ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగభృతికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగభృతికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం వెబ్‌సైట్‌ లో నిరుద్యోగభృతికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  నిరుద్యోగుల కల సాకారం అయ్యింది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు రాక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతకు కొండంత భరోసానిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ప్రారంభమైంది. ఈ పథకానికి సంబంధించి వెబ్‌సైట్‌ ప్రారంభము అయింది. నిరుద్యోగులందరికీ  ప్రభుత్వం నెలకు రూ.1000 చొప్పున భృతి చెల్లించబోతోంది. నిరుద్యోగుల కళ్లలో ఆనందం నింపేందుకు ప్రభుత్వం యువనేస్తంతో నెలకు రూ. 1000 భృతి అందించనుంది.ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగభృతికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హతలు:
1. రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. రాష్ట్రంలోనే నివసించాలి
2. వయస్సు 22 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి
3. తెల్లరేషన్‌ కార్డు ఉండాలి. దాంట్లో పేరుండాలి
4. ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి
5. డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ ఆపై పూర్తి చేసిన వారే అర్హులు
6. బ్యాంకు ఖాతా, మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానమై ఉండాలి.


అనర్హతలు
1. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఉండకూడదు
2. ప్రభుత్వం నుంచి గతంలో సబ్సిడీ రుణాలు పొందిన వారు అనర్హులు(రూ. 50 వేల పైబడి)
3. కారు, ఇతర నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు
4. కుటుంబంలో(తల్లిదండ్రులు) సామాజిక పింఛను తీసుకుంటున్నా అనర్హులే
5. ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నా, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉన్నా అనర్హులే
6. క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.

దరఖాస్తు చేసే విధానం
1. ముందుగా మీ వెబ్రౌజర్లో యువనేస్తం. ఏపీ.జీవోవీ.ఇన్‌కు లాగిన్‌ అవ్వాలి.
2. తర్వాత రిజిస్టర్‌ బటన్‌ కనపడుతుంది. అక్కడ నిరుద్యోగి ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలంటూ ఒక కాలమ్‌ కనపడుతుంది.
3. వెంటనే ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే.. క్లిక్‌ హియర్‌ అంటూ కింద రెడ్‌ మార్క్‌లో ఒక లేబుల్‌ ఉంటుంది.
4. అక్కడ క్లిక్‌ చేయగానే ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేయగానే ఆధార్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది.
5. అక్కడ మళ్లీ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి, కింద ఇచ్చిన టెక్స్ట్‌ను ఎంటర్‌ చేసి, క్లిక్‌ చేస్తే.. ఆధార్‌ వివరాలు వస్తాయి. ఆధార్‌ వివరాలు వస్తేనే, దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
6. తర్వాత రిజిస్టర్‌ బటన్‌ వద్దకు వెళ్లి, ఆధార్‌ను అథంటికేషన్‌కు క్లిక్‌ చేయాలి. తర్వాత పర్సనల్‌ డిటైల్స్‌ వస్తాయి. పేరు, అడ్రస్‌, ఫోటో అన్ని వివరాలు కనపడతాయి.
7. ఎడ్యుకేషన్‌ వివరాలు కూడా వస్తాయి. ఇక్కడే మీరు అర్హులో, అర్హులు కాదో తెలిసిపోతుంది. అర్హులు కాకపోతే ఎందుకు కాదో వివరాలు కూడా వస్తాయి.
8. విద్య వివరాలు అప్‌లోడ్‌ కాకపోతే చూపిస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments

f