తెలంగాణలో కొత్త ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలోని లోపాల దిద్దుబాట్లు - Voter Enrollment, Corrections of Errors

తెలంగాణలో 'కొత్త ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలోని లోపాల దిద్దుబాట్లు' / New Voter Enrollment, Corrections of Errors in Voter List in Telangana: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ, ఓటర్ల ముసాయిదా జాబితా , ఓటరు కార్డు : తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఉన్నట్లు కాదు. ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? అనేది పరిశీలించుకోవాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తెలియ చేశారు.


కొత్త ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలోని లోపాల దిద్దుబాట్లు

ప్రజాస్వామ్య దేశం లో ఓటు ప్రతి ఒక్కరి హక్కు: ఓటు హక్కు ను ప్రతి ఒక్కరు సద్వీనియోగం చేసు కోవాలి.   జనవరి  1 , 2018  వరకు 18 సంవత్సరములు నిండిన  యువతి యువకులందరు   ఓటర్ల  జాబితా లో ఓటర్ గా నమోదు చేయించుకోవాలి.  యువత వోటర్ జాబితా లో తమ పేరు ఉందొ లేదో తెలుసుకోవడానికి  www.nvsp.in  లో చూసుకోవాలి లేదా సంబంధింత  బూత్ లెవెల్ అధికారిని సంప్రదించగలరు. పేరు లేనిచో  ఓటర్ గా నమోదు చేసుకొనుటకు మూడు మార్గాలు కలవు.

1. సంబంధింత  బూత్ లెవెల్ అధికారికి వివరాలు అందించాలి.
2. సంబంధింత  తహసిల్దార్ కార్యాలయం లో Form 6  ను దరఖాస్తు చేసుకోవాలి.
3. Online ద్వారా ceotelangana.nic.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

- Form 6  - New Enrollment  as a New Voter     
- Form 6A  - Enrollment of Overseas  Voter ప్రవాస భారతీయుల  కోసం
- Form 7 - Deletion  ( Shifting  / Dead / Permanently Migrated) తొలగింపు
- Form 8 - Corrections / Modifications మార్పులు / చేర్పులు
- Form 8A - Transposition from one PS to another PS (with in the AC) ఒక బూత్ నుండి మరొక బూత్ కు బదలీ

కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకొనుటకు చివరి తేది: 25th September 2018

ఓటర్ల ముసాయిదా జాబితాను వెలువరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల పరిధిలోని ఓటర్ల నమోదు అధికారి, ఓటర్ల నమోదు సహాయ అధికారి కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

తాజా అప్డేట్ - 09-09-2018: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది. రాబోయే శాసనసభ ఎన్నికలను 2018 ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ వరకు ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ ప్రక్రియ చేపట్టేందుకు గతంలో ప్రకటన జారీచేశారు. అనంతరం రాష్ట్ర శాసనసభ రద్దయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో రాష్ట్రంపై దృష్టి సారించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి గతంలో జారీచేసిన ప్రకటన రద్దు చేసి, శనివారం కొత్త నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం అక్టోబర్‌ ఎనిమిదో తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. 2018 జనవరి తర్వాత నమోదయిన వారినీ అనుసంధానం చేసి ఓటర్ల తుది జాబితాను పూర్తిచేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారి రజత్‌ కుమార్‌ జాబితా రూపకల్పన నుంచి తుది జాబితా ముద్రణ వరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.


ఓటర్‌ నమోదు ప్రక్రియ, షెడ్యూల్‌
సెప్టెంబర్ 10 : ఓటరు జాబితా ముసాయిదా
సెప్టెంబర్ 25 : అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 4 : అభ్యంతరాల పరిష్కారం
అక్టోబర్ 8 : తుద ఓటర్లి జాబితా ప్రచురణ.

‘ఒక నియోజక వర్గానికి మించి ఓటు హక్కు ఉండకూడదు. ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్నట్లు రుజువైనా, ఓటు హక్కు కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినా ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం క్రిమినల్‌ కేసు నమోదు అవుతుంది.

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఆ జాబితాను ప్రత్యక్షంగా చూసుకోలేని వారు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ www.eotelangana.nic.in లో కూడా చూసుకోవచ్చు.

జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండితే ఓటు హక్కు:
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చు.

ఓటు హక్కు కోసం ఉపయోగపడే ఫారం లు:
1. ఫాం-6ఎ: భారతీయ పౌరులై ఉండి విదేశాల్లో నివాసం ఉంటున్న వారిలో 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటు హక్కు కోసం ఫాం-6ఎ ను భర్తీ చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటుహక్కు నమోదు సందర్భంగా దరఖాస్తుతోపాటు పాస్‌పోర్టులో ముద్రితమైన వీసా, ఫొటోతోపాటు ఉన్న పేజీ తదితరాలతో నియోజకవర్గ ఓటరు నమోదు అధికారికి నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ, స్వయంగా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా దరఖాస్తు చేసుకునేవారు పాస్‌పోర్టు ఒరిజినల్‌ను సదరు అధికారికి చూపించాల్సి ఉంటుంది.
2. ఫాం-6: ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజక వర్గానికి మారిన వారు ఫాం-6 ను భర్తీ చేయాలి.
3. ఫాం-8ఎ: ఒకే అసెంబ్లీ నియోజవర్గంలో ఉన్నా ఇల్లు మారిన పక్షంలో ఫాం-8ఎ ను నింపాలి.
4. ఫాం-7ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించుకునేందుకు ఫాం-7 ను దరఖాస్తు చేయాలి.
5. ఫాం-8: పేరు, వయసు తదితరాల్లో సవరణల కోసం ఫాం-8 ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు:
ఆన్‌లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను www.ceotelangana.nic.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒక దఫా ఓటరు గుర్తింపు కార్డు జారీ అయితే అది దేశవ్యాప్తంగా ఎక్కడైనా చెల్లుబాటవుతుంది. మారిన ప్రాంతాల్లో ఆయా నంబరు ఆధారంగా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ కార్డు పొగొట్టుకున్న సందర్భాల్లో మాత్రమే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఓటు హక్కు నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాలు:
ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఆదాయ పన్ను అసెస్‌మెంట్‌ ఆర్డర్‌, తాజా విద్యుత్తు, టెలిఫోన్‌, నీటి బిల్లుల్లో ఏదో ఒకటి దరఖాస్తుదారుడి పేరిట లేదా తల్లిదండ్రుల పేరుతో ఉన్నా చెల్లుబాటవుతుంది. ఆధార్‌ కార్డు, ఇంటి అద్దె ఒప్పందం, దరకాస్తుదారుడి పేరిట తపాలా శాఖ బట్వాడా చేసిన వాటినికూడా ధ్రువపత్రంగా పరిగణిస్తారు

ఓటరు జాబితా సవరణ షెడ్యూల్:
ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన : సెప్టెంబర్ 10
అభ్యంతరాలు, ఫిర్యాదులు , వినతుల స్వీకరణ : సెప్టెంబర్ 25
అభ్యంతరాల పరిష్కారం: అక్టోబర్ 4
ఓటరు తుది జాబితా ప్రదర్శన : అక్టోబర్ 8
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌: www.ceotelangana.nic.in

Post a Comment

0 Comments

f