25న "హరిత పాఠశాల - హరిత తెలంగాణ" కార్యక్రమం - Haritha Patashala - Haritha Telangana Programme

25న హరిత పాఠశాల - హరిత తెలంగాణ" కార్యక్రమం : ‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించనున్నారు . భవిష్యత్ తరాలకు బంగారు భవితవ్యాన్ని అందించాలంటే పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప ఉద్దేశ్యంతో రూపొందించిన హరితహారం కార్యక్రమాన్ని నాల్గవ దశలో భాగంగా విద్యా సంస్థల్లో ‘‘ హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ పేరుతో ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు.

haritha patashala haritha telangana programme,telanganaku haritha haaram,swachh telangana swachh patashala,హరిత పాఠశాల హరిత తెలంగాణ,స్వచ్ఛ పాఠశాల  హరిత పాఠశాల,తెలంగాణకు హరితహారం
రేపు(25-08-2019) విద్యా సంస్థల్లో హరితహారం!: 40 లక్షల మొక్కలు నాటనున్నారు. విద్యార్థులుస్థలాలు గుర్తించి, తగిన ఏర్పాట్లు చేయండి. కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు: నాలుగో విడత హరితహారంలో భాగంగా విద్యా సంస్థల్లో భారీ సంఖ్యలో మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 25న 40 లక్షల విద్యార్థులను హరితహారంలో భాగస్వామ్యం చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంస్థల్లో హరితహారానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఉత్తర్వుల్లో వివరించారు. ఈనెల 25న ఉదయం 9.30 గంటలకు ప్రధాన మార్గాల నుంచి విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తారు. 10.30 గంటలకు పాఠశాల ఆవరణకు చేరుకుంటారు. 11.30 వరకు పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటుతారు.

అనంతరం హరితహారం ఆవశ్యకతను వివరించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తారు. 37,385 పాఠశాలలు, 404 జూనియర్‌, 131 డిగ్రీ, 55 పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందిన 40 లక్షల విద్యార్థులు హరితహారంలో పాల్గొననున్నారు. కాగా హరిత తెలంగాణ-హరిత పాఠశాల పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, సీనియర్‌, విద్యాశాఖాధికారులు పాల్గొనాలని అజయ్‌ మిశ్రా ఉత్తర్వుల్లో ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, వేగంగా గుంతలు తీయాలని ఆయన సూచించారు.

హరిత పాఠశాల - హరిత తెలంగాణ
విద్యా సంస్థలకు కావాల్సిన మొక్కలు కూడా సింద్దంగా ఉన్నాయి. 25వ తేదీన జరిగే హరిత పాఠశాల-హరిత తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శిక్షణ కార్యక్రమము నిర్వహించడము జరిగినది.  దీనికి సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వడము జరిగినది. విద్యాశాఖలో హరిత హారం నిర్వహించేందుకు విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్ లను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలి.

ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చనున్నారు. విద్యాశాఖ పరిధిలోని పాఠశాల, ఉన్నత విద్య, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, బీఎడ్ కాలేజీలు, డీఎడ్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్శిటీలలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రహరీ గోడల పక్కన వీలైనన్ని వరుసల్లో మొక్కలు నాటే విధంగా అక్కడ గుంతలు తీసి సిద్ధం చేయనున్నారు.  విద్యా సంస్థల్లో ఆటస్థలాలు మినహాయించి మిగిలిన ఖాళీ స్థలాల్లో దాదాపు కోటి మొక్కలను బ్లాక్ ప్లాంటేషన్ చేయనున్నారు.

విద్యా సంస్థల్లో హరితహారాన్ని విజయవంతం చేయడంలో భాగంగా విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్ లను తయారు చేసి వారికి పర్యావరణంపై అవగాహన పెంచనున్నారు. ప్రతి నాల్గవ శనివారం విద్యా సంస్థల్లో ఇప్పటికే  "స్వచ్ఛ పాఠశాల- హరిత పాఠశాల" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా మొక్కలు నాటడం, వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, పాఠశాలనంతటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో ఎక్కువగా బతుకుతున్న మొక్కల శాతం విద్యా సంస్థల్లోనే ఉంది.


