ముఖ్యమంత్రి యువ‌నేస్తం వెబ్ సైట్లో నిరుద్యోగ భృతికి ధ‌ర‌ఖాస్తు

నిరుద్యోగ భృతికి ధ‌ర‌ఖాస్తు చేసుకునే వారికి శుభ‌వార్త. ఈ నెల 14 నుంచి ముఖ్యమంత్రి యువ‌నేస్తం వెబ్ సైట్లో... ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది . సెప్టెంబర్ 14 న  వెబ్ సైట్‌ను లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. నిరుద్యోగ భృతిని అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. దీనికి ముఖ్యమంత్రి యువ‌నేస్తంగా పేరు పెట్టారు. దాదాపు 12 ల‌క్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నట్లు ప్రజాసాధికార స‌ర్వే ద్వారా అంచ‌నా వేసింది. యువ‌ నేస్తం అమ‌లు కోసం బ‌డ్జెట్లో రూ. 1500 కోట్లు కేటాయించింది.


అన్ లైన్లోనే అప్లై:
అభ్యర్థుల పేర్ల న‌మోదు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేయ‌డంతో పాటు... అన్ లైన్లోనే అప్లై చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. నిరుద్యోగులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను http://yuvanestham.ap.gov.in లో న‌మెదు చేసుకోవాలి. 

దరఖాస్తు గ‌డువు:
దరఖాస్తు చేసుకునేంద‌ుకు 2 నుంచి మూడు వారాల గ‌డువు ఇవ్వనున్నారు.

నిరుద్యోగ భృతి జ‌మ:
అక్టోబ‌ర్ 2 నుండి నిరుద్యోగులకు భృతిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రభుత్వం జ‌మ చేయ‌నుంది.


అర్హత :
1. నిరుద్యోగ భృతి పొందేందుకు 22 నుంచి 35 సంవ‌త్సరాల వ‌య‌స్సు క‌ల వారు అర్హులు.
2. డిగ్రీ, పీజీ, డిప్లమో చేసి ఏడాది అయిన వారంద‌రూ ఈ ప‌థ‌కానికి అర్హులే.
3. అలాగే ఇత‌ర రాష్ట్రాల విశ్వ విద్యాల‌యాల నుంచి డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే.
4. ఆధార్ కార్డ్ తో పాటు తెల్ల రేష‌న్ కార్డ్ క‌లిగి ఉండి... ప్రజా సాధికార స‌ర్వేలో న‌మోదై ఉండాలి.
5. అలాగే అభ్యర్థుల బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి.
6. కానివాళ్లు... మీ సేవ ద్వారా అనుసంధానం చేసుకోవాల‌ని ప్రభుత్వం సూచిస్తోంది.
7. త‌ల్లితండ్రులు సామాజిక పింఛన్లు పొందుతున్నా... నిరుద్యోగ భృతికి అర్హులుగా ముఖ్యమంత్రి నిర్ణయించారు.

శిక్షణ: నిరుద్యోగుల‌కు భృతి ఇవ్వడమే కాదు... వారికి ఇష్టమైన మూడు రంగాల్లో అవ‌స‌ర‌మైన శిక్షణను కూడా ప్రభుత్వం ఉచితంగా క‌ల్పించ‌నుంది. తద్వారా నిరుద్యోగులు త‌మ కాళ్ళ మీద తాము నిల‌బ‌డేందుకు అవ‌స‌ర‌మై సహకారాన్ని... ప్రభుత్వం అన్నివిధాలా అందించ‌నుంది.

ఆన్ జాబ్ ట్రైనింగ్: అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్ కార్యక్రమాన్ని కూడా యువ‌నేస్తంకు అనుసంధానం చెయ్యడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలను యువనేస్తంలో భాగస్వామ్యం చేసి... శిక్షణ పొందిన నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు కల్పించనున్నారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

హెల్ప్ డెస్క్ : నిరుద్యోగ భృతికి సంబంధించి ఇబ్బందులు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ 1100 ని సంప్రదించ‌వ‌చ్చు. అలాగే yuvanestham-rtgs@ap.gov.in అనే ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యర్థులు స‌మ‌స్యల‌ను అధికారుల దృష్టికితీసుకురావ‌చ్చు.

Post a Comment

0 Comments

f