తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్స్ - TSLPRB Constable Hall tickets 2018

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్స్ - TSLPRB Constable  Hall tickets 2018: నిమిషం ఆలస్యమైనా అనుమతించం: టి.ఎస్.ఎల్.పి.ఆర్.బి పరీక్షల హాల్‌టికెట్లు, తెలంగాణ  కానిస్టేబుల్ పరీక్షల హాల్‌టికెట్లు.  కానిస్టేబుల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో సెప్టెంబ‌రు 30న నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.⧫ 20 నుంచి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్..
⧫ ఈ నెల 28 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్కి  అవకాశం.. 
⧫ 30న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష..

1. ఈ నెల 30న నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లను గురువారం 20 నుంచి ఉదయం 8 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.
2. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు 28వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
3. ఈ నెల 30న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, హాల్‌టికెట్లను www.tslprb.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
4. ఏ4 సైజు పేపర్‌లో రెండువైపులా వచ్చేలా హాల్‌టికెట్‌ను బ్లాక్‌ అండ్‌ వైట్ ప్రింట్‌ఔట్ తీసుకోవాలన్నారు.
5. హాల్‌టికెట్‌పై అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫొటోను అతికించాలని సూచించారు.
6. ఫొటోను అతికించకుండా హాల్‌టికెట్‌తో వచ్చే అభ్యర్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు


తెలంగాణ తెలంగాణ ఎపోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్‌టికెట్స్ - TSLPRB Police Constable Hall tickets 2018
సెప్టెంబ‌రు 30న జరిగే పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక్కనిమిషం ఆలస్యమైనా అను మతించేది లేదని తెలియచేసారు.


1. పోలీస్ కానిస్టేబుల్పోస్టులకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహిస్తారు.
2.  20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
3. సమస్యలుంటే 9393711110, 9391005006 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

సెప్టెంబ‌రు 30న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష


అభ్యర్థులు ఒక రోజు ముందుగా నే పరీక్షాకేంద్రానికి వెళ్లి చూసుకోవాలని, హాల్‌ టిక్కెట్‌ అదే సెంటర్‌లో ఉందా? లేదా కన్‌ఫాం చేసుకోవాలని, ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని, హాల్‌టిక్కెట్‌తో పాటు బ్లాక్‌ లేదా బ్లూ పెన్‌ మాత్రమే హాల్‌లోకి అనుమతిస్తారని సీపీ పేర్కొన్నారు.

పోలీస్ అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంది. పరీక్ష రాసే అభ్యర్థులు కొన్ని నెలల పాటు కఠోర శ్రమ చేసి పరీక్షకు సన్నధ్దం అవుతున్నారు. పరీక్షల సమయంలో ఏచిన్న పొరపాటు చేసినా వారి కలలు కల్లలవుతాయి. పోలీస్ కానిస్టేబుల్/ఎస్సై, ఏఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది.  పోలీస్ కానిస్టేబుల్/ఎస్సై కావాలనే బలమైన కోరిక గల అభ్యర్థులు ఒత్తిడికి గురి కాకుండా కొన్ని సూచనలు పాటించి పరీక్ష గదిలో చిన్న చిన్న తప్పులను అధిగమిస్తే విజయం తధ్యం. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు.

