తెలంగాణ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తులు - TS NMMSS Exam 2018

నవంబర్‌ 4న నిర్వహించనున్న తెలంగాణ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు అర్హులైన 8వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా డీఈవో ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 7వ తరగతిలో 55శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత పొంది ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతూ, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షా యాభై వేల లోపు గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో www. bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ts nmms exam 2018, ts national means-cum-merit scholarship scheme examination 2018, ts nmmse exam 2018, తెలంగాణ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష, టిఎస్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ 2018

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు తెలియచేసారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 4న పరీక్ష నిర్వహిస్తామరు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి 55శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్షాయాభై వేల రూపాయల్లోపు ఉండాలి. పరీక్ష ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.100, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.50 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

పరీక్ష ఫీజు:
జనరల్‌, బీసీ విద్యార్థులు రూ. 100,
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులకు రూ. 50 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌ దరఖాస్తుకు లింకుకు అనుసంధానంగాఉన్న ఎస్‌బీఐ లింకుద్వారా చెల్లించాలని సూచించారు.

సెప్టెంబర్‌ 4 లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆ యన పేర్కొన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితా, ఫీజుల చలానాల రెండు సెట్లను జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో సెప్టెంబర్‌ 5 లోగా పంపించాలని ఆయన కోరారు.

దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్‌ 14

మరిన్ని వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని డీఈవో కోరారు.

NMMS Scheme ఎన్‌ఎంఎంఎస్‌ పథకంతో విద్యార్థులకు ఆర్థిక భరోసా. ఏడాదికి రూ.12 వేల వంతున నాలుగేళ్ళు ఉపకార వేతనం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకం. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత పాఠశాల స్థాయిలో బడి మానేస్తున్న ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ పథ కాన్ని కేంద్రం 2008మే లో ప్రవేశపెట్టింది. ప్రతి యేటా నవంబరులో జాతీయస్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు ఈ ప్రతిభా పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. పరీక్షల్లో ప్రతిభచూపిన విద్యార్థులను ఎంపిక చేసి 9వ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు నాలుగేళ్ళపాటు ఉపకార వేతనాలు అందిస్తారు. ఈ ఏడాది నవంబరులో నిర్వహించనున్న పరీక్షలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఎన్‌ఎంఎంఎస్‌ పథకం వివరాలు:
కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్షను నిర్వహిస్తుంది. ప్రతియేటా నవంబరులో అర్హత పరీక్షను నిర్వహించి మెరిట్‌ సాఽధించిన విద్యార్థులకు నాలుగేళ్ళపాటు ఏటా రూ.12 వేలు ఉపకారవేతనంగా అందజేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ప్రతి నెలా రూ.1000 వంతున విద్యార్థి బ్యాంకు ఖాతాలో 48 నెలలపాటు జమవుతాయి.

ఉపకార వేతనాలకు ఎవరు అర్హులు?. 
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలకు హాజరుకావచ్చు అయితే 2017-18 విద్యాసంవత్సరంలో 7వ తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండడంతోపాటు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి.

దరఖాస్తు ఇలా.. 
ఎన్‌ఎంఎంఎస్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైనవారు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష రుసుంను ఆన్‌లైన్‌లోని దరఖాస్తు లింకుకు అను సంధానంగా ఉన్న ఎస్‌బీఐ కలెక్ట్‌ లింకు ద్వారా చెల్లిం చాలి.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ లేదా డీఈవో కార్యాలయం లో సంప్రదించవచ్చు.

పరీక్ష విధానం
ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్ష ఎంపికచేసిన పరీక్షా కేంద్రాల్లో నవంబరు 4వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో మూడు గంటపాటు నిర్వహించే ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌) 90 ప్రశ్నలు 90 మార్కులకు, పేపర్‌-2 స్కోలాస్టిక్‌ ఎచీవ్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌) 90 ప్రశ్నలు 90 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1లో అడిగే ప్రశ్నలు విద్యార్థి మేధస్సుకు పదును పెట్టే విధంగా ఉంటాయి. పేపర్‌-2లో 7, 8 తరగతులలోని సోషల్‌, సైన్సు, లెక్కల సబ్జెక్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం మూడు గంటలు కాగా పీహెచ్‌సీ అభ్యర్థులకు అదనంగా మరో 30 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి పేపర్‌లో ఓసీ విద్యార్థులకు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లా ప్రాతిపదికన మెరిట్‌లిస్ట్‌ను తయారుచేసి ఉపకారవేతనాలను అందజేస్తారు.

విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసేందుకు పరీక్షలు దోహదం.. 
ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ స్కీమ్‌ ఓ వరం. ఈ ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులకు ఆర్థికంగా సహకారం లభించడంతోపాటు పాఠశాలస్థాయినుంచే పోటీతత్వం అలవడుతుంది. అంతర్లీనంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పరీక్షలు దోహదపడతాయి.

TS NMMS Exam 2018, TS National Means-cum-Merit Scholarship Scheme Examination 2018, TS NMMSE Exam 2018, తెలంగాణ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష, టిఎస్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ 2018. 8వ తరగతి విద్యార్థులు

వెబ్సైటు: http://bse.telangana.gov.in/NMMS.aspx

Post a Comment

0 Comments

f