తెలంగాణ కొత్త జోనల్‌ విధానం - జోన్ల వ్యవస్థ - బహుళజోన్ల పరిధి (Telangana has 7 Zones and Two Multi Zones)

Telangana has 7 Zones and Two Multi Zones, తెలంగాణ కొత్త జోనల్‌ విధానం - జోన్ల వ్యవస్థ - బహుళజోన్ల పరిధి: తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం స్వరూపమిదీ: విద్య, ఉద్యోగ నియామకాల్లో దశాబ్దాలుగా ఉన్న పాత జోనల్‌ వ్యవస్థ ఇక కనుమరుగు కానుంది. తెలంగాణలో పది జిల్లాలను 31 జిల్లాలుగా..  కొత్త జోనల్‌ విధానం ఇదీ.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళజోన్‌గా, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళజోన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో జిల్లా కేడర్‌లో 80:20, జోనల్‌ కేడర్‌లో 70:30, బహుళజోనల్‌లో 60:40 నిష్పత్తిలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

తెలంగాణ కొత్త జోనల్‌ విధానం - జోన్ల వ్యవస్థ - బహుళజోన్ల పరిధి,telangana has 7 zones and two multi zones,telangana new zonal system

కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్రస్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. వాటికి 95 శాతం స్థానిక రిజర్వేషన్లు, అయిదు శాతం స్థానికేతర రిజర్వేషన్లు ఇస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల్లో రిజర్వేషన్లు లేవు. అందరూ వీటికి పోటీపడేవారు. కొత్త విధానంలో రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపివేసి కేవలం పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.

ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు.

 తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో.. నేడు కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.

నూతన జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే...
తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనున్నది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటుచేసింది.
గత జోనల్ విధానాన్ని పరిశీలిస్తే....
గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్‌పోస్టుల భర్తీలో కల్పించిన రిజర్వేషన్ల నిష్పత్తి వల్ల కూడా తెలంగాణలోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. జిల్లా పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ లేదు. దీనికితోడు ఓపెన్ క్యాటగిరీకి నాన్‌లోకల్ అని పేరు తగిలించి స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టారు. స్థానికులైన మెరిట్ అభ్యర్థులకు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు కేటాయించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తీరని నష్టం జరిగింది.

Gazette : తెలంగాణ కొత్త జోనల్‌ విధానం - జోన్ల వ్యవస్థ


7 కొత్త జోన్లు.. 
కొత్తగా ఏర్పడే జోన్లు వాటి పరిధిలోని జిల్లాలు..
S.NoZoneDistrictsPopulation
1కాళేశ్వరం జోన్‌జిల్లాలు:
భూపాలపల్లి,
మంచిర్యాల,
ఆసిఫాబాద్‌,
పెద్దపల్లి
జనాభా:
28.29 లక్షలు
2బాసర జోన్‌జిల్లాలు:
ఆదిలాబాద్‌,
నిర్మల్‌,
నిజామాబాద్‌,
జగిత్యాల
జనాభా:
39.74 లక్షలు
3రాజన్న జోన్‌జిల్లాలు:
కరీంనగర్‌,
సిద్దిపేట,
సిరిసిల్ల,
కామారెడ్డి,
మెదక్‌,
జనాభా:
43.09 లక్షలు
4భద్రాద్రి జోన్‌జిల్లాలు:
వరంగల్‌ గ్రామీణ,
వరంగల్‌ అర్బన్‌,
కొత్తగూడెం,
ఖమ్మం,
మహబూబాబాద్‌
జనాభా:
50.44 లక్షలు
5యాదాద్రి జోన్‌జిల్లాలు:
సూర్యాపేట,
నల్గొండ, యాదాద్రిభువనగిరి,
జనగామ
జనాభా:
45.23 లక్షలు
6చార్మినార్‌ జోన్‌జిల్లాలు:
హైదరాబాద్‌,
రంగారెడ్డి,
మేడ్చల్‌,
సంగారెడ్డి

జనాభా:
1.03 కోట్లు
7జోగులాంబ జోన్‌జిల్లాలు:
మహబూబ్‌నగర్‌,
వనపర్తి,
గద్వాల,
నాగర్‌కర్నూలు,
వికారాబాద్‌
జనాభా:
44.63 లక్షలు

 పోలీసు జోన్లలోనూ మార్పులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానంలో పాలన జోన్లతో పాటు పోలీసు జోన్లలోనూ మార్పులు చేసింది. దీని ప్రకారం.


2 బహుళజోన్ల పరిధిలో ఏయే జోన్లు?
Multi ZoneZonesZone NumberDistricts
A. మొదటి బహుళ జోన్‌ పరిధికాళేశ్వరం,
బాసర,
రాజన్న,
భద్రాద్రి
1వ (కాళేశ్వరం) జోన్‌ కిందజయశంకర్‌భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాలు, రామగుండం పోలీసు కమిషనరేట్‌


2వ (బాసర) జోన్‌ కింద ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలు నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌


3వ జోన్‌ (రాజన్న)కింద సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు, కరీంనగర్‌, సిద్దిపేట కమిషనరేట్లు,


4వజోన్‌ (భద్రాద్రి) కింద భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలు, వరంగల్‌, ఖమ్మం పోలీసు కమిషనరేట్లు
B. రెండో బహుళ జోన్‌ పరిధియాదాద్రి,
చార్మినార్‌,
జోగులాంబ
5వ జోన్‌ (యాదాద్రి) సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు, రాచకొండ పోలీసు కమిషనరేటు


6వ జోన్‌ (చార్మినార్‌) కింద సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లు


7వ జోన్‌ (జోగులాంబ) కింద మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌ జిల్లాలు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల వ్యవస్థ ఇదీ....
1వ జోన్‌: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు
2వ జోన్‌: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు
3వ జోన్‌: ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు
4వ జోన్‌: చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు
5వ జోన్‌: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు
6వ జోన్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాలు


Telangana's new zonal system: The new zonal system proposed by the State government for giving 95 per cent reservation to locals and five per cent for open category in public employment and education will be a a reality soon. The new system, which will come into effect after receiving the presidential assent, will have seven zones and two multi zones. It is intended to ensure a fair deal to the locals in both recruitment and transfer of employees.

Jobs for the locals was one of the key issues of the movement for statehood. It is intended to address all the ills of the system implemented in the undivided State. Its need was felt after reorganisation of the revenue administration, increasing the number of districts from 11 to 31.

The proposed new zonal system was approved by the State Cabinet before it was sent to the Centre for the presidential nod. The entire exercise was monitored personally by the Chief Minister and he called on the Prime Minister to explain to him the need for the State according 95 per cent reservation to the locals. Sourse: PTI

తెలంగాణ కొత్త జోనల్‌ విధానం, తెలంగాణ జోన్ల వ్యవస్థ, తెలంగాణ బహుళజోన్ల పరిధి, Telangana has 7 Zones and Two Multi Zones, Telangana's new zonal system

Post a Comment

0 Comments

f