సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2019, సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2019, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న సైనిక పాఠశాలల్లో 2019-20 విద్యాసంవత్సరాకిగాను 6, 9వతరగతి (బాలురు) ప్రవేశాలకు నిర్వహించే అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది.

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2019, సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2019, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019

అఖిలభారత స్థాయిలో నిర్వహించే పరీక్ష రాసి, ప్రతిభ చూపితే దేశవ్యాప్తంగా ఉన్న పదకొండు సైనిక పాఠశాలల్లో చేరే అవకాశం లభిస్తుంది. ఇటీవలే ఆలిండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2019 ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం ఐదు, ఎనిమిది తరగతులు చదువుతున్న అబ్బాయిలు ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సైనిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే పద్ధతి విభిన్నంగా ఉంటుంది. రాతపరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఆరో తరగతి వారికి ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. తొమ్మిది తరగతి వారికి ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. వీరు సమాధానాలను ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.

రాతపరీక్షను ఆరోతరగతి వారికి 300 మార్కులకూ, ఎనిమిదో తరగతి వారికి 400 మార్కులకూ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎవరైనా ఇద్దరికి ఒకేలా మార్కులు వస్తే గణిత మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులోనూ ఒకేలా మార్కులు వస్తే.. ఎనిమిదో తరగతి వారికి ఇంగ్లిష్‌ మార్కులనూ, ఆరోతరగతి వారికి ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు.

జనరల్‌, డిఫెన్స్‌ సర్వీసెస్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 25% మార్కుల చొప్పున మొత్తంగా 40% మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ వారికి కనీస అర్హత మార్కులంటూ ఏమీ లేవు. ఒకవేళ వారు జనరల్‌ అభ్యర్థులతోపాటుగా మార్కులను సాధిస్తే, వారిని నేరుగానే తీసుకుంటారు.

సైనిక్ స్కూల్స్: కుంజుపుర, కపుర్తలా, ఇంఫాల్, కజకూటం, అమరావతినగర్, సతారా, బాల్చడి, గోల్పార, పురులియా, కోరుకొండ, గోరఖల్

అర్హత: గుర్తింపు పొందిన స్కూల్ నుంచి ప్రస్తుతం ఐదోతరగతి/ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు.
* ఆరో తరగతికి: ఐదో తరగతి చదువుతున్నవారు. వయసు మార్చి 31, 2019 నాటికి 10-12 సంవత్సరాల మధ్య ఉండాలి.
* తొమ్మిదో తరగతికి: గుర్తింపు పొందిన బోర్డు/ స్కూలు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్నవారు. మార్చి 31, 2019 నాటికి 13-15 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సు: 2019 మార్చి 31 నాటికి ఆరోతరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏండ్ల మధ్య ఉన్న బాలురు అర్హులు.

రిజర్వేషన్‌: 
* మొత్తం సీట్లలో ఎస్‌సీ వారికి 15%, ఎస్‌టీ వారికి ఏడున్నర శాతం సీట్లు కేటాయిస్తారు.
* మిగిలినవాటిలో 67% సీట్లను సైనిక్‌ స్కూలు ఉన్న ప్రదేశాన్నిబట్టి అక్కడి లోకల్‌ విద్యార్థులకు కేటాయించారు. మిగతా 33% సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడవచ్చు.
* 25% సీట్లను సర్వీస్‌మెన్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ పిల్లలకు కేటాయించారు.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 400, ఎస్సీ/ఎస్టీలకు రూ. 250/-

ఎంపిక: ప్రవేశ పరీక్ష

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.. అధికార వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు అక్టోబరు 9 నుంచి నవంబరు 26 వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫీజుగా జనరల్‌, డిఫెన్స్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.400, ఎస్‌సీ, ఎస్‌టీవారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ కమ్ ప్రాస్పెక్టస్: అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకు ఇస్తారు.

దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: డిసెంబర్ 1

సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష: 2019 జనవరి 6

మెడికల్ ఎగ్జామ్: 2019 ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు

వెబ్‌సైట్: http://sainikschooladmission.in/.

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: డిసెంబరు 1, 2018
పరీక్ష తేదీ: జనవరి 6, 2019
వైద్యపరీక్ష: ఫిబ్రవరి 11, 2019 నుంచి ఫిబ్రవరి 28, 2019 వరకు.
ఇతర వివరాలకు: http://sainikschooladmission.in/ ను సందర్శించవచ్చు.

Post a Comment

0 Comments

f