బాలికా ఆరోగ్య రక్ష పథకం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం - Girls Health Protection Scheme

Girls Health and Hygiene Kits Distribution: Girls Health Protection Scheme - బాలికా ఆరోగ్య రక్ష పథకం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ ప్రారంభం. తెలంగాణ విద్య దేశం మొత్తానికి ఆదర్శం. విద్యార్థులను అమ్మ-నాన్నల వలె తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేజీ టు పీజీ వరకు నాణ్యమైన విద్య అందుతోంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాలతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి. ప్రపంచంలో ఎవరికీ తీసిపోని విధంగాతెలంగాణ విద్యార్థులను తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యం. బాలికా ఆరోగ్య రక్ష పథకం ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు.

బాలికా ఆరోగ్య రక్ష పథకం,హెల్త్ అండ్ హైజీన్ కిట్స్,girls health and hygiene kits distribution,girls health protection scheme,బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం బాలికా ఆరోగ్య రక్ష పథకం కింద హెల్త్ అండ్ హైజీన్ కిట్స్

తెలంగాణలోని  ప్రభుత్వ, పంచాయతీరాజ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 6 లక్షల మంది విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘‘బాలికా ఆరోగ్య రక్ష’’ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వరంగల్ లోని హసన్ పర్తి గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. 24 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన విద్య అందించడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తోందన్నారు.  తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాశాఖ ద్వారా నాణ్యమైన విద్య అందించడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి మెనును ఇస్తున్నామన్నారు. సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నామన్నారు.  నెలకు ఆరుసార్లు మాంసాహారం, ఇందులో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ , వారానికి 4సార్లు గుడ్లు, ఉదయం బూస్ట్ మిల్క్, రాగిమాల్ట్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనంలో 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి మంచి భోజనం అందిస్తున్నామన్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం బాలికా ఆరోగ్య రక్ష పథకం కింద హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామన్నారు.


హెల్త్ అండ్ హైజీన్ కిట్లో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అవసరమైన 14 రకాల 50 వస్తువులున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏయే వస్తువులు కొంటారో, తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం అమ్మ-నాన్న వలె ఆలోచించి అన్ని వస్తువులు అందిస్తోందన్నారు. ఈ పథకం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఒక్కో విద్యార్థికి ఈ కిట్ కోసం 1600 రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఏడాదికి 12 నెలలు సరిపోయే విధంగా మూడు నెలలకొకసారి కిట్ ఇస్తామన్నారు. ఇలాంటి పథకంగానీ, భోజనంగానీ విద్యాలయాల్లో దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. అందుకే ఇంత నాణ్యమైన విద్య, ఆరోగ్యం కోసం మంచి మెను, హెల్త్ కిట్లు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కు నిద్ర లేవగానే తల్లిదండ్రులకు దండం పెట్టినట్లు ఆయనకు దండం పెట్టాలన్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కార్పోరేటర్లు, కలెక్టర్లు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొని విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసి పథకాన్ని గొప్పగా ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

As many girl students will benefit from Health and Hygiene Kits being distributed by the Telangana State government. Govt has allocated Rs 100 crore for distributing these kits to each and every school going girl in the State. The government will put all efforts to put the government schools ahead of the private schools. Educating the girls on the importance of improving greenery in their place, Govt called upon the girls to take part in the mass plantation drive in their place.

హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ

Post a Comment

0 Comments

f