ఎన్‌టీఏ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ - NTA TPCs Free Coaching for Competitive Exams 2018

నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ - NTA TPCs Free Coaching for Competitive Exams, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ : ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడమే లక్ష్యంగా కష్టపడే పేద విద్యార్థులకు తీపి కబురు! జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌), జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వమే ఉచిత శిక్షణ అందించనుంది. ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించి ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకుగాను ప్రభుత్వం జాతీయ పరీక్షా సంస్థ(ఎన్‌టీఏ)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ తమ పరిధిలోని 2,697 సాధనా కేంద్రాలను వచ్చే ఏడాది నుంచి బోధనా కేంద్రాలుగా మార్చనుంది.

నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ - nta tpcs free coaching for competitive exams,పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్,free coaching for nta jee main,ugc net,neet ug exams

ఎన్‌టీఏ సాధనా కేంద్రాలు సెప్టెంబరు 8 నుంచి పనిచేస్తాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

అయితే, వాటిని కేవలం సాధనకే పరిమితం చేయకుండా.. బోధనా కేంద్రాలుగా మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో రుసుములేవీ వసూలు చేయబోమని చెప్పారు. భారీమొత్తంలో డబ్బు చెల్లించి ప్రైవేటు కేంద్రాల్లో శిక్షణ తీసుకోలేని పేద విద్యార్థులకు ఎన్‌టీఏ కేంద్రాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.


ఈ కేంద్రాల్లో బోధన వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేశారు. 2019 జనవరిలో జరిగే జేఈఈ-మెయిన్‌ కోసం తొలుత ఎన్‌టీఏ కేంద్రాల్లో విద్యార్థులకు నమూనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

సెప్టెంబరు 1 నుంచి 30 వరకు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా నమోదు చేసుకొని.. ఈ పరీక్షలకు హాజరుకావొచ్చునని వివరించారు.

ఫలితాల అనంతరం ఎన్‌టీఏ కేంద్రాల్లోని బోధనా సిబ్బంది వద్ద విద్యార్థులు తమ అనుమానాలను నివృతి చేసుకోవచ్చునని తెలిపారు.

Post a Comment

0 Comments

f