తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు షెడ్యూల్, ఫీజు వివరాలు, ఫీజు చెల్లింపు తేదీలు

TS Inter Exams Fee due dates, తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు షెడ్యూల్ 2018, టీఎస్ ఇంటర్‌ పరీక్ష ఫీజు షెడ్యూల్ 2018, ఇంటర్‌ పరీక్ష ఫీజు తేదీల వివరాలు, తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు వివరాలు, తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు. 17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు, మార్చిలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలు. ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు అవకాశం. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈనెల 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు  తెలిపింది. రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే వారు కూడా నిర్ణీత తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించారు.ఇంటర్ పరీక్షఫీజు గడువు అక్టోబర్ 24:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఆలస్య రుసుం లేకుండా అక్టోబర్ 24 వరకు గడువు విధిస్తూ ఇంటర్‌బోర్డు మంగళవారం షెడ్యూల్ విడుదలచేసింది.

ఆలస్య రుసుంతో ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి నాలుగు వరకు అవకాశం ఉన్నదని బోర్డు సెక్రటరీ స్పష్టంచేశారు.

విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలుచేసిన కాలేజీలు సకాలంలో వాటిని ఇంటర్‌బోర్డుకు చెల్లించాలని, ఆ మేరకు విద్యార్థులకు సమాచారం అందించాలని ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలను ఆయన ఆదేశించారు.

2018-19 విద్యాసంవత్సరంలో 1,350 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు చెప్పారు. ఆయా కాలేజీల విద్యార్థుల పరీక్షల ఫీజులనే అనుమతిస్తామని వెల్లడించారు.

కాలేజీకి వెళ్లకుండా, ప్రైవేటుగా పరీక్ష ఫీజులు చెల్లించాలనుకున్న విద్యార్థులు మాత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపులేని 62 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో సుమారు 34 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు బోర్డు వద్ద సమాచారం ఉన్నది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత తీసుకొస్తామని బోర్డు అధికారులు తెలిపారు.

ఇంటర్‌ ఫీజు షెడ్యూల్:
ఈ నెల 17 నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం... తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ప్రథమ, ద్వితీయసంవత్సరం చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షఫీజు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు సెక్రటరీ షెడ్యూల్‌ను విడుదలచేశారు. ఈ నెల 17 నుంచి పరీక్షఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారభంకానున్నది. ఎటువంటి ఆలస్యరుసుం లేకుండా అక్టోబర్ 24 వరకు గడువు విధించారు. రూ.5,000 రుసుంతో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ప్రైవేటుగా పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.


ఫీజు చెల్లింపు తేదీలు.. 
17–9–2018 నుంచి 24–10–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు
25–10–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు
9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు
27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు
12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు

ఫీజు వివరాలు.. 
జనరల్, వొకేషనల్‌ థియరీ పరీక్షల ఫీజు రూ.460
థియరీ, ప్రాక్టికల్‌ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620
బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు రూ.170
బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120
మ్యాథ్స్‌/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460
హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,050
ఇదివరకే పాసైన సైన్స్‌ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,200

Post a Comment

0 Comments

f