ఏపీ డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్: ఏపీ టీఆర్‌టీ టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నోటిఫికేషన్ 2018

ఏపీ డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్: ఏపీ టీఆర్‌టీ టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నోటిఫికేషన్ 2018
7729 పోస్టులతో డీఎస్సీ. ఏపీ డీఎస్సీ మేనేజ్‌మెంట్‌ వారీగా పోస్టులు, ఏపీ డీఎస్సీ కేటగిరీ వారీగా పోస్టులు, ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌. ఏపీ లో టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. టీఆర్‌టీ, టెట్‌ కమ్‌ టీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించి, నియామక ప్రక్రియ చేపడతారు. రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,729 టీచర్‌ పోస్టులను జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ)ల ద్వారా భర్తీచేసేందుకు వీలుగా శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచారు. ఓసీ అభ్యర్థులకు 42 నుంచి 44 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 నుంచి 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 52 నుంచి 54 సంవత్సరాలకు పెంచారు.

ఏపీ డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్,ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌,ఏపీ టీఆర్‌టీ,ఏపీ టెట్‌ కమ్‌ టీఆర్‌టీ,ఏపీ డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్

ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో డీఎస్సీ-2018 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి, అదనపు డైరెక్టర్‌ ఏ.సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మూడుసార్లు డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ వివిధ కారణాలవల్ల నోటిఫికేషన్‌ ఇవ్వలేకపోయామని, ఇందుకు యువత క్షమించాలని కోరారు. ఆర్థిక, న్యాయశాఖల నుంచి ప్రశ్నలు రావడంతో వాటికి వివరణలివ్వడం వల్ల డీఎస్సీ ప్రక్రియ ఆలస్యమైన విషయం వాస్తవమేనన్నారు.

డీఎస్సీ షెడ్యూల్‌ వివరాలు
అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల
నవంబరు 1 నుంచి 15 వరకూ ఫీజు చెల్లింపు
నవంబరు 1 నుంచి 16 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
నవంబరు 1 నుంచి 12 వరకూ హెల్ప్‌డెస్క్‌ సర్వీసులు
నవంబరు19 నుంచి 24 వరకూ పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబరు 17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
నవంబరు 29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌
డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్షలు
11న స్కూల్‌ అసిస్టెంట్స్‌ (లాంగ్వేజెస్‌) రాత పరీక్షలు
12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాత పరీక్ష
14, 26తేదీల్లో టీజీ టీచర్స్‌, ప్రిన్సిపాల్స్‌ రాతపరీక్ష
17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ రాత పరీక్షలు
27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాత పరీక్ష
28 నుంచి 2019 జనవరి 2 వరకూ ఎస్‌జీటీ రాత పరీక్ష

మేనేజ్‌మెంట్‌ వారీగా పోస్టులు:
పాఠశాల విద్యాశాఖ (గవర్నమెంట్‌/జెడ్పీ/ఎంపీపీ) స్కూళ్లు- 4341 పోస్టులు,
మున్సిపల్‌ స్కూళ్లు-1100 పోస్టులు,
మోడల్‌ స్కూళ్లు- 909 పోస్టులు,
గిరిజన సంక్షేమ స్కూళ్లు-800 పోస్టులు,
ఏపీఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లు-175 పోస్టులు,
బీసీ వెల్ఫేర్‌ స్కూల్స్‌ - 404 పోస్టులు.

కేటగిరీ వారీగా పోస్టులు:
ఎస్‌జీటీ-3,666 పోస్టులు,
స్కూల్‌ అసిస్టెంట్లు-1625,
లాంగ్వేజ్‌ పండిట్లు-452,
పీఈటీ-476,
టీజీటీ-715,
పీజీటీ- 583,
ప్రిన్సిపాల్‌- 89,
మ్యూజిక్‌-76,
ఆర్ట్‌-22,
క్రాఫ్ట్‌-25 పోస్టులు.


#ఏపీ డీఎస్సీ టీచర్స్ రిక్రూట్మెంట్, #ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌, #ఏపీ టీఆర్‌టీ, #ఏపీ టెట్‌ కమ్‌ టీఆర్‌టీ, #ఏపీ డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్

Post a Comment

0 Comments

f