తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం - TS Overseas Scholarships for SC, ST, BC, Minority Candidates

తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం - TS Overseas Scholarships for SC, ST, BC, Minority Candidates

విదేశీ విద్యకు ఉపకారవేతనాలు, టిఎస్ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్ :  ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌, సంప్రదాయ కోర్సుల పట్టభద్రుల్లో చాలామందికి విదేశాల్లో పీజీ, డాక్టరేట్‌ చేయాలని ఉంటుంది. దీన్ని నెరవేర్చుకోవాలంటే తగిన అర్హతలతో పాటు డబ్బు కీలకం. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో విదేశీవిద్యకు దూరమవుతున్న బడుగు, బలహీన, వెనుకబడిన అల్పసంఖ్యాక వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు విదేశీ విద్యను అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంబేడ్కర్‌ , మహాత్మా జ్యోతిబాపూలె, సీఎం విదేశీ విద్యా పథకాల కింద రూ.20 లక్షల చొప్పున ఉపకారవేతనం మంజూరు చేస్తోంది.

విదేశీ విద్యకు ఉపకారవేతనాలు,టిఎస్ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్,తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం - TS Overseas Scholarships for SC, ST, BC, Minority Candidates,అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్,విదేశీ విద్యాపథకం,సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్ ,మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్
తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం - TS Overseas Scholarships for SC, ST, BC, Minority Candidates


పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఉపకారవేతనం 


మొదట ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన ఈ పథకాన్ని మూడేళ్ల క్రితం మైనార్టీ విద్యార్థులకూ అమల్లోకి తీసుకువచ్చింది. 2016 నుంచి బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ప్రారంభించింది. ఏటా దాదాపు 1000 మంది విద్యార్థులకు సహాయం అందిస్తోంది. తొలుత గరిష్ఠ వయసు 30 ఏళ్లుగా పేర్కొన్నారు. ఆ తరువాత 35 ఏళ్లుగా సవరించారు. ఆంగ్లభాష ప్రావీణ్యత స్కోరును యూనివర్సిటీలు ప్రవేశానికి కల్పిస్తున్న అర్హత స్కోరు మేరకు మార్పులు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు విదేశీవిద్యకు వెళ్లేందుకు సహకరిస్తోంది.

Overseas Vidya Nidhi Scholarships Names:
1. Chief Minister's Overseas Scholarship Scheme for Minorities
2. Ambedkar Overseas Vidya Nidhi for SC,ST
3. Mahatma Jyothiba Phule BC Overseas Vidya Nidhi


Overseas Scholarships for SC, ST, BC and Minority Services
1. Application Registration for Mahatma Jyothiba Phule BC Overseas Vidya Nidhi Students.
2. Application Registration for Chief Minister's Overseas Scholarship Scheme for Students.
3. Application Registration for Overseas Scholarships for SC/ST Students.
Overseas Scholarships Online application Registration Link


ఏడాదిలో రెండుసార్లు దరఖాస్తులు ఆహ్వానం: 
విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఏడాదిలో రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు, 
జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు.... 
ఈ-పాస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు సంక్షేమశాఖలు ప్రకటనలు జారీ చేస్తాయి.  ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ఈనెల 30 వరకు దరఖాస్తు గడువు పేర్కొంది.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులు దరఖాస్తు చేసిన తరువాత ఆయా దరఖాస్తులను పరిశీలించి అర్హమైనవి గుర్తిస్తారు. సంక్షేమశాఖల కార్యదర్శుల ఆధ్వర్యంలోని కమిటీలు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. అభ్యర్థుల సామాజిక ఆర్థిక పరిస్థితులను క్షేత్రస్థాయిలోనూ విచారణ చేస్తారు. ఒకవేళ అభ్యర్థులు అప్పటికే రుణాలు తీసుకుని విదేశాలకు చదువుకునేందుకు వెళ్లిపోతే... తల్లిదండ్రులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు అవకాశమిస్తారు. ఎంపికైన అభ్యర్థి గడువులోగా వీసాను పొందాల్సి ఉంటుంది. వీసా పొందినవారికి మాత్రమే రూ.20 లక్షల ఉపకారవేతనం అందుతుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


సంక్షేమ శాఖలకు వేర్వేరుగా లక్ష్యాలను ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ వర్గాలకు అత్యధికంగా ఏడాదికి 500 ఉపకారవేతనాలు మంజూరు చేస్తోంది. ఆ తరువాత బీసీలకు 300 ఇస్తున్నా... ఇందులో 15 సీట్లు ఈబీసీలకు వెళ్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల టార్గెట్‌ తక్కువగా ఉంది.

తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎస్సీ సంక్షేమశాఖ తరపున విదేశీవిద్య పథకం కింద ఇప్పటివరకు 465 మంది విద్యార్థులు సహాయం పొందారు. 2015-16 విద్యాసంవత్సరం నుంచి ఈ పథకం కింద సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తొలుత ఒక్కో సంక్షేమశాఖకు అర్హతలు వేర్వేరుగా ఉన్నప్పటికీ... అందరికీ ఒకేలా ఇటీవలే ప్రభుత్వం సమీకృత అర్హత నిబంధనలు ఖరారు చేసింది. ఆంగ్లభాష ప్రావీణ్యం సంపాదించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల పరిధిలో జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలకు ప్రత్యేక శిక్షణలు ఇప్పిస్తోంది. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తోంది.