పోలీస్ అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు:
1. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండటంతో ఆలస్యమయితే కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకోవాలి.
2. టీఎస్‌ఎల్‌ఆర్‌బీ తుది నిర్ణయం మేరకు హాల్‌టికెట్లను అందజేశారు. డూప్లికేట్‌ హాల్‌ టికెట్ల జారీ ఉండదు. ఒరిజనల్‌ హాల్‌టికెట్లును మాత్రమే పరీక్ష గదిలోకి అనుమతి ఇస్తారు.
3. తుది పరీక్ష అనంతరం సర్టిఫికెట్‌ రీ వెరిఫికేషన్‌, దేహదారుఢ్య పరీక్షలు, అభ్యర్థి తన దరఖాస్తులో పేర్కొన్న పూర్తి వివరాలను పరిశీలించిన అనంతరం అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది.
4. పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పూర్తయ్యే వరకు పరీక్ష గదిని వదిలి వెళ్లవ‌ద్దు.
5. పరీక్ష హాల్లో బ్లాక్‌ లేదా బ్లూ పాయింట్‌ పెన్ను, తుదిపరీక్ష హాల్‌టికెట్‌, ఏదైనా ఒక ఒరిజనల్‌ ధ్రువపత్రం (ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపుకార్డు) వెంట తీసుకెళ్లాలి.
6. హాల్‌టికెట్లలో అభ్యర్థి ఫొటో, సంతకాలు స్పష్టంగా ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం హాల్‌టికెట్‌ను లేజర్‌ ప్రింటర్‌ ద్వారా మాత్రమే తీసుకోవాలి.
7. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులో పూరించిన విధంగా తన హాల్‌టికెట్‌లో ఇన్విజిలేటర్‌ సమక్షంలో సంతకం చేయాలి.
8. పరీక్ష రాసే ముందు అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌పై సూచనలను పూర్తిగా చదవాలి. ఓఎంఆర్‌ షీట్‌పై పేర్కొన్న బుక్‌లెట్‌ కోడ్‌ వచ్చిందో సరి చూసుకోవాలి.
9. ప్రశ్నపత్రం తెరిచిన వెంటనే పేపర్‌ బుక్‌లెట్‌, 200 అబ్జెక్టివ్‌ మాదిరి ప్రశ్నలు సరిగా ముద్రపడిందా లేదా చూసుకోవాలి. ప్రశ్నల్లో స్పష్టత లేకుంటే వెంటనే వేరే ప్రశ్నపత్రం తీసుకోవాలి.
10. అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్థనలు, గుర్తింపు చిహ్నాలు రాస్తే ఆ జవాబు పత్రాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఓఎంఆర్‌ షీట్‌పై చిత్తుపని (రఫ్‌వర్క్‌) చేయరాదు.
11. అభ్యర్థులు మెహందీ, చేతులపై, పాదాలపై సిరా రాసుకుంటే పరీక్షకు అనర్హులు.
12. ఎలక్ట్రానిక్‌ వస్తువులు చరవాణి, సెల్యూలర్‌ ఫోన్లు, ట్యాబులు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్‌, పర్సులు, ఛార్టులు, విడి కాగితాలు, రికార్డు చేసే పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లవద్దు.
12. తుది పరీక్ష 200 మార్కులకు 200 అబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
13. పరీక్ష హాల్‌లో మోసపూరిత చర్యలకు పాల్పడినా ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని పరిగణనలోకి తీసుకోరు.
14. అభ్యర్థి బయోమెట్రిక్‌ వివరాలు తీసుకుంటారు.
15. అభ్యర్థి పరీక్ష గది వదిలి వెళ్లేటప్పుడు ఒరిజినల్‌ ఓఎంఆర్‌షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇచ్చేయాలి. ప్రశ్నపత్రం బుక్‌లెట్‌ ఓఎంఆర్‌ షీట్‌ పెన్సిల్‌ కాపీని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు. డూప్లికేట్‌ ఓఎంఆర్‌ షీట్‌ అభ్యర్థికి అందిస్తారు.
16. పరీక్ష పూర్తయ్యేంత వరకు దీనిని ఒరిజినల్‌ ఓఎంఆర్‌ నుంచి వేరు చేయకూడదు. పరీక్ష అనంతరం ఇన్విజిలేటర్‌ సమక్షంలో డూప్లికేట్‌ ఓఎంఆర్‌షీట్‌ను పరిశీలించి వేరు చేసి వెంట తీసుకెళ్లాలి.
17. జవాబు పత్రం మార్చుకోవడానికి వీలు లేదు. ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో సరైన సమాధానాన్ని ఎన్నుకుని ఓఎంఆర్‌ షీట్‌లో సరైన వృత్తాన్ని పూరించాలి.
18. ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ వృత్తాలను పూరించకూడదు. అభ్యర్థి సమాధానంపై పూర్తి సంతృప్తి పొందిన తర్వాతే ఓఎంఆర్‌ షీట్‌లో పూరించాలి. ఓఎంఆర్‌షీట్‌లో రబ్బర్‌ లేదా వైట్‌ ఫ్లూయిడ్‌ లాంటివి ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే ఓఎంఆర్‌ షీట్‌ను పరిగణనలోకి తీసుకోరు.
19. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లం - తెలుగు, ఆంగ్లం - ఉర్దూ భాషల్లో ఇస్తారు.
20. ఓఎంఆర్‌ జవాబుపత్రంలో వృత్తాలను బ్లూ, బ్లాక్‌ పెన్నులతో మాత్రమే పూరించాలి. ఇతర రంగు పెన్నులు, పెన్సిళ్లు, ఇంక్‌, జెల్‌ పెన్నులతో రాయడానికి అనుమతిలేదు.

ఒత్తిడికి గురి కావొద్దు:
పోలీస్‌ కావాలనే బలమైన కోరిక ఉన్నవారిని విజయం వైపు నడిపిస్తుంది. పరీక్ష సమయంలో అభ్యర్థులు ఒత్తిడికి లోను కావొద్దు. మనకు తెలియకుండానే ఒత్తిడితో పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఇన్ని రోజులు పడిన శ్రమ వృథా అవుతుంది. అందుకే అభ్యర్థులు పరీక్ష విధానంలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా వ్యవహారించాలి. హాల్‌టెకట్‌ దగ్గర నుంచి ఓఎంఆర్‌ షీట్‌, సమయం పరీక్ష కేంద్రంలో వ్యవహర శైలి తదితర అంశాలు అన్ని నిబంధన మేర పాటించాలి. ఎలాంటి తప్పిదం జరిగినా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదని గమనించాలి.

Telangana State Level Police Recruitment Board హాల్ టికెట్స్, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్స్, టి.ఎస్.ఎల్.పి.ఆర్.బి హాల్‌టికెట్లు, TSLPRB Constable, SI, ASI Hall tickets, Telangana Police Hall tickets,
TSLPRB SI Hall tickets 2018

Post a Comment

0 Comments

f