టిఎస్ జూనియర్ పంచాయితీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీ (Junior Panchayat Secretaries Recruitment) 2018

టి.ఎస్.పి.ఎస్.ఆర్.ఐ జూనియర్ పంచాయితీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీ - Junior Panchayat Secretaries Recruitment: 9355 జూనియర్ పంచాయితీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఐప్లె చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 13వ తేదీగా అధికారులు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం http://tspri.cgg.gov.in. వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.టిఎస్ జూనియర్ పంచాయితీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీ నోటీఫికేషన్ విడుదల (Junior Panchayat Secretaries Recruitment) 2018

జూ.పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువు పెంపు
జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. notification ప్రకారం ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 11-09-2018, దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2018. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది.

ఫీజు చెల్లింపుకు ఈనెల 14 వ తేదీ, 
దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్ష తేదీ : 10-10-2018


పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్: నిరుద్యోగ యువత ఎదురుచూస్తోన్న పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ కమిషనర్ ఆగ‌స్టు 30న‌ నోటిఫికేషన్ విడుద‌ల‌ చేశారు.

పంచాయతీ కార్యదర్శుల ఎంపిక కోసం సెప్టెంబ‌రు 3 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు రుసుమును సెప్టెంబ‌రు 14 వరకు చెల్లించవచ్చు.

కార్యదర్శుల ఎంపిక కోసం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది.

అధికారిక వెబ్సైటు :  https://www.tsprrecruitment.in/
పూర్తి సవివరాత్మకతతో కూడిన నోటిఫికేషన్ విడుదల అయినది .... 


Employment Notification
TS Junior Panchayat Secretary posts Recruitment 2018 in Panchayat Raj Department

GOVERNMENT OF TELANGANA

OFFICE OF THE COMMISSIONER OF PANCHAYAT RAJ AND RURAL EMPLOYMENT, PANCHAYAT RAJ BHAVAN, URDU HALL LANE, HIMAYATNAGAR, HYDERABAD.

Advt. No. 2560/CPR&RE/B2/2017 Dt. 30.08.2018

Applications are invited online for the post of Junior Panchayat Secretary from the eligible candidates. Online applications are available on the website: http://tspsri.cgg.gov.in.

Candidates may apply online from 03.09.2018 to 15.09.2018 and
Last date For payment of fee is 14.09.2018.
Total No. of Vacancies are 9355.

District wise details of vacancies, eligibility, scheme of examination, fee details, reservations, general conditions etc. are available on http://tspri.cgg.gov.in.
Sd/-Neetu Kumari Prasad, Commissioner, PR&RD

District wise details of vacancies

పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మార్గదర్శకాలు. టిఎస్ జూనియర్ పంచాయితీరాజ్ సెక్రటరీ పోస్టుల భర్తీ కి మార్గదర్శకాలు, Junior Panchayat Secretaries Recruitment Guidelines : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9,355 పంచాయతీరాజ్‌ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. నియామక ప్రక్రియకు శాఖాపరమైన ఎంపిక కమిటీ (డీఎస్సీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగష్టు 30 వ తారీఖున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ  రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త జిల్లాల స్థానికత ఆధారంగానే పంచాయతీ కార్యదర్శులను నియమించనున్నారు. ప్రతి జిల్లాకు రోస్టర్‌ ప్రారంభిస్తారు. ఇందులో భాగముగా పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మార్గదర్శకాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.

తెలంగాణ‌లో 9355 జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి పోస్టులు: తెలంగాణ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో జూనియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి పోస్టుల‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జూనియర్‌ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తూ మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా వీరిని క్రమబద్ధీకరిస్తుంది.

పోస్ట్  పేరు: నియ‌ర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కొత్త జిల్లాల్లో వారు స్థానిక అభ్యర్థులై ఉండాలి.
వ‌య‌సు: 18-39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.

