ఆంధ్రప్రదేశ్ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తులు - AP NMMSS Exam 2018

ఆంధ్రప్రదేశ్ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తులు - AP NMMSS Exam 2018: విద్యార్థి ప్రతిభకు పరీక్ష జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పేరిట ఏటా ఉపకార వేతనాల చెల్లింపు, జాతీయ పరీక్ష నవంబరు 4న. ప్రభుత్వ పాఠశాలల్లోని ఎనిమిదో తరగతి విద్యార్థుల ప్రతిభాపాటవాలను వెలికి తీసి, వారికి నాలుగేళ్లపాటు పారితోషికంగా ఉపకార వేతనం అందించే జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. సెప్టెంబరు నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.  కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పేరిట జరిగే ఈ పోటీ జాతీయ స్థాయిలో జరుగుతుంది.  ఇప్పుడు ఈ పరీక్షల్లో ప్రతిభ చూపి ఎంపికయితే ఏడాదికి రూ.12 వేల వంతున ఉపకార వేతనం పారితోషికంగా విద్యార్థులకు లభిస్తుంది.

ap nmms exam 2018,ap national means-cum-merit scholarship scheme examination 2018,ap nmmse exam 2018,ఆంధ్రప్రదేశ్ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష,  ఏపి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ 2018

Andhra Pradesh ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్ధులకి చక్కని అవకాశం,కేంద్రప్రభుత్వం  నిర్వహించే NMMS పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  12000/- రూ.పొందే  సదవకాశం.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ: 27-09-2018,
పరిక్ష తేదీ :- 04-11-2018

వెబ్  సైట్  wwwbseapgovin

పూర్తి  వివరాలు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో  ప్రధాన ఉపాధ్యాయులని కలవండి .
ఇ మెస్సేజిని మీకు తెలిసిన  విద్యార్ధులకి తెలియ పరిచి పేద  విద్యార్ధులకి మీ వంతు  సహాయం చేయండి.....


ఈ 8వ తరగతి విద్యార్థులు అర్హులు:
1. నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, నగరపాలక, పురపాలక సంఘాలకు చెందిన పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, మండల పరిషత్తు ప్రాథమికోన్నత   పాఠశాలలు, వసతి లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే అర్హులు.
2. ఏడో తరగతిలో ప్రతిభావంతులకు అవకాశం : ఈ పోటీకి దరఖాస్తు చేసే విద్యార్థులు ఏడో తరగతిలో ప్రతిభావంతులుగా ఉండాలి.
3. జనరల్‌ కేటగిరి, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఏడో తరగతి పరీక్షల్లో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు చెందిన విద్యార్థులు 50 శాతం వంతున మార్కులు సాధించి ఉండాలి. 4. వీరు కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ పరీక్షకు దరఖాస్తు చేయాలి.

పరీక్ష రుసుం:
జనరల్‌ కేటగిరికి చెందిన వారు రూ. 100, మిగిలిన వర్గాలకు చెందిన వారు రూ. 50 వంతున పరీక్ష రుసుం చెల్లించాలి.

పరీక్షకు ప్రయివేటు విద్యా సంస్థలకు అవకాశం లేనందున, కేవలం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్‌, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలో ప్రతిభ చూపితే  ఉపకార వేతనాలు పొందేందుకు అవకాశం ఉంది.

ఈ పరీక్షలో నెగ్గితే..రూ.12 వేల వంతున ఉపకార వేతనం :
ఈ పరీక్షలో ప్రతిభ చూపి ప్రతిభావంతులుగా నిలిస్తే వారికి ఏడాదికి రూ.12 వేల వంతున పారితోషికం నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి లభిస్తుంది. అయితే ఈ విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేయాలి.

