టీఎస్‌పీఎస్సీ వీఆర్వో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు

టీఎస్‌పీఎస్సీ వీఆర్వో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన VRO ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంది. పరీక్ష రాసే అభ్యర్థులు కొన్ని నెలల పాటు కఠోర శ్రమ చేసి పరీక్షకు సన్నధ్దం అవుతున్నారు. పరీక్షల సమయంలో ఏచిన్న పొరపాటు చేసినా వారి కలలు కల్లలవుతాయి. VRO రాత పరీక్ష జరగనుంది. VRO కావాలనే బలమైన కోరిక గల అభ్యర్థులు ఒత్తిడికి గురి కాకుండా కొన్ని సూచనలు పాటించి పరీక్ష గదిలో చిన్న చిన్న తప్పులను అధిగమిస్తే విజయం తధ్యం. పరీక్ష ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు.
టీఎస్‌పీఎస్సీ వీఆర్వో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు, సూచనలు:
1. అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
2. పరీక్ష ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఉదయం 10.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.30 గంటల నుంచే సెంటర్ లోకి అనుమతిస్తారు.
3. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు హాల్ టికెట్ను తీసుకెళ్లాలి.
4. హాల్ టికెట్ రాని అభ్యర్డులు ఫొటో గుర్తింపుకార్డు (ఉదాహరణకు: పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్, డైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డు)తోపాటు రెండు పాసపోర్టు సైజ్ ఫొటోలను తీసుకెళ్లి పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్లను కలువాల్సి ఉంటుంది.
5. ఓఎమ్మార్ ఆన్సర్ షీట్లో బబుల్ చేయడానికి బ్లూ లేదా బ్లాక్ బాలీపాయింట్ పెన్ను వాడాలి. అభ్యర్థులు ప్రత్యేక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాలి.
6. వైట్నర్, బ్లేడ్, ఎరైజర్ ఉపయోగించడం నిషేధం.
7. మొబైల్ ఫోన్లు, క్యాలిక్లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
8. షూలు, ఆభరణాలు, చైన్లు, స్టడ్స్, చేతి వాచ్లు తెచ్చుకోవడం నిషేధం.
9. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. పూర్తి వివరాల కోసం టీఎసపీఎస్సీ వెబ్ సైట్ను సంప్ర దించాలి.

ఒత్తిడికి గురి కావొద్దు:
VRO బలమైన కోరిక ఉన్నవారిని విజయం వైపు నడిపిస్తుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఒత్తిడికి లోను కావొద్దు. మనకు తెలియకుండానే ఒత్తిడితో పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఇన్ని రోజులు పడిన శ్రమ వృథా అవుతుంది. అందుకే అభ్యర్థులు పరీక్ష విధానంలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా వ్యవహారించాలి. హాల్‌టెకట్‌ దగ్గర నుంచి ఓఎంఆర్‌ షీట్‌, సమయం పరీక్ష కేంద్రంలో వ్యవహర శైలి తదితర అంశాలు అన్ని నిబంధన మేర పాటించాలి. ఎలాంటి తప్పిదం జరిగినా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదని గమనించాలి.

Post a Comment

0 Comments

f