ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ - NTA UGC NET 2018

ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ - NTA UGC NET 2018: దేశ‌వ్యాప్తంగా డిగ్రీ క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, జేఆర్ఎఫ్ నియామ‌క‌ అర్హ‌త‌కు నిర్వ‌హించే నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ - నెట్) డిసెంబ‌రులో జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. డిసెంబ‌రు 9 నుంచి 23 మ‌ధ్య ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌రు 1 నుంచి 30 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జేఈఈ, నీట్‌, క్యాట్‌, జీప్యాట్‌, నెట్ త‌దిత‌ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌యంప్ర‌తిపత్తి సంస్థ‌గా ఎన్‌టీఏను నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా యూజీసీ-నెట్ షెడ్యూలును ఎన్‌టీఏ విడుద‌ల చేసింది.

ఎన్‌టీఏ యూజీసీ నెట్‌,ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పరీక్ష విధానం,ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ దరఖాస్తు ఫీజు,ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పరీక్ష తేది,ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ షెడ్యూల్,nta ugc net 2019,nta ugc net online application,nta ugc net exam pattern,nta ugc net application fee,nta ugc net eligibility,nta ugc net exam dates

ఇక‌పై రెండే పేప‌ర్లు: ప్ర‌స్తుత ప‌రీక్షలో నిర్వ‌హ‌ణ‌ప‌రంగా స్వ‌ల్ప‌ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంత‌వ‌ర‌కు ఓఎంఆర్ విధానంలో ప‌రీక్ష‌ జ‌రుగుతుండ‌గా ఇక‌పై ఆన్‌లైన్‌లో రెండు షిప్టుల‌లో నిర్వ‌హించ‌నున్నారు. గ‌తంలో మూడు పేప‌ర్లు ఉండ‌గా... ఇక‌పై రెండు పేప‌ర్లు మాత్ర‌మే ఉంటాయి. పేప‌ర్ 1 అన్ని స‌బ్జెక్టుల‌వారికి ఉమ్మ‌డిగా ఉంటుంది. పేప‌ర్ 2లో అభ్య‌ర్థి ఎంచుకున్న సంబంధిత స‌బ్జెక్టుపై ప్ర‌శ్న‌లు వ‌స్తాయి.

ఆన్ లైన్‌లో యూజీసీ నెట్‌: దేశ‌వ్యాప్తంగా డిగ్రీ క‌ళాశాల‌లు, విశ్వ‌విద్యాల‌యాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హ‌త‌కు నిర్వ‌హించే యూజీసీ నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌)- డిసెంబ‌రు, 2018 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఈ ప‌రీక్ష‌ను కేంద్ర మాన‌వ వ‌నరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నెల‌కొల్పిన‌ నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించ‌నుంది. ఆన్ లైన్ లో వంద స‌బ్జెక్టుల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి రోజూ రెండు సెష‌న్ల‌లో డిసెంబ‌రు 9 నుంచి 23 వ‌ర‌కు ఈసారి ప‌రీక్ష‌లు ఉంటాయి.

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ - NTA JEE Main 2019

అర్హత‌: స‌ంబంధిత‌ స‌బ్జెక్టుల్లో క‌నీసం 55శాతం మార్కుల‌తో మాస్ట‌ర్స్ డిగ్రీ లేదా త‌త్స‌మాన అర్హ‌త ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు సాధించినా అర్హులే.

వ‌య‌సు: జేఆర్ ఎఫ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు జులై 1, 2018 నాటికి 30 ఏళ్ల‌లోపు ఉండాలి. లెక్చ‌ర‌ర్ షిప్ కు వ‌యోప‌రిమితి లేదు.

ప‌రీక్ష విధానం: క‌ంప్యూట‌ర్ ఆధారిత టెస్ట్ విధానంలో ప‌రీక్ష ఉంటుంది. ప‌రీక్ష‌లో రెండు పేప‌ర్లు ఉండ‌నున్నాయి. పేప‌ర్ 1 అన్ని స‌బ్జెక్టుల‌వారికి ఉమ్మ‌డిగా ఉంటుంది. పేప‌ర్ 2లో అభ్య‌ర్థి ఎంచుకున్న సంబంధిత స‌బ్జెక్టుపై ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. పేప‌ర్‌-1లో 50 ప్ర‌శ్న‌లు 100 మార్కుల‌కు ఉంటాయి. స‌మ‌యం ఒక‌ గంట‌. పేప‌ర్‌-2లో 100 ప్ర‌శ్న‌లు 200 మార్కుల‌కు ఉంటాయి. సమ‌యం రెండు గంట‌లు.


ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పేపర్ 1:
పేపర్-1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. అభ్యర్థిలో బోధన, పరిశోధనకు సంబంధించి పరిజ్ఞానం (ఆప్టిట్యూడ్) పరిశీలిస్తారు. ఇందులో రీజనింగ్, కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్ నెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల బోధనా, పరిశోధనాంశాల్లో జ్ఞానం, అవగాహన సామర్థ్యాలను మదింపు చేస్తారు. జ్ఞానాత్మక సామర్థ్యాలు, అవగాహన, విశ్లేషణ, మూల్యాంకనం, ఆగమన, నిగమన, తార్కిక వివేచనలు, సహజ వనరులు, పర్యావరణ అంశాలపై సాధారణ పరిజ్ఞానం, ఆధునిక జీవన విధానంపై వీటి ప్రభావం మొదలైన అంశాలపై లోతైన అవగాహన అవసరం.

ఎన్‌టీఏ: NTA Exams Schedule

ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పేపర్‌-1లో ప్రధానంగా 10 విభాగాలున్నాయి.
1) బోధనాభిరుచి (టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌)
2) పరిశోధనాభిరుచి (రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌)
3) పఠనావగాహన (రీడింగ్‌ కాంప్రహెన్షన్‌)
4) సంభాషణ (కమ్యూనికేషన్‌)
5) గణిత వివేచన (మేథమేటికల్‌ రీజనింగ్‌)
6) తార్కిక వివేచన (లాజికల్‌ రీజనింగ్‌)
7) దత్తాంశ వ్యాఖ్యానం (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌)
8) ఐ.సి.టి. (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ)
9) ప్రజలు - పర్యావరణం (పీపుల్‌-ఎన్విరాన్‌మెంట్‌)
10) ఉన్నత విద్యావ్యవస్థలో సుపరిపాలన (హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌- గవర్నెన్స్‌).
పై విభాగాల్లో బోధనా స్వభావం, లక్ష్యాలు, లక్షణాలు, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, పరిశోధన-స్వభావం, సోపానాలు, పద్ధతులు, విలువలు, పరిశోధన వ్యాసం-లక్షణాలు, కమ్యూనికేషన్‌ లక్షణాలు, రకాలు, అవరోధాలు, తార్కిక వివేచనలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌, ఐసీటీ లాభాలు, నష్టాలు; పర్యావరణం, కాలుష్యం, మానవ జీవనంపై వాటి ప్రభావం, ఉన్నత విద్యాసంస్థల నిర్మాణం, నియత, దూరవిద్య, వృత్తి, సాంకేతిక విద్య, సాధారణ విద్య, విలువల విద్య, పరిపాలన మొదలైన అంశాలను విస్తృతంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది.

ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పేపర్ 2:
ఈ ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. పరీక్ష వ్యవధి 2 గంటలు.

నెట్‌ ఉత్తీర్ణత పొంది, అర్హులైనవారు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు. యూజీసీ సీఎస్‌ఐఆర్‌, యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత పొంది, క్వాలిఫై అయినవారు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు.

ప‌రీక్ష ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉన్న‌ప్ప‌టికీ బిట్ల రూపంలో చ‌ద‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ప‌రీక్ష‌లో విజ‌యానికి ప్రాథ‌మికాంశాల‌పై ప‌ట్టు త‌ప్ప‌నిస‌రి. సంభందిత స‌బ్జెక్టులో డిగ్రీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం నుంచి పీజీ చివ‌రి ఏడాది వ‌ర‌కు అక‌డ‌మిక్ పుస్త‌కాలు బాగా చ‌ద‌వాలి. గ‌త నెట్ ప్ర‌శ్న‌ప‌త్రాలు ప‌రిశీలించ‌డం ద్వారా ప్ర‌శ్నలు అడిగే విధానంపై అవ‌గాహ‌న వ‌స్తుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.800, ఓబీసీల‌కు రూ.400, ఎస్సీ/ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ/ ట్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థుల‌కు రూ.200.

ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 30.09.2018.
ఫీజు చెల్లింపున‌కు చివ‌రితేది: 01.10.2018.
ప‌రీక్ష తేదీలు: 2018 డిసెంబ‌రు 9 నుంచి 23 వ‌రకు.

NTA UGC NET Online Registration: 01-09-2018 to 30-09-2018
NTA UGC NET Online Scanned Images Uploading: 01-09-2018 to 01-10-2018
NTA UGC NET Fee Payment: 01-09-2018 to 01-10-2018


ప‌రీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌.
NTA వెబ్సైటు : https://nta.ac.in/
NTA UGC NET 2019 వెబ్సైట్ : https://ntanet.nic.in/

నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018: ఎన్‌టీఏ యూజీసీ నెట్‌, ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పరీక్ష విధానం, ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ దరఖాస్తు ఫీజు , ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ పరీక్ష తేది , ఎన్‌టీఏ యూజీసీ నెట్‌ షెడ్యూల్ , NTA UGC NET 2018, NTA UGC NET online application, NTA UGC NET exam pattern, NTA UGC NET application fee, NTA UGC NET eligibility, NTA UGC NET exam dates

Post a Comment

0 Comments

f