకొండ సైనిక్‌ పాఠశాల విద్యార్థులకు శిక్షణను ఇస్తారు. సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రకారం ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాల బోధన ఉంటుంది. ఆరు నుంచి పన్నెండో తరగతి(ఇంటర్‌) వరకు ఇక్కడే చదువుకోవచ్చు.

ఇక్కడ చేరిన విద్యార్థులు ఏటా రూ.1.10 లక్షలు ఫీజుగా చెల్లించాలి. అయితే ప్రతిభ కనబర్చిన 50శాతం మంది విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. ఒక్కో విద్యార్ధికి సుమారుగా రూ.53వేలు స్కాలర్‌షిప్‌ అందించే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను అందిస్తుంది.

#కలికిరి:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో 2014 ఆగస్టు 20న సైనిక్‌ స్కూలును ప్రారం భించారు.

సకల సౌకర్యాలతో బోధన:
కలికిరి కడప మార్గంలో ఏర్పాటు చేసిన ఈ సైనిక్‌ స్కూలు భవన సముదాయాలను 84ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించారు. అడ్మినిస్ర్టేటివ్‌, అకడమిక్‌ బ్లాక్‌లు, మెస్‌, నాలుగు డార్మెంటరీలు, ఎంఐ (ఆస్పత్రి), సీఎ్‌సడి (మిలటరీ క్యాంటిన్‌), ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం, సిబ్బంది క్వార్టర్స్‌తో పాటు ఫుట్‌బాల్‌, హాకీ, వాలీబాల్‌, లాంగ్‌టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌ తదితర క్రీడలకు సంబంధించిన కోర్టులు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో స్విమ్మింగ్‌పూల్‌, హార్స్‌రైడింగ్‌లకు వసతులు సమకూరనున్నాయి.

స్కూలులో విద్యనభ్యసిస్తున్న కేడెట్లకు ఎన్‌సీసీలోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఏటా ఎడ్యుకేషన్‌ టూర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేరళలోని నేవీ అకాడమి, హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టు అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలకు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడి పద్ధతులు శిక్షణ తదితరాలపై అవగాహన కల్పిస్తున్నారు.

Post a Comment

0 Comments

f