ఆంధ్రప్రదేశ్ ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తులు -AP Pre-matric Scholarships 2018

AP Pre-matric Scholarships 2018: AP Pre-Matric Scholarship Application Form (2018-19) for SC,ST,BC and Disabled Welfare Students. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు దరఖాస్తులు: ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులు  ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయాలని ఎమ్యీవో కార్యాలయాలకు ఆదేశాలు అందాయి.


ఆంధ్రప్రదేశ్ ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలు,ap pre-matric scholarships,ap pre-matric scholarship application form 2018-19 for sc,st,bc and disabled welfare students

జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవటానికి
- రేషన్‌కార్డు నంబరు,
- మీసేవ ద్వారా పొందిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు,
- ఆధార్‌ కార్డు,
- విద్యార్థి పాస్‌పోర్టు ఫొటో,
- బ్యాంకు ఖాతా ధ్రువపత్రాలను
ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. 

దరఖాస్తును పూర్తి చేసిన తరువాత ఆన్‌లైన్‌ ప్రింట్‌ తీసుకుని ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌ కార్డు, బ్యాంకు ఖాతా, నకళ్లను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలి. 

ప్రధానోపాధ్యాయులు తమకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖాధికారులకు పంపాలని సూచించారు.

ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూలు కులాలకు చెందిన అయిదు నుంచి పదో తరగతి వరకు గల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. 
ఉపకార వేతనాలు:
1. అయిదు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు
బాలురుకు అయితే రూ.1000 లు,
బాలికలకు రూ.1500 లు, 

2. తొమ్మిది, పది తరగతులకు చెందిన
బాల, బాలికలకు రూ.2,250 చొప్పున 
మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

AP Prematric Scholarships to Students, Apply Online on Jnanabhumi Website
https://jnanabhumi.ap.gov.in

మరిన్ని వివరాలకై : Prematric Scholarships

Post a Comment

0 Comments

f