ఏపి అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం 2018 (Ambedkar Overseas Scholarships)

ఆంధ్రప్రదేశ్‌ అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం - Ambedkar Overseas Vidyanidhi Scholarships to SC, ST, Minority, EBC Students: అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్ - ఎస్టీ, ఎస్టీలకు అండగా అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15లక్షలు!. మెరిట్‌ సాధిస్తే నచ్చిన కోర్సుకు చాన్స్‌.  ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యసించడం ఓ కలే..! అనేది ఒకప్పటి మాట. సాధారణ నిరుపేద కుటుంబాలకు చెందిన ఇటువంటి విద్యార్థులకు విదేశాల్లో చదవాలంటే ఎంతో ఆర్థికభారంతో కూడుకున్న పని..! తెలివితేటలు, చదువలో రాణించాలనే తపన ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు వారికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆర్థికంగా వెసలుబాటు లేక, ఉన్నత విద్య చదువుకోలేని వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఉన్నతవిద్య చదువుకోవాలనే  వారి ఆశలను నెరవేరుస్తుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్‌ నిధులను కూడా వారికి ఖర్చు చేస్తోంది.

ambedkar overseas scholarships to sc,st,minority,ebc students,ambedkar overseas vidyanidhi to sc, st students,overseas scholarships to sc,st,minority,ebc students, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం,అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్,scholarships for study abroad

పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సులకు చాన్స్‌
మొన్నటివరకు పీజీలో ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ప్యూర్‌ సైన్స్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌, మెడిసిన్‌, నర్సింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యూమానిటిస్‌ కోర్సుల్లో పీజీతో పాటు పీహెచ్‌డీకి ఈ స్కీమ్‌ డిజైన్‌ చేశారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఒక ఏడాది లేదా ఆరు నెలలు వ్యవధి సర్టిఫికెట్‌ కోర్సులు విదేశాల్లో చేయవచ్చు. ఉదాహరణకు సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెన్సీ (సీసీఏ), సర్టిఫైడ్‌ పోర్ట్‌పోలియో మేనేజర్‌ (సీపీఎం) కోర్సులు విదేశాల్లో చేయవచ్చు. ఇదివరకే ఎంబీబీఎస్‌కు అవకాశం ఉంది. కొత్తగా సీసీఎ, సీపీఎం కోర్సులకు అవకాశం ఇచ్చారు. ఈ రెండు కోర్సులు మన దేశంలో కాస్ట్‌ ఆకౌంటింగ్‌ (సీఏ)తో సమానం.

ఏయే దేశాల్లో కోర్సులు చేయవచ్చు :
ఈ స్కీమ్‌ ద్వారా గతేడాది వరకు.. ఆయా కోర్సులు చేయడానికి కేవలం ఐదు దేశాల్లోనే అవకాశం ఉండేది. ఇప్పుడు మరో పది దేశాల్లో అదనంగా అవకాశం కల్పించారు. అమెరికా, యూకే, ఆస్ర్టేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, రష్యా, పిలిప్పిన్స్‌, కజకిస్తాన్‌, చైనా (ఫిలిప్పీన్స్‌, కజకిస్తాన్‌, చైనా దేశాల్లో మాత్రమే మెడిసిన్‌కు అవకాశం)

ఎంపిక విధానము:
మెరిట్‌ ఆధారంగా ఎంపిక
 రాష్ట్రస్థాయిలో ఎంపిక కమిటీ అభ్యర్ధుల రాత పరీక్షలో వచ్చిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏటా రెండు విడతల్లో ఆగస్టు, సెప్టెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ప్రక్రియ నిర్వహిస్తారు. అన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక అభ్యర్థులకు కమిటీ కౌన్సిలింగ్‌ చేస్తుంది. 33శాతం మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. ఒక ఏడాదిలో ఎస్సీలకు 300, ఎస్టీలకు 150 సీట్లు ఉంటాయి.

అర్హతలు:
అభ్యర్థుల వార్షికాదాయం మెన్నటి వరకు రూ.2లక్షలు అర్హతగా ఉండేది. ఇప్పుడు రూ.6లక్షలకు పెంచారు. ఉద్యోగులు కూడా విదేశాల్లో ఉన్న విద్య చదవాలంటే వారి ఆదాయం రూ.2లక్షలకు మించకపోతే వారికి అవకాశం ఇచ్చారు. జీవోఎంఎన్‌ నెంబరు 93 ప్రకారం గతేడాది వరకు ఎంపికైన అభ్యర్ధులకు చెల్లించిన రూ.10లక్షల మొత్తాన్ని ఈ ఏడాది నుంచి రూ.15లక్షలకు పెంచారు. ఎంపికైన విద్యార్థుల్లో ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్‌, ఎస్టీలకు ట్రైకార్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు.


నిబంధనలు:
21 నుంచి 37 ఏళ్లు దాటకూడదు. వికలాంగులకు 42 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ఎంపిక కోసం దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా టోపెల్‌, ఐఐఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, బీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. విదేశాల్లో సంబంధిత కోర్సుకు అడ్మిషన్‌ పొంది ఉండాలి. పాస్‌పోర్టు ఉండాలి. మీ సేవ జారీ చేసిన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా రేషన్‌కార్డు ఉండాలి. జనన, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, టాక్స్ అసెస్‌మెంట్ వివరాలు ఉండాలి.

Ambedkar Overseas Scholarships to SC, ST, Minority, EBC, BC, Kapu Students, Ambedkar Overseas Vidyanidhi to SC, ST, EBC, BC, Kapu Students, Overseas Scholarships to SC, ST, Minority, EBC, BC, Kapu Students, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్, Scholarships for Study Abroad


Overseas Scholarships to SC, ST, Minority, EBC, BC, Kapu Students:
Overseas Vidya Nidhi / Overseas Scholarships /Financial Assistance to SC, ST, Minority, BC, EBC, Kapu Students for Foreign Studies (Study Abroad) i.e., Foreign PG Courses and Doctoral Courses under Overseas Scholarship Scheme/ Foreign Education Scheme (Overseas Study Scheme)

#OverseasScholarships:
AP Overseas Scholarships to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Overseas Vidya nidhi to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Overseas Scholarships to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Scholarships for Study Abroad to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Overseas Study Scheme to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Foreign Education Scheme to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018, AP Scholarships for Foreign Studies to SC, ST, Minority, EBC, BC, Kapu Students 2018,  Financial Assistance to SC, ST, Minority, EBC, BC, Kapu Students for Foreign PG Courses and Doctoral Courses

Overseas Scholarship Links: 
1. Overseas Scholarships to SC/ ST /Minority Students
2. Overseas Scholarships to BC Students
3. Overseas Scholarships to EBC Students
4. Overseas Scholarships to Kapu Students
Overseas Scholarships to SC/ ST /Minority / BC Students / EBC / Kapu Students

Post a Comment

0 Comments

f