ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్స్ 2018-2019 (మైనారిటీ స్టూడెంట్స్ కోసం)

మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ- మెట్రిక్, పోస్ట్- మెట్రిక్ మరియు మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్ షిప్ 2018-19. GoI Pre matric, Post matric, Merit cum Means Scholarships for Minority students 2018.  ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్స్ 2018-2019 (మైనారిటీ స్టూడెంట్స్ కోసం). 2018-19 విద్యా  సంవత్సరానికి మూడు స్కాలర్షిప్ పథకాలు అంటే ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ మరియు మెరిట్-కమ్-మీన్స్ ఆధారిత స్కాలర్షిప్ పథకాల క్రింద స్కాలర్షిప్లు వినియోగించుకోవడానికి భారత ప్రభుత్వంచే గుర్తించబడిన ఆరు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoMA) అవకాశం కల్పిస్తోంది.

ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్స్ 2018-2019

విద్యార్థులచే కొత్త స్కాలర్షిప్ (మొదటిసారి దరఖాస్తుదారు) మరియు స్కాలర్షిప్ రెన్యువల్ (2017-18 లో స్కాలర్షిప్ పొందిన దరఖాస్తుదారు) కోసం ఆన్లైన్ దరఖాస్తుల దాఖలుకు ఆఖరు తేది  30 సెప్టెంబర్ 2018

దరఖాస్తు చివరి తేదీ : 30-09-2018

అర్హత:
1. దరఖాస్తుదారు ప్రకటిత మైనారిటీ కమ్యూనిటీల నుంచి ఏదేని ఒక దానికి అంటే (ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, బుద్ధిస్ట్లు, జొరాస్టియన్లు (పార్శీలు) మరియు జైనులకు చెందిన వారై ఉండాలి.
2. భారతదేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు/సంస్థలు/కళాశాలలు, పాఠశాలలో చదువుతూ ఉండాలి.
3. చదువుతున్న కోర్సు కనీసం ఒక సంవత్సర కాల వ్యవధి కలిగి ఉండాలి
4. దరఖాస్తుదారు గత వార్షిక బోర్డు క్లాన్ పరీక్షలో 50% మార్కులు పొంది ఉండాలి.

దరఖాస్తుదార్లకు సూచనలు:
1. దరఖాస్తుదార్లు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబీసైట్ www.Scholarships.gov.in లో స్కాలర్షిప్ స్కీమ్లలో ఏదేని ఒక దానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయవలసిందిగా సూచించబడుతున్నారు. (సైటికు లింక్ www.minorityaffairs.gov.in లో కూడా లభిస్తుంది)
2. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి సవివరమైన సూచనలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) లు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ హోమ్పేజీలో లభిస్తాయి.
3. దరఖాస్తుదారు యాక్టివ్ మోడ్ లో ఉన్న లేదా బ్యాంక్ సూచనలను పాటిస్తున్న బ్యాంక్ ఖాతా వివరాలను మాత్రమే ఇవ్వాలి. ఆవిధంగా చేయడం వలన స్కాలర్షిప్ విఫలమవదు.

చదవండిమైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ- మెట్రిక్, పోస్ట్- మెట్రిక్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్ షిప్స్

విశ్వవిద్యాలయాలు సంస్థలు కళాశాలలు, పాఠశాలల కోసం సూచనలు:
మైనారిటీ విద్యార్థులు చదువుతున్న అన్ని విశ్వవిద్యాలయాలు సంస్థలు కళాశాలలు పాఠశాలలు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నమోదు చేయించుకోవాలి.
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ : https://scholarships.gov.in/

Post a Comment

0 Comments

f