తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం - Use of Cell Phone is Prohibited in TS schools

తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం -  Use of Cell Phone is Prohibited in TS schools: Cell phone should not be used in school timings. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా పాటించాలని విద్యా శాఖ ఆదేశం. టీచర్ల ఫోన్లు హెచ్‌ఎంలకు అప్పగించాలని నిర్ణయం. నిబంధనలు పాటించకుంటే ఇద్దరిపై చర్యలకు సిద్ధం.  ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదిలోకి ఉపాధ్యాయులు ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫో న్లు తీసుకెళ్లరాదనే నిబంధన ఉంది. సెల్‌ఫోన్లను హెచ్‌ఎంలకు అప్పగించాలని ఇప్పటికే ప్రభు త్వం ఉత్వర్వులు జారీ చేసింది. తాజాగా ఇందు కు సంబంధించి పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నిబంధనలను తూ చా తప్పకుండా పాటించాలని ఆదేశాలు ఇచ్చిం ది. ఒక వేళ ఉపాధ్యాయుడు తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నట్లు కన్పించిన, తరగతి గదిలో సెల్‌ ఫోన్‌ వాడి నా సదరు ఉపాధ్యా యుడితో పాటు హెచ్‌ ఎంపై కూడా చర్యలు తీసుకు నే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

తరగతి గదుల్లో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం,పాఠశాలల సమయంలో సెల్‌ ఫోన్‌ వాడరాదు,use of cell phone is prohibited in ts schools,cell phone should not be used in school timings,ban on cell phones in ts schools


నిబంధనలు:
★పాఠశాలల సమయంలో సెల్‌ ఫోన్‌ వాడరాదు. ఫోన్‌ మాట్లాడినట్లు, వాడిన ట్లు రుజువు అయితే కఠిన చర్యలు తీసుకొనే అధికారం అధికారులపై ఉంది.

★పాఠశాలలకు ఫోన్‌ తెచ్చుకున్నా, దాన్ని హెచ్‌ఎంకు అప్ప జెప్పాలి. అత్యవసరం అనుకుంటే హెచ్‌ఎం అనుమతి మేరకే ఫోన్‌ ఉపయోగించాలి.

★హెచ్‌ఎం తప్పనిసరిగా ఉపాధ్యాయుల సెల్‌ఫోన్స్‌ అన్ని తన గదిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒక వేళ్ల హెచ్‌ఎం ఈ పని చేయకుంటే ఆయన కూడా బాధ్యుడవుతాడు.

★పాఠశాలల సమయంలో ఉపాధ్యాయుడు సెల్‌ఫోన్‌ మాట్లాడినా, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, వాట్సప్‌ ఉప యోగించినా, దానికి హెచ్‌ఎం, సదరు ఉపాధ్యా యుడు ఇద్దరూ బాద్యులే.

హెచ్‌ఎంలకు సెల్‌ఫోన్లు అప్పగించాలి:
పాఠశాల సమయంలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌ విని యోగించుకూడదు. పాఠశాలలకు సెల్‌పోన్లు తీసుకెళ్లిన, వాటిని హెచ్‌ఎంలకు అప్పగించాలి. ఇందుకు సంబం ధించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.
Rc.733 Use of Cell Phone is Prohibited in Telangana Educational Institutions

Post a Comment

0 Comments

f