గర్ల్స్ హెల్త్ & హైజీన్ కిట్ల పంపిణీ - Girls Health and Hygiene Kits Distribution

గర్ల్స్ హెల్త్ & హైజీన్ కిట్ల పంపిణీ - బాలికల ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం - Girls Health and Hygiene Kits Distribution: ఈనెల 24- 30 తేదీల మధ్య  ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు, KGBVల్లో 6 నుంచి 10వ వరకు, మోడల్ స్కూళ్లలో 7వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న Girl Students కి....  పాఠశాల స్థాయిలో... హెల్త్ & హైజీన్ కిట్స్ పంపిణీ చేయాలని హెచ్ఎంలను ఆదేశిస్తూ... SPD సమగ్ర శిక్ష, TS గారు ఉత్తర్వులు జారీచేశారు. కిట్స్ పంపిణీ చేసే క్రమంలో హెచ్ఎంలు నిర్దిష్టమైన విధివిధానాలు పాటించాలని SPD గారు పేర్కొన్నారు.

గర్ల్స్ హెల్త్ & హైజీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం,బాలికల ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం,girls health and hygiene kits distribution in ts schools,13 items in health and hygiene kit

నేటి నుంచి ‘బాలిక ఆరోగ్య రక్ష’ - ఆరు లక్షల మంది బాలికలకు ప్రయోజనం: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులందరికీ బాలికల ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 31 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమ విజయవంతానికి చర్యలు తీసుకోవాలని డీఈవోలను ఆయన ఆదేశించారు. ఈ అంశంపై  డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నేటి నుంచి అమ్మాయిలకు హైజీన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. అమ్మాయిలకు ఆరోగ్య రక్ష కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనివిధంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండే 13 రకాల వస్తువులతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి విధితమే.

ఆరోగ్య కిట్ల పంపిణీ వల్ల సుమారు ఆరు లక్షల మంది విద్యార్థినులకు ప్రయోజనం కలుగుతుంది. అందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నది. 13 రకాలైన మొత్తం 22 వస్తువులతో కూడిన కిట్లను ఏడాదికి నాలుగుసార్లు విద్యార్థినులకు అందించనున్నారు. నాలుగు నెలలకు కలిపి ప్రతివిద్యార్థినిపై ప్రభుత్వం రూ.1,600 వెచ్చిస్తున్నారు.- కిట్స్ బాలికలకు పంపిణీ చేసేముందు నిర్దేశించిన 13 వస్తువులు, హ్యాండ్ వాష్  మంచి కండిషన్లో ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి.

- పాఠశాలకు వచ్చిన కిట్స్ ని ముందుగా స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి.

- బాలికలకు కిట్స్ ని పంపిణీ చేసే సందర్భంలో.... ఆక్విటెన్స్ విధిగా తీసుకోవాలి.

- 13 వస్తువులను మాత్రమే బాలికలకు ఇవ్వాలి. ప్రతిరోజు పాఠశాలలో వాడుకోవడానికి Hand Wash ని స్కూల్లోనే భద్రపరచాలి.

- పంపిణీ కార్యక్రమానికి మినిస్టర్లు, ఎంపీలు, MLC, MLAలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ఎన్నికైన ప్రజాప్రతినిధులను, SMC మెంబెర్స్ ని ఆహ్వానించాలి.

- వీలైనంత ఎక్కువ ప్రెస్ కవరేజ్ ఇవ్వాలి. ప్రెస్ క్లిప్పింగ్స్ ని స్కూల్లో భద్రపరచాలి.

Health and Hygiene Kit Acquittance
Health and Hygiene Kit Stock Entry

గర్ల్స్ హెల్త్ & హైజీన్ కిట్ల పంపిణీ కార్యక్రమం, బాలికల ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం, Girls Health and Hygiene Kits Distribution

Post a Comment

0 Comments

f