తెలంగాణ పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు విధానం - Biometric Attendance Indicators

Biometric Attendance Indicators - తెలంగాణ పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు విధానం: బయోమెట్రిక్‌ హాజరు ద్వారా ప్రభుత్వ బడులు బలోపేతం: పాఠశాలలకు అందుతున్న యంత్రాలు. ఉదయం పూట పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు మధ్యాహ్న భోజనం తర్వాత మండలంలో సమావేశం ఉందని వెళ్లిపోవటం. ముగ్గురు ఉపాధ్యాయులుండగా ప్రార్థన సమయానికి ఒక్కరు, అరగంట తర్వాత మరొకరు రావడం. ఇంకొక్క ఉపాధ్యాయుడు సమాచారం లేకుండా పాఠశాల విధులకు గైర్హాజరవడం. ఇలాంటి చర్యలు ఇకముందు తలెత్తకుండా ఉండటానికి, పాఠశాలలను బలో పేతం చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమయపాలన పాటించటానికి ప్రభుత్వం వేలిముద్ర (బయోమెట్రిక్‌) హాజరు విధానం ప్రారంభించింది. దీనికి సంబంధించిన యంత్రాలు పాఠశాలలకు చేరుతున్నాయి. ఇప్పటికే జిల్లాలలోని పాఠశాలల ఉపాధ్యాయులకు అనుకూలమున్న ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలతో హాజరు విధానంపై సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సదుపాయాలు కల్పిస్తుండగా విద్యార్థుల్లో మాత్రం ప్రమాణాలు తగ్గుతున్నాయీ.

Biometric Attendance Indicators,తెలంగాణ పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు విధానం,ఉన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం,ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం


ఉపాధ్యాయుల హాజరు శాతం తగ్గకుండా చూడాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో పాఠశాలల్లో బయోమెట్రిక్‌లను ఏర్పాటు చేయాలని భావించారు.  తద్వారా ఈ విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే తహసీల్దారు కార్యాలయాలు, ఆస్పత్రులు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరును ప్రారంభించగా ప్రస్తుతం పాఠశాలలపై దృష్టి సారిస్తున్నారు. సమయానికి బస్సులు లేనందుకే అప్పుడప్పుడూ సమయానికి రావటంలేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతుండగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగితేనే విద్యార్థుల్లో ప్రమాణాలు పెరుగుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు సమయ పాలన పాటించకపోవటం, సమాచారం, సెలవులు లేకుండా గౌర్హాజరు అవుతున్నట్లు అధికారుల తనిఖీలో తేలుతుంది.

అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌లను ఏర్పాటు చేయటానికి గతంలోనే పాఠశాల వివరాలు తీసుకున్నారు. వంద మంది విద్యార్థులకు ఒకటి చొప్పున పాఠశాలలకు బయోమెట్రిక్‌ యంత్రాలను అందిస్తున్నారు. పాఠశాల వారిగా పాస్‌వర్డ్‌ తయారు చేసి అందిస్తున్నారు.


విద్యుత్‌, అంతర్జాల సదుపాయం లేకున్నా విద్యార్థులు, ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌లో వేలిముద్రతో హాజరు వేయాలి. యంత్రం విద్యుత్‌ ఛార్జింగ్‌తో ఆరుగంటలపాటు పని చేస్తుందని వాటి పనితీరును నిపుణులు ఉపాధ్యాయులకు వివరిస్తున్నారు.


బయోమెట్రిక్‌ హాజరు ఇలా..
ఉపాధ్యాయులు పాఠశాల వేళలను కచ్చితంగా పాటించాలనే ఉద్దేశంతో బయోమెట్రిక్‌ హాజరు విధానం తీసుకు రావటంతో హాజరుతీరును నిర్ణయించారు.

Biometric Attendance Indicators:
Primary, Upper Primary schools Biometric attendance:
⧫ 9.00 AM- Green zone.
⧫ 9.05 to 9.15- Yellow zone.
- 5 Yellows-1 Red zone.
⧫ 9.15 to 9.30 Red zone.
- 3 Reds in a a month- 1 CL.
- 6 Reds in a month- Memo

High schools Biometric attendance:
⧫ 9.22 AM- Green zone.
⧫ 9.22 to 9.30- Yellow zone.
- 5 Yellows-1 Red zone.
⧫ 9.30 to 9.36 Red zone.
- 3 Reds in a a month- 1 CL.
- 6 Reds in a month- Memo


ఉన్నత పాఠశాలల్లో.. 
💚9.22 వరకు గ్రీన్‌జోన్‌,
💛9.22నుంచి 9.30వరకు ఎల్లోజోన్‌,
➜ 5 ఎల్లోజోన్లు పూర్తయితే ఒక రెడ్‌జోన్‌గా పరిగణిస్తారు. 
💗9.30 నుంచి 9.36 వరకు రెడ్‌జోన్‌
➜ నెలలో మూడు రెడ్‌ జోన్లుగా గుర్తించి ఒక సీఎల్‌గా మారుతుంది.

 "ఆరు రెడ్‌జోన్లు పూర్తయితే 'శ్రీముఖం' జారీచేస్తారు".


ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. 
💚 9 గంటల వరకు గ్రీన్‌జోన్‌,
💛 9.05నుంచి 9.15వరకు ఎల్లోజోన్‌
➜ 5 ఎల్లోజోన్లు పూర్తయితే ఒక రెడ్‌జోన్‌గా లెక్కిస్తారు.
💗 9.15నుంచి 9.30వరకు రెడ్‌జోన్‌
 నెలలో మూడు రెడ్‌జోన్లు ఒక సీఎల్‌గా మారుతుంది. 

"ఆరు రెడ్‌జోన్లు కలిస్తే ఉపాధ్యాయునికి 'శ్రీముఖం' జారీ చేస్తారు".బయోమెట్రిక్‌ హాజరు విధానం ఎంతో ప్రయోజనం: బయోమెట్రిక్‌ హాజరు విధానంతో పాఠశాలలకు ప్రయోజనం కలుగుతుంది. ఉపాధ్యాయుల హాజరుతీరుపై ఉన్న అపవాదు తొలగిపోతుంది. పాఠశాలకొచ్చే విద్యార్థుల సంఖ్య, హాజరుశాతం పెరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండానే పనితీరులో మార్పులు తెలుసుకోవచ్చు. బడుల బలోపేతానికి ఈ విధానంతో మేలు కలుగుతుంది.

Post a Comment

0 Comments

f