ముఖ్యమంత్రి యువ నేస్తం 'నిరుద్యోగ భృతి' పొందేందుకు 10 రకాల నిబంధనలు

ముఖ్యమంత్రి యువ నేస్తం 'నిరుద్యోగ భృతి' పొందేందుకు 10 రకాల నిబంధనలు: అర్హుల గుర్తింపు పారదర్శకంగా జరిగేందుకే.. ఆధార్‌ నంబరు నమోదుతో రిజిస్ర్టేషన్‌ అంతా సులభంగా ఉండేలా ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశాపారు. ‘నిరుద్యోగ భృతి పొందేందుకు 10 రకాల అంశాలను అర్హతలుగా నిర్ణయించారు. తెల్ల రేషన్‌ కార్డు, సామాజిక పింఛన్ల మాదిరిగానే నిబంధనలు ఉంటాయి.ముఖ్యమంత్రి యువ నేస్తం 'నిరుద్యోగ భృతి' పొందేందుకు 10 రకాల నిబంధనలు

1. రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. రాష్ట్రంలోనే నివసించాలి
2. ప్రజాసాధికార సర్వేలో విధిగా నమోదై ఉండాలి.
3. వయస్సు 22 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి
4. తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. దాంట్లో పేరుండాలి
5. బ్యాంకు ఖాతా, మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానమై ఉండాలి.
6.  డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ ఆపై పూర్తి చేసిన వారే అర్హులు
7. లబ్ధిదారు ఇంట్లో ఎవరికీ నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. (అనగా కారు, ఇతర నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు)
8. నిరుద్యోగ భృతి తీసుకునే వ్యక్తి ఏదైనా ప్రభుత్వ పథకం కింద రూ.50 వేలు కన్నా ఎక్కువ సబ్సిడీ పొంది ఉండకూడదు. (ప్రభుత్వం నుంచి గతంలో సబ్సిడీ రుణాలు పొందిన వారు అనర్హులు(రూ. 50 వేల పైబడి) ఎందుకంటే స్వయం ఉపాధికే సబ్సిడీ ఇస్తారు  కనుక అది నిరుద్యోగ లబ్ధి కిందకే వస్తుంది.
9. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఉండకూడదు.  లబ్ధిదారు పేరిట పీఎఫ్‌, ఈఎ్‌సఐ ఖాతాలు ఉండకూడదు. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లేదా కంపెనీల్లో పని చేస్తుంటే పీఎఫ్‌, ఈఎ్‌సఐ కడుతుంటారు. పీఎఫ్‌, ఈఎ్‌సఐ కడుతున్నారంటే ఉద్యోగం చేస్తున్నట్లే అందుకని ఇలాంటి వారిని అనర్హులుగా నిర్ణయించారు. ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉన్నా అనర్హులే.
10. కుటుంబంలో(తల్లిదండ్రులు) సామాజిక పింఛను తీసుకుంటున్నా అనర్హులే.
11. క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ:
నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో నిద్యోగులంతా నమోదైన తర్వాత రాష్ట్రంలో ఏయే కంపెనీలు ఉన్నాయి.. రానున్న ఐదేళ్లలో ఏమేం పరిశ్రమలు రాబోతున్నాయి.. వాటిలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి.. కంపెనీలకు ఏ అర్హత గలిగిన ఉద్యోగులు కావాలి.. నైపుణ్య సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారు.. ఈ అంశాలను ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అనుసంధానం చేస్తారు.

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ ఎక్కడా లేదు. క్షేత్ర స్థాయిలో దీని అమలుకు టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలో.. ఆలోచించి, ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పారదర్శకతతో అర్హులందరినీ సమగ్రంగా గుర్తించడానికి ఇది దోహదపడుతుంది. నిరుద్యోగ భృతి కోసం అధికారులు చుట్టూ గానీ.. రాజకీయ నాయకుల చుట్టూ గానీ తిరగాల్సిన అవసరం లేదు . వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన అందరికీ గుర్తించి, భృతి ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

Post a Comment

0 Comments

f