తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019

తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019 /టీఎస్  స్కూల్ అకాడమిక్ క్యాలెండర్: 2018-19 విద్యా సంవత్సరం క్యాలెండర్లు ప్రభుత్వం సిద్ధం చేసింది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించనున్నారు. ఏప్రిల్ 12, 2019తో 2018-19 విద్యా సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 13, 2019 నుంచి మే 31, 2019 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. ఈ ఏడాది ఎస్ఎస్ సి  సిలబస్ ను జనవరి 10, 2019 వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. మార్చిలో జరిగే వార్షిక పరీక్షల కంటే ముందే ఫిబ్రవరిలో ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సిలబస్ ను ఫిబ్రవరి 28 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. 2018-19కు సంబంధించి డే టు డే ప్రోగ్రామ్ ను పాఠశాల విద్య శాఖ రూపొందించింది. విద్య సంవత్సరం క్యాలెండర్ అమలు కోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. వారి అభిప్రాయాలను తీసుకుని విద్యా క్యాలెండర్ పై నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ నుంచి జాతీయ స్థాయి స్కూల్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1లోపే జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించి జాతీయ స్థాయికి వెళ్లే టీమ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. స్కూల్స్ వార్షికోత్సవాలను డిసెంబర్, జనవరి నెలల్లో పూర్తి చేసుకోవాలి.తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019
• ప్రతి శుక్ర వారం మాస్ డ్రిల్ ఉంటుంది.
• ప్రతి 4వ శనివారం హరితహారం, స్వచ్ స్కూల్
• ప్రతి శనివారం బాల సభను నిర్వహించాలి.


• జూన్ 1 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం
• చివరి పనిదినం ఏప్రిల్ 12, 2019
• ఏప్రిల్ 13, 2019 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
• జనవరి 10 నాటికి ఎస్ఎస్సీ సిలబస్ పూర్తి …
• ఫిబ్రవరిలో ఎస్ఎస్సీ ఫ్రీ ఫైనల్,
• మార్చిలో ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు
అక్టోబర్ 9 నుంచి 21 వరకు దసరా సెలవులు


నెలల వారీగా పనిదినాలు
1. జూన్, 2018 - 24
2. జూలై, 2018 - 25
3. ఆగస్టు, 2018 - 23
4. సెప్టెంబర్, 2018 - 21
5. అక్టోబర్, 2018 - 15
6. నవంబర్, 2018 - 22
8. డిసెంబర్, 2018 - 23
9. జనవరి, 2019 - 19
10. ఫిబ్రవరి, 2019 - 23
11. మార్చి, 2019 - 24
12. ఏప్రిల్, 2019 - 10

పాఠశాల సెలవులు
1. దసరా సెలవులు అక్టోబర్ 9 నుంచి 21 వరకు- 13 రోజులు
2. క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 29 వరకు-7 రోజులు
3. సంక్రాంతి సెలవులు జనవరి 11, 2019 నుంచి 17.01.2019-7 రోజులు


ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు
1. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 : 31.07.2018 లోపు
2. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-2 : 31.09.2018 లోపు
3. సమ్మెటీవ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 : 01.10.2018 నుంచి 08.10.2018
4. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-2 : 30.11.2018 లోపు
5. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-4 : 31.01.2019 లోపు
(ఎస్ఎస్సి) 28.02.2019 (1 నుంచి 9 తరగతి వరకు)
6. సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) : 30.03.2019 నుంచి 08.04.2019 (1 నుంచి 9 తరగతి వరకు)
7. ప్రీఫైనల్ ఎస్ఎస్ ఫిబ్రవరి 28, 2019 లోపు
8. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు మార్చి, 2019

టీఎస్  స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ 2018-2019, తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019, తెలంగాణ పాఠశాల విద్యా సంవత్సరం క్యాలెండర్ 2018-2019, పాఠశాల విద్యా దైనందిని, వేసవి సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్టమస్ సెలవులు, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి స్కూల్ క్రీడలు, స్కూల్స్ వార్షికోత్సవాలు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు, ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు

Post a Comment

0 Comments

f