పరీక్ష విధానం:
నిమిషానికి ఒక మార్కు వంతున : పరీక్ష 180 నిమిషాల పాటు జరుగుతుంది. 180 ప్రశ్నలు, 180 సమాధానాలుగా ఉంటుంది. అంటే ఒక నిమిషంలో ఒక మార్కు వంతున విద్యార్థి ఎన్ని నిమిషాల్లో ఎన్ని మార్కులు సాధిస్తారో అది వారి ప్రతిభను నిర్థారిస్తుంది. ఏడో తరగతి పాఠ్యాంశాల నుంచి ఎనిమిదో తరగతిలో అక్టోబరు వరకు జరిగిన పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నాపత్రం ఉంటుంది.

రెండు విభాగాలుగా పరీక్ష:
పరీక్ష రెండు విభాగాలుగా జరుగుతుంది. తొలి విభాగం మానసిక సామర్థ్య విభాగం, రెండో విభాగం విషయ సామర్థ్య విభాగంగా ఉంటుంది. ఒక్కో విభాగానికి 90 మార్కుల వంతున రెండు విభాగాలకు కలిపి 180 మార్కులకు ప్రశ్నలుంటాయి.

1, మేధస్సుకు పదును : మానసిక సామర్థ్య విభాగం విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా ఉంటుంది. 90 మార్కులకు కేటాయించిన ఈవిభాగంలో విద్యార్థులు మానసిక సామర్థ్యంలో విద్యార్థి ప్రతిభను వెలుగులోకి తెచ్చే విధంగా ఇందులో మళ్లీ రెండు ఉప విభాగాలుంటాయి. 45 మార్కులకు సాధారణ విభాగం, 45 మార్కులకు బొమ్మల విభాగం ఉంటాయి.

2. విషయ సామర్థ్య విభాగం : ఏడు, ఎనిమిది తరగతులకు చెందిన పాఠ్యాంశాల ఆధారంగా ఈ విభాగంలో 90 మార్కులకు 90 ప్రశ్నలుంటాయి. గణిత శాస్త్రానికి 20, భౌతిక శాస్త్రానికి 12, రసాయన శాస్త్రానికి 12, జీవశాస్త్రానికి 11, సాంఘిక శాస్త్రానికి 35 మార్కుల వంతున ప్రశ్నలుంటాయి. వీటికి సరైన సమాధానాలు ఎన్ని ఎక్కువ  రాయగలిగితే  ఆమేరకు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇందుకు తగినట్లుగా పారితోషికం లభిస్తుంది.

పరీక్ష మాధ్యమం :
రెండు మాధ్యమాల్లోను ప్రశ్న పత్రం : ఈ పరీక్షలకు చెందిన ప్రశ్న పత్రం రెండు మాధ్యమాల్లో ఉంటుంది. ఆంగ్లంలోను, తెలుగులోను ప్రశ్నలుంటాయి. ఇందువలన తెలుగు మాధ్యమంలోని విద్యార్థులు కూడా ఈ పరీక్షలో ప్రతిభ ప్రదర్శించేందుకు అవకాశం ఉంది.

పరీక్ష తేది :
నవంబరు 4న పరీక్ష : ఈ విద్యాసంవత్సరంలో నవంబరు నెల నాలుగో తేదీ పరీక్ష జరుగుతుంది. ప్రతి ఏటా నవంబరు నెల తొలి ఆదివారం పరీక్ష నిర్వహించడం ఆనవాయితీ.

దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్‌ 27

ఏడు, ఎనిమిదో తరగతి  పాఠ్యాంశాలను చక్కగా చదువుకుంటూ, వీటిలోని అంశాలను ఎప్పటికప్పుడు నోటు పుస్తకాల్లో రాసుకుంటే బాగా గుర్తుంటుంది. పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణను వినియోగించుకుంటే ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.

AP  NMMS Exam 2018, AP National Means-cum-Merit Scholarship Scheme Examination 2018, AP NMMSE Exam 2018, ఆంధ్రప్రదేశ్ నేషనల్‌ మీన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష, ఏపి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ 2018. 8వ తరగతి విద్యార్థులు

వెబ్సైటు : http://main.bseap.org/

Post a Comment

0 Comments

f