9వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష 2019 (నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్)

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు. ఒకటి. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలకు మరే విద్యా సంస్థలు సాటి రావని కచ్చితంగా చెప్పొచ్చు. అటువంటి నవోదయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

9వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష 2019,9th  క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,నవోదయ 9వ తరగతి ప్రవేశాలు,నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019,నవోదయ పాఠశాలలోని ఖాళీల వివరాలు,నవోదయ ప్రవేశ పరీక్ష తేది

జాతీయ విద్యా విధానం 198 ప్రకారం దేశ వ్యాప్తంగా (తమిళనాడు మినహా) జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 630 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి (28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి). విద్యతోపాటు విలువలు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే వీటి లక్ష్యం. అంతేకాకుండా జాతీయ సమగ్రతను పెంపొందించే ప్రయత్నం చేస్తారు. క్రీడలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. తద్వారా విద్యార్థి సర్వోతోముఖాభివృద్దికి అవసరమైన అన్ని రకాల అంశాలకు జవహర్ నవో
దయ విద్యాలయాలు వేదికలుగా ఉంటాయి.

అర్హత: 2018 19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఎనిమిదో తరగతి చదివి ఉండాలి (జవహర్ నవోదయ ఉన్న జిల్లా లోని స్థానిక విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి).

వయసు: 2003, మే 1-2007, ఏప్రిల్ 30 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

నమూనా ప్రశ్నపత్రాన్ని వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష ఫలితాలను సంబంధిత పాఠశాల నోటీస్ బోరుతోపాటు వెబ్ సైట్లో ఉంచుతారు.
ఎంపికైన అభ్యర్థులకు స్పీడ్ పోస్ట్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారాన్ని చేరవేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.
ఓఎంఆర్ షీట్లో సమాధానాలను గుర్తించడానికి రెండున్నర గంటల (150 నిమిషాలు) సమయం ఇస్తారు.
ప్రశ్నల క్లిష్టత ఎనిమిదో తరగతి స్థాయిలో ఉంటుంది. ఇందులో ఉండే సబ్జెక్ట్లు..

పరీక్ష విధానం:
సబ్జెక్ట్ మార్కులు
ఇంగ్లీష్: 15
హిందీ:  15
మాథ్స్ : 35
సైన్స్ : 35
మొత్తం: 100

ప్రత్యేకతలు: ప్రతి జిల్లాలో సహ విద్య ఆశ్రమ పాఠశాలలు బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ 1:8 నిష్పత్తిలో కంప్యూటర్ ల్యాబ్ యోగా శిక్షణ నీట్-2018 పరీక్షలో 84.5 శాతం మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు.

బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సరాసరి: 10వ తరగతిలో 75.12 శాతం, 12వ తరగతిలో 74.20 శాతం
జేఈఈ-మెయిన్ 2018లో 37.4 శాతం నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు.

నవోదయ పాఠశాలలోని ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు
వివరాలు... ఖాళీలు
అనంతపురం: 06
చిత్తూరు: 14
తూర్పు గోదావరి-1: 15
తూర్పు గోదావరి-2: 4
గుంటూరు: 10
కడప: 4
కృష్ణా: 9
కర్నూలు: 5
నెల్లూరు: 8
ప్రకాశం-1: 11
ప్రకాశం-2: 7
శ్రీకాకుళం: 11
విశాఖపట్నం:5
విజయనగరం: 8
పశ్చిమగోదావరి: 14
తెలంగాణలో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు
ఆదిలాబాద్: 2
కరీంనగర్: 7
ఖమ్మం: 10
మహబూబ్నగర్: 10
మెదక్: 12
నల్గొండ: 15
నిజామాబాద్:15
రంగారెడ్డి:10
వరంగల్: 6

9వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష 2019, 9th  క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, నవోదయ 9వ తరగతి ప్రవేశాలు, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019, నవోదయ పాఠశాలలోని ఖాళీల వివరాలు,నవోదయ ప్రవేశ పరీక్ష తేది

Post a Comment

0 Comments

f