ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ గడువు ఆగ‌స్టు 31 | MANAK INSPIRE Award Scheme

ఇన్‌స్పైర్‌ గడువు 31వ తేదీ వరకు పొడిగింపు: ఇన్‌స్పైర్‌ మనక్‌ 2018 - 19 ప్రాజెక్టు నమోదుకు ఆగ‌స్టు 31వరకు గడువు పొడిగిచారరు. తెలంగాణ జిల్లాలలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల ప్రాజెక్టుల నమోదు తప్పనిసరి చేయాలి.  అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, ప్రైవేటు, గురుకులాలు, కేజీబీవీలు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి విద్యార్థి ప్రాజెక్టు నామినేషన్‌ను పూర్తి చేయాలి. పూర్తి చేసిన వారు ఎక్నాలడ్జిమెంట్‌ కాపీని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలి, ఈవిషయంలో అలసత్వం ప్రదర్శించిన పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ గురుంచి వివరాలను మీ కొరకు పొందుపరచనైనది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్  చేయండి. ...

ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ 2018,manak inspire award scheme,inspire science exhibitions project competitions,inspire manak scholarships


సైన్స్ పరిశో ధనలకు ఇన్‌స్పైర్ మనక్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభించిన స్కీం ఇన్‌స్పైర్. విద్యార్థులను సైన్స్ కెరీర్ వైపు మళ్లించడంతోపాటు పరిశోధనలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. జూన్ 30న ఇన్‌స్పైర్ మనక్ దరఖాస్తు గడువు.

ఇన్‌స్పైర్: ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రిసెర్చ్ (ఇన్‌స్పైర్). విద్యార్థులను సైన్స్ రంగం వైపు ఆకర్షించడం, పరిశోధనలను ప్రోత్సహించడం దీని ముఖ్య లక్ష్యం. ఈ స్కీంను 2009-10 నుంచి డీఎస్‌టీ ప్రారంభించింది.

ఎవరి కోసం: 10 నుంచి 32 ఏండ్ల మధ్య ఉన్న విద్యార్థుల కోసం.

Inspire స్కీంలోని రకాలు:
a. ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్
b. ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్
c. ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్
d. ఇన్‌స్పైర్ ఫెలోషిప్
e. ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీఇన్‌స్పైర్ అవార్డ్ మనక్:
1.  మిలియన్ మైండ్స్ ఆగ్‌మెంటింగ్ నేషనల్ అస్పిరేషన్ అండ్ నాలెడ్జ్ (మనక్). దీన్ని గతంలో ఇన్‌స్పైర్ అవార్డ్ స్కీంగా పిలిచేవారు.
2.  ఈ పథకాన్ని రాష్ట్ర, యూటీ ప్రభుత్వాల ద్వారా నిర్వహిస్తారు.
3.  ఒక ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల ఆలోచనలను వెలికితీయడం దీని లక్ష్యం. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడుదశల్లో పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉంటాయి.
4.  ఈ పోటీల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, పాఠశాలలన్నీ పాల్గొనవచ్చు.
5.  ముందుగా మనక్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి.

మనక్‌లో..
1. ఏ పాఠశాలలోనైనా చదివే విద్యార్థులకు సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనే అవకాశం ఇస్తారు.
2. ప్రతి పాఠశాల నుంచి 2-3 విద్యార్థులను ఈ పథకానికి ఎంపిక చేస్తారు.
3. వీరికి జిల్లాస్థాయి నుంచే మెంటార్‌షిప్ ఇచ్చి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించే ప్రాజెక్టుకు మార్గనిర్దేశనం చేస్తారు.

ప్రోత్సాహకాలు: మనక్ ప్రాజెక్టుకు ఎంపికైన వెంటనే విద్యార్థులకు రూ. 5 వేల నగదు అందజేస్తారు. ఐఐటీల్లోని శాస్త్రవేత్తలతో మెంటార్‌షిప్ కల్పిస్తారు.


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగ‌స్టు 31
వెబ్‌సైట్: http://www.inspireawards-dst.gov.in/

మనక్ లక్ష్యం: 
దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 10 లక్షల నూతన ఆలోచనలను వెలికితీయాలని డీఎస్‌టీ లక్ష్యం. దీనికోసం 5 లక్షల పాఠశాలలకు భాగస్వామ్యం కల్పిస్తారు. 10 లక్షల ఆలోచనల్లో జిల్లాస్థాయికి లక్ష ఆలోచనలను నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ షార్ట్‌లిస్ట్ చేస్తుంది. వీటిలో దాదాపు 10 శాతాన్ని అంటే 10 వేల ఆలోచనలను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. వీటి నుంచి వెయ్యి ఆలోచనలను జాతీయిస్థాయికి పంపిస్తారు. వీటన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసి చివరగా ఎంపికైన వాటికి రూ. 20 వేలు ప్రోత్సాహక నగదును అందిస్తారు.

వీటిలో అత్యుత్తమ ఆలోచనలు స్టార్టప్‌లుగా రూపొందేలా డీఎస్‌టీ సహకరిస్తుంది.

ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ స్కాలర్షిప్స్, ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ ప్రోగ్రాం. ఇన్‌స్పైర్ స్కీం. MANANK INSPIRE Award Scheme. INSPIRE Scholarships, Manak INSPIRE Programme,  INSPIRE Science Exhibitions, Project Competitions.
ఇన్‌స్పైర్ మనక్ అవార్డ్  గడువు ఆగ‌స్టు 31 | INSPIRE MANAK Awards Registrations 2018

Post a Comment

0 Comments

f