తెలంగాణ పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ (TS SI Preliminary Answer key 2018)

తెలంగాణ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ, తెలంగాణ పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ TS Police Recruitment SI Preliminary Answer key 2018: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 94.44 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో సివిల్‌, సాయుధ, ప్రత్యేక పటాలం, ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీఎఫ్‌)లతోపాటు జిల్లా అగ్నిమాపక అధికారి, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు గత మే 31న ప్రకటన విడుదల చేశారు. మొత్తం 1217 పోస్టులకు గాను 1,88,715 మంది దరఖాస్తు చేసుకోగా పరిశీలన అనంతరం 233 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చారు. అర్హులైన వారికి ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 339 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 1,78,010 మంది అంటే 94.44 శాతం మంది హాజరయ్యారు.

తెలంగాణ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ, తెలంగాణ పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ TS Police Recruitment SI Preliminary Answer key 2018,తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ,tslprb si answer key

- అత్యధికంగా నల్గొండ జిల్లాలో 96.85 శాతం మంది హాజరుకాగా 96.03తో వరంగల్‌ రెండోస్థానంలో, 95.89 శాతంతో మహబూబ్‌నగర్‌ మూడోస్థానంలో నిలిచాయి.

- హైదరాబాద్‌-2లో అతి తక్కువగా 91.82 శాతం హాజరు నమోదైంది. పాత జిల్లాల ప్రకారమే పరీక్ష జరిగింది.

- ఎస్సై పరీక్షలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

- అందులోనూ తొలి తెలంగాణ ఉద్యమంపైనే అధికంగా ప్రశ్నలొచ్చాయి. ఈ పరీక్షకు సంబంధించి ‘కీ’ విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌ ‌www.tslprb.in లో దీన్ని అందుబాటులో ఉంచారు.


ఎస్సై పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు అనుమానాలు ఉంటే ఈ నెల 29 సాయంత్రం 5 గంటల లోగా keyobjectionstslprb@gmail.com ఈమెయిల్‌ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని నియామక మండలి ఛైర్మన్‌ పేర్కొన్నారు. అభ్యర్థులు తాము ముందుగానే నమోదు చేసుకున్న ఈమెయిల్‌ ఐడీ ద్వారా తమకు అనుమానం ఉన్న ప్రశ్న నంబరు, బుక్‌లెట్‌ కోడ్‌తో పాటు దానికి సంబంధించిన పత్రాన్ని స్కాన్‌ చేసి జత చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఎలాంటి విజ్ఞప్తులు తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ

Post a Comment

0 Comments

f