తెలంగాణ హరితహారం నినాదాలు:
1. పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు
2. చెట్లను పెంచు - ఆరోగ్యాన్ని పంచు
3. చెట్లే జగతికి ప్రాణాధారం
4. కదిలే బొమ్మల చాటున బాధలను మింగుతుంది - తనలో దాగిన మధువును అందరికీ పంచుతుంది
5. చెట్లను నీవు రక్షిస్తే - చెట్లు నిన్ను రక్షిస్తాయి (వృక్షో రక్షతి  రక్షితః)
6. ప్రకృతి ప్రసాదించిన వరమే వృక్షం -  జగతికి జీవన సౌభాగ్యానికి అదే సాక్ష్యం
7. కాలుష్యాల భక్షణకు చెట్లే సకల జగద్రక్ష
8. పర్యావరణాన్ని రక్షించే పచ్చని చెట్లు పెంచు
9. అడవికి నిప్పు - పర్యావరణానికి ముప్పు
10. చెట్లను నాటుదాం - ప్రకృతిని రక్షిద్దాం
11. ఉద్యమంగా కదులుదాం - ఊరంతా మొక్కలు నాటుదాం
12. చెట్టులేని ఊరు - ఎన్నో  కష్టాల ఏరు
13. చెట్టే మనిషికి తోడు - చెట్టే పుడమికి జోడు
14. వన సంపద సర్వ సంపదల కన్నా మిన్న
15. అమ్మ ప్రేమ నిస్తుంది - చెట్టు నీడనిస్తుంది
16. మంచితనం మనిషికి అందం - పచ్చదనం ఊరికి అందం
17. మనకు బతుకునిచ్చిన చెట్లను బతుకంతా బతకనిద్దాం
18. వృక్షాలను రక్షించు ఆరోగ్యంగా జీవించు
19. మొక్కలు భగవంతుని ప్రేమకు ప్రతిరూపాలు
20. చెట్ల పెంపకానికి అడ్డులేదు - సుఖవంతమైన జీవితానికి అదుపు లేదు
21. పశుపక్షాదులు వృక్షాలు మనలను రక్షించే దేశ సంపద
22. ఆరోగ్య దీపిక - అడుగుకొక చెట్టు నాటిక
23. చక్కగా పెరిగే చెట్టు - మన జీవితాలకు ఆయువుపట్టు
24.  శబ్దకాలుష్యం తగ్గించు నచ్చిన చెట్టు పెంచు
25. వాన కురవాలా  చెట్లు నాటాలా


Telanganaku Haritha Haram (TKHH) Peldge: హరితహారం ప్రతిజ్ఞ: 
సుసంపన్నమైన, సస్యశ్యామలమైన మన తెలంగాణ నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు, మున్ముందుకు పరుగులు తీస్తూ, అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ, బంగారు తెలంగాణ గ రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి హరితహారం సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని, మరియు నా వంతుగా పది, నా సహచరులతో పది చొప్పున మొక్కలు నాటిన చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.


హరిత పాఠశాల-హరిత తెలంగాణ:
ఎం.ఈ.ఓ.లు అందరూ ఎం.పి.డి.ఓ.లతో సమన్వయం చేసుకొని తేదీ 25/08/2018 నాడు అన్ని పాఠశాలల్లో హరిత పాఠశాల-హరిత తెలంగాణ ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలి.
1.కావాల్సిన మొక్కలు తేదీ 24/08/2018 నాటికల్లా పాఠశాలకు చేరుకునేవిధంగా చర్యలు తీసుకోవాలి.
2. హరిత పాఠశాల-హరిత తెలంగాణ అను నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
3. ఉదయం 09:30ని. నుండి 10:30ని. వరకు అన్ని పాఠశాలల్లో ర్యాలీ నిర్వహించాలి.
4. ఉదయం 10:30 నుండి 11:30 వరకు అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి అనంతరం ప్రతిజ్ఞ చేయలి. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలి.
5. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు హరితహారం ప్రాముఖ్యతను గురించిన సభ ఏర్పాటు చేయాలి అనంతరం ప్రతి విద్యార్థికి 6 మొక్కల చొప్పున మొక్కలు పంపిణీ చేయాలి.
6. అన్ని ఉన్నత పాఠశాలల్లో గ్రీన్ బ్రిగేడ్ ఉపాధ్యాయులు మరియు విద్యాత్తులతో కలిపి ఏర్పాటు చేయాలి. వీరికి అటవీ శాఖ వారు అందించిన టోపీలు మరియు స్కార్ఫ్ లు ఇవ్వాలి.
7. బ్లాకు ప్లాంటేషన్ చేసే వీలు లైని పాఠశాలల్లో ప్రహరిగోడ వెంట 4-5 వరుసలుగా మొక్కలు నాటాలి.
8. ప్రతి విద్యార్థికి ఒక మొక్కను దత్తత ఇవ్వాలి.
9. ఎస్.ఎం.సి. తోను మరియు గ్రామపంచాయతీ రక్షణ కమిటీ తోను సమన్వయం చేసుకొని వారిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి.
10. హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి.

Haritha Patashala - Haritha Telangana Programme.  Telanganaku Haritha Haaram, Swachh Telangana - Swachh Patashala, హరిత పాఠశాల - హరిత తెలంగాణ, స్వచ్ఛ పాఠశాల- హరిత పాఠశాల, తెలంగాణకు హరితహారం

Post a Comment

0 Comments

f