ప్రధానమంత్రి ఉపకారవేతనం - PMSS Prime Minister’s Scholarship Scheme 2018

మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకారవేతనం - PMSS Prime Minister’s Scholarship Scheme 2018: ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎడ్‌, బీబీఏ, బి.ఫార్మశీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎంసీˆఏ, ట్రిపుల్‌ ఐటీ చదువుతున్న మాజీ సైనికులకు చెందిన పిల్లల నుంచి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి కేంద్రీయ సైనిక్‌ బోర్డు (న్యూదిల్లీ) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

pmss prime minister’s scholarship scheme 2018, ప్రధానమంత్రి ఉపకారవేతనం,pradhanamanthri special scholarship scheme,pmss scholarship amount,pmss scholarships last date,pmss online application form

ఆయా కోర్సుల్లో ఈ సంవత్సరం చేరి ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీ కోర్సుకు మాత్రం మూడో సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే అర్హులని తెలిపారు.


అర్హత : దరఖాస్తు చేసుకునేందుకు సంబంధిత విద్యార్థులు ఇంటర్మీడియట్లో కనీసం 60 శాతం మార్కులు పొందాల్సి ఉంది.

ప్రధానమంత్రి ఉపకార వేతనం: విద్యార్థులకైతే రూ.24 వేలు, విద్యార్థినులకైతే రూ.27 వేలు చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది .

దరఖాస్తు చివరితేది : అక్టోబర్‌ 31

కెఎస్‌బీ డాట్ జీఓవీ డాట్ ఇన్‌ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, దాని ప్రింటవుట్తో పాటు తండ్రి మాజీ సైనిక ధ్రువపత్రాలు, విద్యార్థి విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను అక్టోబర్‌ 31లోగా తమ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది .

వెబ్సైట్లు @ http://scholarships.gov.in/ లేద 
http://ksb.gov.in/application-form.htm

PMSS Prime Minister’s Scholarship Scheme 2018, ప్రధానమంత్రి ఉపకారవేతనం, Pradhanamanthri Special Scholarship Scheme, PMSS Scholarship amount, PMSS Scholarships last date,  PMSS Online application form

మరిన్ని వివరాలకైPrime Minister’s Scholarship Scheme

Post a Comment

0 Comments

f