విద్యార్థులు రెండేళ్లలో పీజీ చదువు పూర్తిచేసేందుకు రూ.20 లక్షలు లభిస్తాయి. ఆయా దేశాల్లోని వర్క్‌ పర్మిట్‌ వీసా నిబంధనల మేరకు పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు పనితీరులోనూ ప్రతిభ చూపితే వారికి అక్కడే శాశ్వత నివాసం పొందేందుకు వీలుంటుంది. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో చదువులు పూర్తిచేసుకున్న పీజీ విద్యార్థులు బహుళజాతి సంస్థల్లో (ఎంఎన్‌సీలు) పనిచేస్తున్నారు. నెలకు వేల డాలర్ల వేతనాన్ని పొందుతున్నారు.

మరిన్ని వివరాలు: విదేశీ విద్యానిధి పథకం


విదేశీ విద్యానిధికి అర్హతలు:
1. గరిష్ఠ వయసు - 35 ఏళ్లు
2. వార్షిక కుటుంబ ఆదాయం - రూ.5లక్షలు
3. డిగ్రీలో కనీస అర్హత మార్కులు - 60 శాతం
4. కుటుంబంలో ఒక్కరికే విదేశీవిద్య సహాయం

ఆంగ్లభాష ప్రావీణ్యం 
1.  టోఫెల్‌ - 6.0
2.  ఐఈఎల్‌టీఎస్‌ - 6.0
3.  జీఆర్‌ఈ - 260
4.  జీమ్యాట్‌ - 500
5.  పీటీఈ - 50

బీసీల కోసం మహాత్మాజ్యోతిబాపూలే విదేశీవిద్యా పథకం 
* ఏటా అర్హులు - 300 మంది
* వీరిలో 5 శాతం సీట్లు ఈబీసీలకు - 15
* రిజర్వేషన్‌ ఇలా... బీసీ-ఏ - 29 శాతం; బీసీ-బీ - 42 శాతం; బీసీ-డీ - 29 శాతం; వీరిలో మహిళలకు 33 శాతం

మైనార్టీల కోసం సీఎం విదేశీవిద్యా పథకం 
* ఏటా అర్హులు - 500 మంది
* బీసీ-ఏ, బీలోని మైనార్టీలు, బీసీ-సీ వర్గాలతో పాటు జైనులు, సిక్కులు తదితర మైనార్టీలు అర్హులు.

ఎస్సీ ఎస్టీలకు అంబేడ్కర్‌ విదేశీవిద్యా పథకం 
1.  ఉపకారవేతనం - రూ.20 లక్షలు
2. తొలివిడత కింద రూ.10 లక్షలు, రెండోవిడత కింద రూ.10లక్షలు
3. ఒకవైపు విమాన ఛార్జీలు - గరిష్ఠంగా రూ.50 వేలు
4. వీసా ప్రాసెసింగ్‌ ఛార్జీలు - కాన్సులేట్‌ ధరల ప్రకారం

ఎలా దరఖాస్తు చేయాలి? ఏవేవి డాకుమెంట్స్ కావాలి ?: 
1. దరఖాస్తు ఈ-పాస్‌ వెబ్‌సైట్లో ఉంటుంది.
2. మండల తహశీల్దారు మంజూరు చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ
3. పుట్టినతేదీ ధ్రువీకరణపత్రం
4. ఆధార్‌ కార్డు, ఈ-పాస్‌ దరఖాస్తు ఐడీ నెంబరు
5.  నివాస ధ్రువీకరణ పత్రం
6. పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీలో పొందిన మార్కులు, జాబితాలు
7. టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ స్కోరు
8. విదేశాల్లోని యూనివర్సిటీ నుంచి ప్రవేశపత్రం (ఐ-20)
9. తాజా పన్ను మదింపు పత్రం
10. జాతీయ బ్యాంకులోని ఖాతా పుస్తకం

చదువుకునేందుకు అనుమతించే దేశాలు:
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజీలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా.

ఎంపికకు  నిబంధనలు:
1. తొలిఏడాది మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకోకున్నా రెండో ఏడాది దరఖాస్తు చేసేందుకు అర్హులు.
2. ఉపకారవేతనానికి అదనంగా అవసరమైన మొత్తాన్ని జాతీయ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవచ్చు.
3. ఉపకారవేతనం మంజూరైన తరువాత టాపిక్‌, యూనివర్సిటీ, పరిశోధన మార్చుకోవడానికి వీల్లేదు.
4. అనుమతించిన ఉపకారవేతనాల్లో 10 శాతం హ్యుమానిటీస్‌, ఎకనామిక్స్‌, అకౌంట్స్‌, ఆర్ట్స్‌, న్యాయ విద్యార్థులకు కేటాయిస్తారు.
5.  మెరిట్‌లిస్టు తయారీలో డిగ్రీ మార్కులకు 60 శాతం, జీఆర్‌ఈ, జీమ్యాట్‌కు 20శాతం, ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌కు కలిపి 20 శాతం వెయిటేజీ ఉంటుంది.


Applying link TS Overseas Scholarships


బీసీల కోసం మహాత్మాజ్యోతిబాపూలే విదేశీవిద్యా పథకం , మైనార్టీల కోసం సీఎం విదేశీవిద్యా పథకం , ఎస్సీ ఎస్టీలకు అంబేడ్కర్‌ విదేశీవిద్యా పథకం , Chief Minister's Overseas Scholarship Scheme for Minorities , Ambedkar Overseas Vidya Nidhi for SC, ST,  Mahatma Jyothiba Phule BC Overseas Vidya Nidhi, Overseas Scholarships for SC, ST, BC and Minority Services, తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్, విదేశీ విద్యాపథకం, సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్ , మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్

Post a Comment

0 Comments

f