ఏపీ పాఠశాలలకు దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు

దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం: విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబరు 9 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. 21న ఆదివారం సెలవు కావడంతో పాఠశాలలు 22 నుంచి పనిచేయాలని పేర్కొంది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని స్పష్టం చేసింది.

కాగా, ఈ సంవత్సరం
అక్టోబర్ 17న దుర్గాష్టమి,
18న మహర్నవమి,
19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి.

21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

ఏపీ పాఠశాలలకు దసరా సెలవులు: ఏపీ స్కూల్స్ దసరా హాలిడేస్ - ఆంధ్ర ప్రదేశ్  పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2018 లో దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు అనగా 13 రోజులు. స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే (i.e 08-10-2018) మరియు
రీఓపెనింగ్ డే (22-10-2018) ఈ రెండు రోజులు తప్పకుండ హాజరు కావాలి.


పాఠశాల
చివరి పనిదినం (i.e 08-10-2018) మరియు
రీఓపెనింగ్ డే (i.e 22-10-2018) 
1. ఈ రెండు రోజులు బడికి హాజరవ్వాలా? లేక
2. ఒకరోజు హాజరైతే సరిపోతుందా?,
3. హాజరుకాకపోతే సెలవులన్ని Other than CL గా పరిగణిస్తారా?
4. హాజరుకాని రోజులు మాత్రమే OCL పెట్టుకుంటే సరిపోతుందా?
అను సందేహం చాలామంది ఉపాధ్యాయుల మదిలో మెదులుతున్ను సందేహం.

చదవండిDasara Holidays/Terminal Holidays Prefix and Suffix Clarifications

వివరణ: Rc.No.10324/E4-2/69, తేది:07-11-1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్ (Prefix, Suffix) చేసుకునుటకు అవకాశం లేదు. చివరి పనిదినం (08-10-2018) రీఓపెనింగ్ డే (22-10-2018) రెండు రోజులు పాఠశాలకు హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా దసరా సెలవులన్ని Other than CL గా పరిగణించబడతాయి.

స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే (పాఠశాల చివరి పనిదినం), రీఓపెనింగ్ డే (తిరిగి తెరిచే రోజు), Prefix Suffix అవకాశం, Other than CL, OCL

Post a Comment

0 Comments

f