జేపీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - JPS Junior Panchayat Secretaries 2018 Recruitment

జేపీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - JPS Junior Panchayat Secretaries 2018 Recruitment:  తెలంగాణ రాష్ట్ర నూతన జోన్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడం...  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా దూసుకుపోయేందుకు తోడ్పడనుంది. జోనల్ వ్యవస్థకు ఆమోదం దక్కిన తొలిరోజే రాష్ట్రంలోని ఉద్యోగార్థులు సంబురపడేలా తెలంగాణ సర్కారు 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.జూ.పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువు పెంపు
జూనియర్ పంచాయతీ కార్యదర్శి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. notification ప్రకారం ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 11-09-2018, దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2018. దరఖాస్తులో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది.

ఫీజు చెల్లింపుకు ఈనెల 14 వ తేదీ, 
దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్ష తేదీ : 10-10-2018

9,355 జేపీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధిశాఖలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. సెప్టెంబర్ 3 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

జిల్లాలవారీగా పోస్టుల వివరాలు ....
అర్హత ......
పరీక్ష నిర్వహణ తీరు....
పరీక్ష ఫీజు.....
రిజర్వేషన్లు తదితర వివరాల కోసం.....
 జేపీవో పోస్టుల భర్తీ వెబ్‌సైట్ "tspri.cgg.gov.in" లో సంప్రదించాలని ఆ శాఖ ఓ ప్రకటనలో సూచించింది.

ఈ వెబ్‌సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది.

జేపీఎస్ వివరాలు:
విద్యార్హత : డిగ్రీ
జిల్లాస్థాయిలో భర్తీ ప్రక్రియ జరుగును.

వయసు: 18 నుంచి 39 ఏండ్లలోపు వయోపరిమితి
వయసు సడలింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్లు సడలింపు

మొత్తం మార్కులు : 300 మార్కులతో ప్రశ్నాపత్రం

ప్రశ్నాపత్రం / పరీక్ష విధానం:
A. జనరల్ నాలెడ్జ్‌కు 150 మార్కులు
B. తెలంగాణ చరిత్ర, ఇతర అంశాలకు 150 మార్కులు

తప్పుడు సమాధానానికి 1/3 మార్కు కోత

పరీక్ష రుసుము : 
1. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.800
2. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.400

9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది . దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో మహిళలకు 3158 పోస్టులు రిజర్వ్ చేశారు. జిల్లాల వారిగా ఖాళీలను ప్రకటించారు. జిల్లాల వారిగా రిజర్వేషన్‌లతో పోస్టుల సంఖ్యను తెలిపారు. పరీక్ష విధానం, పూర్తి వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఉంటుందని తెలిపారు.

జిల్లాల వారిగా పోస్టులు
ఆదిలాబాద్ 335,
ఆసిఫాబాద్ 235,
మంచిర్యాల 232,
నిర్మల్ 322,
ఖమ్మం 485,
భద్రాద్రి కొత్తగూడెం 387,
మహబూబ్‌నగర్ 511,
గద్వాల 161,
నాగర్ కర్నూల్ 311,
వనపర్తి 159
కరీంనగర్ 229,
సిరిసిల్ల 177,
జగిత్యాల 288,
పెద్దపెల్లి 194,
వరంగల్ గ్రామీణం 276,
వరంగల్ టౌన్ 79
జనగామ 206,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా 304,
మహబూబాబాద్ 370
నల్లగొండ 661,
సూర్యాపేట 342,
భువనగిరి 307,
నిజామాబాద్ 405,
కామారెడ్డి 436,
రంగారెడ్డి 357,
వికారాబాద్ 429,
మేడ్చల్ 27
మెదక్ 346,
సంగారెడ్డి 446
సిద్దిపేట 338

మరిన్ని వివరాలకు : పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మార్గదర్శకాలు


జేపీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, JPS Junior Panchayat Secretaries 2018 Recruitment in panchayat raj department, tspsri.cgg.gov.in, TSPSRI Online Application Form, జిల్లాలవారీగా పోస్టుల వివరాలు

Post a Comment

0 Comments

f