ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ ఎగ్జామ్ - NTA JEE Main 2019

జేఈఈ మెయిన్‌ 2019: జేఈఈ మెయిన్-2019 ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ 2018 సెప్టెంబ‌రు ఒక‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ప‌రీక్ష‌లు 2019 జ‌న‌వ‌రిలో జరుగుతాయి. జాతీయ ప‌రీక్ష‌ల సంస్థ (ఎన్‌టీఏ) పేర్కొంది. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాలు ప్రారంభ‌మయ్యేలోపు రెండుసార్లు జేఈఈ మెయిన్ నిర్వ‌హించాల‌న్న‌ది ఎన్‌టీఏ ప్ర‌ణాళిక‌. మొదటి విడ‌త 2019 జ‌న‌వ‌రి 6 నుంచి 20 మ‌ధ్య‌, రెండో విడ‌త 2019 ఏప్రిల్ 6 నుంచి 20 మ‌ధ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నుంది.

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ 2019,ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం,ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ఫీజు,ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్ష తేది,ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ షెడ్యూల్,nta jee main 2018,nta ugc net online application,nta jee main exam pattern,nta jee main application fee,nta jee main eligibility,nta jee main exam dates

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జరిగే దేశవ్యాప్త పరీక్ష. ఐఐటీల్లో ప్రవేశానికి తొలిమెట్టు కూడా ఇదే. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండుసార్లు నిర్వహించబోతున్నారు. జనవరి 6 నుంచి 20 వరకూ తొలి విడత, ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకూ రెండో విడత. దేశవ్యాప్తంగా జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు భారీగానే పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తొలిసారిగా జేఈఈ మెయిన్‌-2019ని ఆన్‌లైన్‌లో మాత్రమే.. అందులోనూ జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు నిర్వహించబోతున్నారు. ఆ రెండు పరీక్షల్లో ఉత్తమ ర్యాంకును పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విద్యార్థుల ఆన్‌లైన్‌ పరీక్షల సాధనకు సెప్టెంబరులో ప్రాక్టీస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

ఐఐటీల్లో ప్రవేశానికి ఈ ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్స్‌ అర్హత పరీక్షగా ఉంటుంది. ఇప్పటికే ఎన్‌టీఏ - జేఈఈ మెయిన్స్‌ 2019 పరీక్ష నిర్వహణ విధానం, పరీక్ష తేదీలతో ప్రకటన వెలువడింది. గతంలో పరీక్ష ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ రాసేవారు. కానీ ఇక నుంచీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దరఖాస్తులు సెప్టెంబరు 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. తొలిసారిగా జేఈఈ మెయిన్‌-2019ను పూర్తి స్థాయిలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(ఆన్‌లైన్‌ విధానం)గా నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సౌకర్యార్థం సాధనకు(ప్రాక్టీస్‌) కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) నిర్ణయించిది.

మొదటి విడత పరీక్షలు జనవరి 6-20 వరకు జరగనున్నందున శనివారం (సెప్టెంబరు 1) నుంచి దరఖాస్తుల సమర్పణ మొదలైంది. సాధన పరీక్షకు రుసుములు ఉండవు. ఏ నగరంలో హాజరవుతారో ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు ఎంచుకోవాలి. ఎప్పటి నుంచి ఈ సాధన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నది పేర్కొనలేదు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ పరీక్షకు జనరల్‌ అభ్యర్థులకు రుసుమును రూ.500గా నిర్ణయించారు. జవాబుల కీ విడుదల చేసిన తర్వాత వాటిని సవాల్‌ చేయాలనుకుంటే ఒక్కో ప్రశ్నకు రూ.వెయ్యి చెల్లించాలి. గతంలో సవాల్‌ చేసిన ప్రశ్నపై కచ్చితమైన జవాబు మార్చి అభ్యర్థితో ఏకీభవిస్తే చెల్లించిన రూ.వెయ్యిని తిరిగి ఇచ్చేవారు. కానీ ఈసారి ఒకసారి చెల్లించిన రుసుమును తిరిగి చెల్లించేది లేదని ఎన్‌టీఏ సృష్టం చేసింది.


UGC NET: యూజీసీ నెట్ డిసెంబ‌రు 2018 రిజిస్ట్రేష‌న్లు

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ 2019: పరీక్ష విధానం
ఈ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో అయినప్పటికీ గత సంవత్సరంలా మొత్తం 90 ప్రశ్నలతో మాథమేటిక్స్‌ 30, ఫిజిక్స్‌ 30, కెమిస్ట్రీ 30 ప్రశ్నలతో ఉంటుంది. సరైన సమాధానానికి +4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు. సహజంగా జాతీయస్థాయి పోటీ పరీక్షలలో ద్వితీయ సంవత్సర సిలబస్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా నిర్వహించే పరీక్షకు బ్లూ ప్రింట్‌ ఇచ్చారు. అంటే సుమారుగా ఏ అధ్యాయం నుంచి ఎన్ని ప్రశ్నలు ఇస్తారనేది ప్రకటించారు. దీనికి అనుగుణంగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులకు ప్రణాళిక ఏర్పరుచుకోవచ్చు.

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ 2019 పరీక్షా కేంద్రాలు:
ఏపీలో 19...తెలంగాణలో ఏడు నగరాలు, పట్టణాల్లో జేఈఈ మెయిన్‌కు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఏపీలో అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరంలలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలుంటాయి.

ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ర్యాంకులు 
జనవరి 6-20 మధ్య పరీక్షలు జరిగినా నార్మలైజేషన్‌ విధానం ద్వారా మార్కులు మాత్రమే వెల్లడిస్తారు. మళ్లీ ఏప్రిల్‌ 6-20 మధ్య పరీక్షలు జరిగిన తర్వాత మార్కులు ఇస్తారు. ఆ రెండింటిలో వచ్చిన మార్కుల్లో ఏదీ ఎక్కువైతే దానికి ర్యాంకు కేటాయిస్తారు. ఒకవేళ జనవరి లేదా ఏప్రిల్‌లో జరిగే పరీక్షల్లో ఒకసారే రాస్తే దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ర్యాంకు వెల్లడిస్తారు.

జనవరి పరీక్షలో జేఈఈ మెయిన్స్‌లో 360 మార్కులకు 180 మార్కుల పైన సాధించిన విద్యార్థులు కచ్చితంగా ఎన్‌ఐటీల్లో సీటు, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధిస్తారు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి మంచి ఐఐటీలో సీటు సాధించవచ్చు. అంటే జేఈఈ అడ్వాన్స్‌కు గతంలో కేవలం 40 రోజులు సమయం దొరికేది కానీ ఇప్పుడు జనవరి నుంచి మే వరకూ కనీసం 4 నెలలు విద్యార్థి సంపూర్ణంగా జేఈఈ అడ్వాన్స్‌కు తయారవటానికీ, పరీక్షలు అద్భుతంగా రాయటానికీ వీలు ఏర్పడింది.  జేఈఈ అడ్వాన్స్‌ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తున్నారు. అందువల్ల పరీక్షల అభ్యాసం రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది.


రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారనేది కూడా కొందరు విద్యార్థులు సరిగా అవగాహన చేసుకోవటం లేదు. తొలిసారి పరీక్షలో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మార్కులను విడివిడిగా తీసుకుంటారనీ, తర్వాత కూడా పరీక్ష రాసి విడి సబ్జెక్టుల్లో ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తే వాటిని లెక్కిస్తారనీ అపోహ పడుతున్నారు. ఇంటర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష మాదిరే ఉంటుందని పొరబడుతున్నారు. మొత్తం మూడు సబ్జెక్టులను కలిపిన మార్కులను మాత్రమే పరిగణించి మొత్తం మార్కులు ఏ పరీక్షలో అధికంగా వచ్చాయో దాన్నే లెక్కలోకి తీసుకుంటారు.

పరీక్ష వివిధ సెషన్లలో జరుగుతుంది కాబట్టి ఒక సందర్భంలో పేపర్‌ సులభంగా, వేరొక సందర్భంలో పేపర్‌ క్లిష్టంగా ఉంటే నష్టపోతామేమో అనే సంశయం విద్యార్థుల్లో ఉంది. బిట్స్‌ పిలానీ వారు నిర్వహిస్తున్న పరీక్ష మాదిరే ప్రతి విద్యార్థికీ ఒకే రకమైన క్లిష్టత ఏర్పడేలా జేఈఈని నిర్వహిస్తారు. అందుకని అలాంటి ఆందోళన అవసరంలేదు. ఇప్పటి నుంచే ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎక్కువ రాస్తూ అభ్యాసం చేయగల్గితే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈలో అద్భుతంగా రాణించగలరు.

జనవరి, ఏప్రిల్‌ రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్‌ క్వాలిఫై లిస్ట్‌ ఇస్తారా అనే సందేహం కొందరిలో ఉంది. రెండింటి ర్యాంకులను ఏప్రిల్లో ప్రకటిస్తారు. పరీక్షలో 150 మార్కుల పైన సాధిస్తే కచ్చితంగా క్వాలిఫై అవుతారు.

NTA: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పరీక్షల షెడ్యూల్ 

జేఈఈ మెయిన్‌ జనవరి 2019 పరీక్షల ప్రణాళిక:
* దరఖాస్తుల సమర్పణ: సెప్టెంబరు 1 నుంచి 30 వరకు
* అడ్మిట్‌ కార్డు (హాల్‌టికెట్‌): డిసెంబరు 17 నుంచి డౌన్‌లోడ్‌
* ఆన్‌లైన్‌ పరీక్షలు: జనవరి 6 నుంచి 20 వరకు
* ఫలితాల వెల్లడి: జనవరి 31

NTA JEE Main Online Registration: 01-09-2018 to 30-09-2018
NTA JEE Main Online Scanned Images Uploading: 01-09-2018 to 01-10-2018
NTA JEE Main Fee Payment: 01-09-2018 to 01-10-2018

NTA వెబ్సైటు : https://nta.ac.in/
NTA JEE Main వెబ్సైట్ : https://jeemain.nic.in/

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్‌: ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ 2019, ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం, ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ దరఖాస్తు ఫీజు , ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పరీక్ష తేది , ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ షెడ్యూల్ , NTA JEE Main 2019, NTA JEE Main Online Application, NTA JEE Main Exam pattern, NTA JEE Main Application fee, NTA JEE Main eligibility, NTA JEE Main Exam dates

Post a Comment

0 Comments

f