ప‌రీక్షా విధానం: రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో 4 గంటల వ్యవధిలో రెండు పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపరు 100 మార్కులతో జనరల్‌ నాలెడ్జి, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీకి చెంది ఉంటుంది. రెండో పేపరు మరో 100 మార్కులతో తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టానికి, పంచాయతీరాజ్‌ సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళికం, ఆర్థికం, ప్రభుత్వ పథకాలకు చెంది ఉంటుంది. పశ్నపత్రాలు జంబ్లింగ్‌ పద్ధతిలో ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4(పావు) మార్కుల చొప్పున కోత ఉంటుంది.

పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు రుసుం పెంపు
- సాధారణ అభ్యర్థులకు రూ.800
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.400
రాష్ట్రంలో 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల నియామకాలకు సంబంధించి ఉత్తర్వుల్లో పేర్కొన్న రుసుములను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత సాధారణ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించినప్పటికీ.. దాన్ని రూ.800కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ (నాన్‌ క్రీమిలేయర్‌) అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.400కు పెంచుతూ ఖరారు చేసింది. అభ్యర్థులు నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫీజు చెల్లించాలని సూచించింది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.400.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబరు 3నుంచి
ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 13.09.2018
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 13.09.2018


పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మార్గదర్శకాలు:
నోటిఫికేషన్‌ విడుదలైన 10 రోజుల్లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 విద్యార్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: జనరల్‌ అభ్యర్థులకు వయసు 18–39 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు ఐదేళ్లు.. వికలాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

హైదరాబాద్‌ అర్బన్‌ జిల్లా మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నివసించే వారు ఆయా కొత్త జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టులను అన్‌ రిజర్వ్‌డ్‌గా పరిగణిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల మెరిట్‌ లిస్టు తయారు చేస్తారు.

పరీక్ష విధానం :
పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.
ఒక్కో పేపరుకు 150 మార్కులు, మూడు గంటల వ్యవధి ఉంటుంది.

సిలబస్:
a. మొదటి పేపరులో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ,
బి. రెండో పేపరులో తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018, పంచాయతీరాజ్‌ సంస్థలు, స్థానిక పాలన, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలు, ప్రభుత్వ పథకాలపై నుంచి ప్రశ్నలొస్తాయి.

ప్రశ్నల సరళి :
1. ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి.
2. సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది.
3. తప్పుడు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది.

పరీక్ష ఫీజు:  పరీక్ష ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.800.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.400.

ఫలితాలు:  పరీక్ష అనంతరం కొత్త జిల్లాల వారీగా తయారు చేసిన మెరిట్‌ లిస్టును పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి, అక్కడి నుంచి కలెక్టర్లకు పంపుతారు. కలెక్టర్లు రోస్టర్‌ పద్ధతి ప్రకారం నియామకాలు జరుపుతారు.


శాఖాపరమైన ఎంపిక కమిటీ: కమిటీకి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్, పంచాయతీరాజ్‌ అదనపు కార్యదర్శి, సెర్ప్‌ సీఈవో, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ప్రతినిధులు (డిప్యూటీ సెక్రటరీ హోదా కు తక్కువ కానివారు) సభ్యులుగా ఉంటారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నియమించే డిప్యూటీ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
Official Recruitment Website : https://www.tsprrecruitment.in/

Post a Comment

11 Comments

 1. Districts wise list pampandi

  ReplyDelete
 2. Replies
  1. website will be opened soon. present website is under construction

   Delete
 3. Sir emem books chadavali, appsc unnappati books emyna use avutjaya

  ReplyDelete
  Replies
  1. ప్రభుత్వ అకాడమిక్ బుక్స్ చదవాలి. పైన చెప్పబడిన సిలబస్ టాపిక్స్ ను govt books nundi చదవండి

   Delete
 4. District wise list not available

  ReplyDelete
 5. District wise posts release cheyyandi sir

  ReplyDelete
 6. Other state kuda apply chesukovacha

  ReplyDelete
  Replies
  1. పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు వయోపరిమితి పెంచాలి...
   రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని, ఆ లెక్కన వయోపరిమితి 44 ఏళ్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 39 ఏళ్లుగా నిర్ణయించడంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

   Delete
  2. As per the New Zonal System..
   Only Local Candidates may apply for this recruitment...

   Delete

Please add your comment here

f