అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు (Ambedkar Open University Degree, PG Admissions) 2018

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు (Ambedkar Open University Degree, PG Admissions) 2018 - డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు గడువు పొడిగింపు:

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలను సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడగించారు. అందరికీ విద్య అందించాలనే ఆశయంతో ఆరంభించిన విద్యా సంస్థ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ. 1982లో ఏపీ ఓపెన్‌ యూనివర్సిటీగా ప్రారంభించిన ఈ సంస్థను 1991లో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీగా మార్చారు. దేశంలోనే ఈ తరహాలో ఏర్పాటైన మొదటి విశ్వవిద్యాలయమిది. ఉన్నత విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అలాగే ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. సరికొత్త నైపుణ్యాలు, ఉన్నత అర్హతలు పొందేందుకు అవకాశం అంతగాలేని గృహిణులు, రైతులు, నైపుణ్యంగల, లేని కార్మికులు, జవాన్లు, పోలీసు సిబ్బందికి తోడు పలు కారణాలతో విద్యార్జనకు దూరమైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ తదితర సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది.

ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో 213 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసింది. 23 రీజినల్‌ కోఆర్డినేషన్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. 14 సెంటర్లను మహిళల కోసం ప్రత్యేకించడం విశేషం. చర్లపల్లి, వరంగల్‌, రాజమండ్రి, విశాఖపట్టణం, కడప, నెల్లూరు జైళ్ళలో మగ్గుతున్న ఖైదీలకు కూడా సార్వత్రిక విద్యను అందించే ఏర్పాట్లు చేయడం విశేషం. ఒక్కసారి వెనక్కు చూసుకుంటే ఈ వర్సిటీ సాధించిన ప్రగతి కళ్ళకు కడుతుంది. పెద్ద సంఖ్యలో నాన్‌ఫార్మల్‌ లెర్నర్లకు అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను అందించిన ఘనత తెలుస్తుంది. వినూత్నంగా అనేకానేక ఫౌండేషన్‌, కోర్‌, అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను డిజైన్‌ చేసింది. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో నాణ్యమైన మెటీరియల్‌ను రూపొందించింది. సైన్స్‌, టెక్నాలజీ సంబంధ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు చక్కటి ప్రయోగశాల సదుపాయాలను అభివృద్ధిపర్చింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రమారమి 54 ఎకరాల్లో అందమైన భవనాలను సమకూర్చుకుంది. చుట్టూ కొండగుట్టలు, క్యాంప్‌సలో పచ్చటి వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులు లేదా బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశాలు జరుగుతున్నాయి. 2014 నుంచి 2018 సంవత్సారాల్లో అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.
కోర్సుల వివరాలు:
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీలతోపాటు
పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీల కోర్సులతోపాటు
బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికేట్‌ కోర్సుల్లో చేరడానికి చివరి తేదిని సెప్టెంబరు 5వరకు పొడిగించారు.

కోర్సులు:
బిఎ తెలుగు మీడియం, బిఎస్సీ ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియం, బీకాం - 2018 ఎలిజిబిలిటీ టెస్ట్‌ పాసైన అభ్యర్థులు లేదా ఇంటర్‌ ఉత్తీర్ణులు లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌/ తెలంగాణ, ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నుంచి ఇంటర్‌ లేదా 2014 - 2017 మధ్య ఎలిజిబిలిటీ టెస్ట్‌ పాసైన అభ్యర్థులు ఆ కోర్సులు చేసేందుకు అర్హులు.

ఎంఏ - అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వపాలన శాస్త్రం, సమాజ శాస్త్రం(అన్నీ తెలుగు మీడియం), ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, ఉర్దూ - రెండేళ్ళు

ఇంగ్లీష్‌ మీడియం కోర్సులు:
ఎంకాం,
ఎమ్మెస్సీ(మేథ్స్‌/ అప్లయిడ్‌ మేథ్స్‌, సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, జువాలజీ - రెండేళ్ళు
ఎంఎల్‌ఐఎస్సీ - ఒక ఏడాది
బిఎల్‌ఐఎస్సీ - (తెలుగు మీడియం కూడా ఉంది) - ఒక ఏడాది

పీజీ డిప్లొమా ఇన్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఫైనాన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, రైటింగ్‌ ఫర్‌ మాస్‌మీడియా(తెలుగు మీడియం మాత్రమే), హ్యూమన్‌ రైట్స్‌(తెలుగు మీడియం మాత్రమే), కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం, డిప్లొమా ఇన్‌ ఉమన్‌ స్టడీస్‌ - ఒక ఏడాది కోర్సులు
తెలుగు మీడియంలో సర్టిఫికెట్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌, ఎన్జీఓ మేనేజ్‌మెంట్‌ - ఆరు నెలలు, ఇంగ్లీష్‌ మీడియంలో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ - ఒక ఏడాది కోర్సు) ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి.


దరఖాస్తు ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 9. 
రూ.200 ఆలస్య రుసుముతో సెప్టెంబర్‌ 29లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రవేశాలు పొందగోరే అభ్యర్థులు తమ సమీపంలోని ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయించి, దరఖాస్తుకు సర్టిఫికెట్ కాపీ జతపరిచి స్టడీ సెంటర్‌లో అందజేయాలి. అలాగే ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం పీజీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు కూడా అడ్మిషన్ ఫీజులు గడువు లోగా చెల్లించాలి. ఇతర వివరాలకు దగ్గర లోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలి.

ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను ‌వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఆన్‌లైన్‌లో నమోదు, తదితర అంశాలపై సందేహాల నివృత్తికి అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. లేదంటే హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 73829 29570 /580 /590 /600లలో సంప్రదించాలని సూచించారు.

Important Dates for PG, Degree Admissions:
1. Starting Date : 21-06-2018
2. Last Date Without Late Fee : 25-09-2018
3. Last Date With Late Fee of Rs.200/- 01-10-2018

UG (BA,B.Com,B.Sc) Admissions for the Academic year 2018-19 (Last date without late fee 25-09-2018 & with Late fee 01-10-2018) and PG (MA/MSc/Diploma/Certificate Programmes) Admissions for the Academic year 2018-19 (Last date without late fee 25-09-2018 & with Late fee 01-10-2018)

Website: https://www.braouonline.in/MISC/UGLinks.aspx

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు, అంబేద్కర్ దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, ‘అంబేద్కర్‌’ యూనీవర్సిటీలో అడ్మిషన్స్‌, BRAOU Degree PG Admissions, Ambedkar Open University Degree, PG Admissions, Ambedkar Distance Degree, PG Admissions

Post a Comment

0 Comments

f