ఏపీ పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు 2019

పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు గడువు.. నవంబరు 2: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల రుసుము చెల్లింపునకు నవంబరు 2 వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీ పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు 2019,పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు గడువు,ఏపీ పదో తరగతి పరీక్షలు,ఏపీ ఎస్ఎస్సి  ఎగ్జామ్ ఫీ డేట్స్

అపరాధ రుసుము రూ.50తో నవంబరు 22 వరకు,
రూ.200తో డిసెంబరు 3 వరకు,
అపరాధ రుసుము రూ.500తో డిసెంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పరీక్షలు వచ్చే మార్చిలో నిర్వహించనున్నారు.

రెగ్యులర్‌ అభ్యర్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125,
మూడు లోపు సబ్జెక్టులకు రూ.110,
మూడు కంటే ఎక్కువ ఉంటే రూ.125 చెల్లించాలి.
వృత్తి విద్య విద్యార్థులు రెగ్యులర్‌ రుసుము రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

సంవత్సరానికి గ్రామాల్లో రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేల లోపు ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
వెబ్‌సైట్‌ : http://main.bseap.org/

Post a Comment

0 Comments

f